Telangana : మహావృక్షానికి పూర్వ వైభవం.. మినీ పార్కుకు కొత్తందం.. సందర్శకులకు సంబురం...

చిగురించిన ఊడల మర్రి

Mahabubnagar : కళ తప్పిన ఊడల మర్రి మళ్లీ కళకళలాడుతోంది. ఎన్నొ సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఊడల కోలుకుంటోంది. చివరి దశలో ఉన్న చెట్టుకు ఆఖరి ప్రయత్నాలు మొదలు పెట్టడంతో జీవం పోసుకుంటోంది. సెలైన్ల ద్వారా స్పెషల్ ట్రీట్మెంట్ అందించడంతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది.

 • Share this:
  పాలమూరు జిల్లా అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది పిల్లలమర్రి. తెగుళ్ల వైరస్ కారణంగా పెద్ద పెద్ద కొమ్మలు విరిగి పోతుండడంతో అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టి దానికి పూర్వస్థితి తీసుకొచ్చారు. సైలైన్ బాటిళ్లు ఎక్కించి సూది మందులు ఇచ్చి తెగుళ్ళను నివారించారు. కొత్త ఊడలు దిగడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పైపులు సత్ఫలితాలు ఇచ్చాయి. ప్రస్తుతం పిల్లలమర్రి కొత్త ఊడలు దిగుతూ పచ్చదనంతో కళకళలాడుతుంది. ఈ వృక్షానికి 730 సంవత్సరాల చరిత్ర ఉంది. అన్నదమ్ములైన ఆశన్న (హసన్) ఉష అన్న (హుస్సేన్ )అటవీ ప్రాంతంలో నాటిన మర్రి విత్తనం పెరిగి వృక్షంగా ఎదిగిందని.. మరణాంతరం వారిని ఈ చెట్టు కిందే సమాధి చేశారని చెబుతారు. గతంలో ఈ ప్రాంతం దట్టమైన అడవి ఉండేదట. గిరిజనుల వేట కోసం వెళితే వారి పిల్లలు ఈ చెట్టుకు ఉయ్యాలలు కట్టి ఊగే వారని దీంతో ఈ చెట్టుకు పిల్లల మర్రి గా పేరు వచ్చిందని కూడా ప్రచారం ఉంది.

  పల్లె వాతావరణం ఉట్టిపడేలా..

  1976లో అటవీశాఖ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి జిల్లా కలెక్టర్ కాశీ పాండ్యన్ ఈ వృక్షాన్ని పరిశీలించి విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించడంతో పిల్లలమర్రి గుర్తింపు లోకి వచ్చింది. ఇక్కడ పలు సినిమాలను సైతం చిత్రీకరించారు. అంతేకాక ఈ వృక్షం మొదలు వేరు ఎక్కడ ఉందో తెలియదు కానీ ఇది తెలుసుకోవడానికి జాతీయస్థాయిలో సైంటిస్టులు సైతం ఈ వృక్షం కనుక్కోవడానికి ప్రయత్నించారు. కానీ ఈ మర్రి మొదటి వేరు కనుక్కోలేకపోయారు. కొన్ని నెలల నుండి మర్రిచెట్టు ఎండిపోయి కొమ్మలు విరిగిపోవడం జరుగుతుండేది. ఇది చూసిన జిల్లా అధికారులు దానిని మళ్లీ జీవం పోశారు. రాత్రి పగలు సెలైన్ పెట్టి దాన్ని బతికించారు. ఇప్పుడు అటవీశాఖ అధికారులు పిల్లలమర్రిని మినీ జూ పార్క్ గా అందంగా ముస్తాబు చేస్తున్నారు. పార్క్ లోని గోడ లన్నిటిని టెర్రకోట వర్లీ ప్రింటింగ్ ల తో తీర్చిదిద్దుతున్నారు. పల్లె వాతావరణం ఉట్టి పడేలా బొమ్మలు, చేతి వృత్తిదారుల చిత్రాలు, పచ్చదనం పై అవగాహన అందించే వాటిని కళాకారులు చిత్రీకరిస్తున్నారు. దీంతో ఇదివరకు కళావిహీనంగా ఉన్న పార్కు పరిసరాలు ప్రస్తుతం చూపరులను ఆకట్టుకుంటున్నాయి పర్యాటకులను మైమరిపించే లా చేస్తున్నాయి.

  pillalamarri, mahabubnagar, tourist place
  పార్క్ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బోర్డ్


  సెలైన్లతో మనిషి ప్రాణాలను కాపాడినట్లు ఊడల మర్రిని కాపాడటంలో అధికారులు సఫలం అయ్యారు. వెలవెలబోయిన ఊడల మర్రీ మళ్లీ చిగురించడంతో జిల్లా వాసులు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: