Health : బాదంపాల వల్ల అంతరించిపోతున్న తేనెటీగలు...

ప్రపంచవ్యాప్తంగా ఏటా బాదంపాలకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా తేనెటీగల సంఖ్య తగ్గిపోతోంది. దానికీ దీనికీ సంబంధమేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 11, 2020, 1:15 PM IST
Health : బాదంపాల వల్ల అంతరించిపోతున్న తేనెటీగలు...
బాదంపాల వల్ల అంతరించిపోతున్న తేనెటీగలు...
  • Share this:
తేనెటీగలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తున్నాయి. చక్కటి తేనె సేకరించి ఇవ్వడమే కాదు... పుప్పొడిని సరఫరా చేస్తూ... మొక్కలు, చెట్లకు పూలు, పండ్లు కాసేలా చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. అలాంటి తేనెటీగలు... బాదంపాల వల్ల ప్రాణాలు కోల్పోతుండటం విచారకరం. ఐతే... మీకు డౌట్ వచ్చే ఉంటుంది. బాదంపాలకూ, తేనెటీగలు అంతరించిపోతుండటానికీ కారణమేంటని. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా బాదంపాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే మామూలు పాలలో కంటే... బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల అమెరికా లాంటి దేశాల్లో ప్రజలు బాదంపాలను తెగ వాడేస్తున్నారు. మీకు తెలుసా... 2018-19 శీతాకాలంలో... ప్రపంచవ్యాప్తంగా 5000 కోట్ల తేనెటీగలు చనిపోయాయి. అంటే... ప్రపంచ జనాభా కంటే... ఏడు రెట్లు ఎక్కువ. ఇన్ని తేనెటీగలు చనిపోయాయంటే నమ్మలేం. కానీ అదే నిజం.

బాదంపాల వల్ల అంతరించిపోతున్న తేనెటీగలు...


2000 సంవత్సరం నుంచీ ఏటా తేనెటీగల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఏటా తేనెటీగలు చనిపోతూనే ఉన్నాయి. ఐతే... తేనెటీగల పెంపకందార్లు... వాటిని కాపాడుతూ... వాటి సంఖ్యను నిలబెడుతూ వస్తున్నారు. అలాంటిది... ఈసారి మాత్రం అత్యంత ఎక్కువగా అవి చనిపోయాయని... ఇదివరకు ఎప్పుడూ ఇంత ఎక్కువగా చనిపోలేదని అంటున్నారు. ఇందుకు కారణం బాదం పాలే అంటున్నారు. ఎందుకంటే... బాదంపాలకు డిమాండ్ పెరగడంతో... అమెరికాలో బాదం చెట్ల సాగు విపరీతంగా పెంచేశారు. ఎక్కువ బాదం దిగుబడి కావాలని... విపరీతంగా పురుగు మందులు వాడుతున్నారు. ఆ పురుగు మందులు తేనెటీగలకు పడట్లేదు. ఫలితంగా అవి చచ్చిపోతున్నాయి. మరో విషయం కూడా ఉంది. ఈ బాదం చెట్ల వల్ల ఓ రకమైన సూక్ష్మజీవి (Parasite) బాదం చెట్లపై జీవిస్తోంది. అది తేనెటీగల ప్రాణాలు తీస్తోందని పరిశోధనల్లో తేలింది. బాదంపాలు తయారుచేస్తున్న కంపెనీలు... తేనెటీగల చావుకి కారణం అవుతున్నాయని బీ-కీపర్స్ (తేనెటీగల పెంపకందార్లు) మండిపడుతున్నారు.


మీకు తెలుసా... అమెరికాలో ఏటా చేపలు, జంతువుల వధ కంటే... ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నవి తేనెటీగలే. వాటికి రెట్టింపు సంఖ్యలో అవి చనిపోతున్నాయి. గత ఐదేళ్లలో బాదంపాలకు డిమాండ్ బాగా పెరిగింది. మరే ఇతర మొక్కల ఆధారిత పాలకూ ఇంత డిమాండ్ ఏర్పడలేదు. ఫలితంగా తేనెటీగలు చనిపోతున్నాయి. దీనిపై స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఎలాంటి ఫుడ్ తేనెటీగలకు హాని చెయ్యదో చెబుతూ... దాన్నే తినమని ప్రజలకు సూచిస్తున్నాయి.
First published: January 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు