Home /News /life-style /

YOU WILL GET WEALTH AND MONEY IF YOU HAVE THESE ITEMS IN YOUR CUPBOARD OR BEERUVA PRV

Astrology | Vastu tips: మీ బీరువాలో ఈ వస్తువులు పెడితే.. లక్ష్మీదేవీ మీ ఇంటి గుమ్మం తొక్కడం ఖాయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందట. ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కును బట్టి ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి మనకి ధనపరంగా బాగా కలిసి వస్తుంది.

    జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, ఒక వ్యక్తి ప్రేమలో విజయం సాధిస్తాడా లేదా అనేది కూడా అతని జన్మ రాశి మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తులు ఏ రాశిలో జన్మించారు? ఏ గ్రహాలు వాటిపై ప్రభావం చూపుతాయి. దీని ప్రకారం, వ్యక్తి స్వభావం వారి ప్రవర్తన, విజయం, వివాహం కూడా జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. రాశులు కూడా ప్రభావితమవుతాయి. వాస్తుశాస్త్రం (Vastu) ప్రకారం కొన్నింటిని తప్పకుండా నమ్మాలి…పాటించాలి. ముఖ్యంగా ఇంటి (Home) విషయంలో ప్రతిదీ వాస్తుప్రకారం ఉంటేనే సుఖశాంతులు ఉంటాయని పండితులు అంటున్నారు. అయితే చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా డబ్బు నిలవదు.. ఆర్థికంగా కష్టాల్లోనే ఉంటారు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టం తలుపు తడుతుందట. వాస్తు శాస్త్రం ప్రకారం బీరువా (Beeruva)లో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందట. ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కును బట్టి ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి మనకి ధనపరంగా బాగా కలిసి వస్తుందట.

    బీరువా తలుపులు తెరవగానే..

    ఎవరైనా సరే ఇంట్లో నైరుతి దిక్కులో బీరువాను (Cupboard) ఏర్పాటు చేసుకోవాలి, నైరుతిలో కూడా దక్షిణం నైరుతి పడమర నైరుతి అని రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండిటిలో కూడా దక్షిణ నైరుతిలో బీరువా ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణ నైరుతిలో బీరువా పెట్టినప్పుడు మనం బీరువా తలుపులు తెరవగానే ఆ బీరువా తలుపులు ఉత్తరం దిక్కును చూస్తూ ఉంటాయి, ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఉత్తర దిక్కులో ఉన్న కుబేరుడు వచ్చి మీ బీరువాలో కూర్చుంటాడట. కాబట్టి బీరువా అనేది దక్షిణ నైరుతిలో ఏర్పాటు చేసుకోవాలి.



    బీరువా (Beeruva) ఇంట్లో దక్షిణ నైరుతిలో పెట్టుకున్నప్పుడు చాలామంది తెలియక ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో ఉంచుతారు, బీరువాలో కూడా ఎరుపు రంగు వస్త్రం ఉంచకూడదు, తెల్లటి కాటన్ వస్త్రాన్ని బీరువాలో ఏర్పాటు చేయాలి దానికి కారణం ఏమిటంటే నవగ్రహాలలో శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు.శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల కనకవర్షం కురవాలంటే బీరువాలో తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలట.

    బీరువా (Cupboard) లోపలి తలుపుకి కుడి చేతితో బంగారం నాణాలు వర్షిస్తూ వరద ముద్రలో పద్మంలో కూర్చుని ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రం ఉంటే మంచిదట.  లక్ష్మీదేవికి వట్టివేళ్ళు అంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి విగ్రహాంకి అభిషేకం చేసేటప్పుడు కూడా వట్టివేళ్ళు కలిపినా నీళ్లతో అభిషేకం చేస్తారు. అలాగే విష్ణుమూర్తికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం అందుకే విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తారు, విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చ కర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వట్టి వేళ్ళు ఈ రెండు కూడా ఒక వెండి పాత్రలో లేదా రాగి పాత్రలో ఉంచి బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి.

    ఎవరైతే ఇలా వట్టివేళ్ళు ,పచ్చ కర్పూరం వెండి లేదా రాగి పాత్రలో ఉంచి ఆ పాత్ర బీరువాలో ఉంచుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఆనందతాండవం చేస్తుందట. స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Astrology, Money, Vastu Tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు