YOUNG MAN GETTING HUGE PROFITS WITH LILY CULTIVATION IN PEDDAPALLI DISTRICT VB KNR
Telangana: కరోనా కారణంగా ఉద్యోగం పోయింది.. కానీ ఇప్పుడు అతనికి డబ్బులే డబ్బులు.. అదెలాగో తెసుకోండి..
లిల్లీలను అమ్ముతున్న శ్రావణ్
Lilly Cultivation: కరోనా గత ఏడాది నుండి ఎంతో మంది బ్రతుకులను చిందర వందర చేసింది. దీనితో ఒక్కసారిగా చాలా మంది ప్రైవేట్ జాబ్స్ నుండి ఆయా కంపనీలు తీసివేశాయి. ఓ ప్రైవేట్ జాబ్ చేసే వ్యక్తి ని కరోనా నేపథ్యంలో జాబ్ నుండి తీసివేశారు. ఆ ఉద్యోగం నుండి తీసివేయడమే తనకు కలిసి వచ్చింది అంటున్నాడు పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలానికి చెందిన కాల్వల శ్రవణ్.
కరోనా మహమ్మారి భయంతో ఆస్పత్రి ల్యాబ్ లో పనిచేస్తున్న యువకుడు ఇంటి దారి పట్టాడు . ఉన్న ఉద్యోగం పోవడంతో ఏం చేయాలో అర్థం కాక వ్యవసాయం వైపు అడుగులు వేశాడు . ఆధునిక విధానంలో సేద్యం చేయాలని నిర్ణయించుకుని , యూట్యూబ్ లో సెర్చ్ చేశాడు. ఉపాధిలో పూలబాట ను ఎంచుకున్నాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన కల్వల శ్రావణ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామానికి చెందిన కల్వల శ్రావణ్ అనే యువకుడు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేసేవాడు . అయితే ఏడాది క్రితం కరోనా మహమ్మారి భయానికి ఆ ఉద్యోగం నుండి తీసివేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు . తనకున్న వ్యవసాయ భూమిలో అగ్రికల్చర్ చేద్దాం అనుకున్నాడు . కానీ అందరిలా వరి , మొక్కజొన్న పంటలు వేస్తే ఏం లాభం ఉంటుందని డిఫరెంట్ గా ఆలోచించాడు .
నిత్యం డబ్బులు వచ్చే ఏదైనా పంటలు సాగుచేయాలని ఆలోచన చేశాడు . సరైన పంటకోసం యూట్యూబ్ లో సెర్చ్ చేశాడు . అలా .. లిల్లీ పూలు సాగు చేద్దామని డిసైడ్ అయ్యాడు . తనకున్న ఎకరం పొలంలో బెంగళూరు నుంచి లిల్లీ మొక్కలను తీసుకొచ్చి నాటాడు . 70 వేల రూపాయల పెట్టుబడి అయ్యిందని చెబుతున్నాడు శ్రావణ్ . కేవలం మూడు నెలల్లో క్రాప్ వచ్చింది . రోజుకు ఎనిమిది, నుండి పది కిలోల లిల్లీ పూలు మార్కెట్లో అమ్ముతున్నారు . కిలోకు వంద నుండి నూటయాభై రూపాయల ధర పలుకుతోంది . సీజన్లో మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఉండడం తో ఈ లిల్లి పూల సాగు లాభాలు తెచ్చిపెట్టాయని శ్రావణ్ చెప్పుకొచ్చాడు .
ఆ గ్రామంలో రైతులంతా శ్రావణ్ ను విచిత్రంగా చూస్తున్నారు . వాణిజ్య పంట లిల్లీ సాగు చేసి రోజుకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడని ఆశ్చర్యపోతున్నారు . వరి , మొక్కజొన్న మిగితా పంటలు కాకుండా ఇలాంటి పూలతోటల పెంపకంతో అధిక లాభాలు గడించవచ్చని రైతులు చర్చించుకుంటున్నారు . శ్రావణ్ పరిసర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు . ప్రభుత్వం కూడా ఇలాంటి పూల సాగు చేసే రైతులకు ప్రోత్సాహాన్ని కల్పించి రుణాలు అందిస్తే యువత ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారని స్థానిక రైతులు అంటున్నారు . ఏది ఏమైనా కోవిడ్ మహమ్మారి వల్ల ఓ ఉద్యోగం పోయిందనుకుంటే ... మరో మంచి ఆదాయాన్నిచ్చే లిల్లీ సాగు లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు శ్రావణ్ , అతని తల్లిదండ్రులు. ప్రభుత్వం పరంగా ఆదుకుంటే ఇంకా కొంత భూమిని కౌలుకు తీసుకోని ఈ లిల్లీ పంటను ఇంకా పెద్ద ఎత్తున సాగు చేయాలని శ్రవణ్ భావిస్తున్నాడు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.