ఆధునిక యుగంలో మనిషి ఆరోగ్యంగా ఉండటం కంటే అందంగా కనిపించడం కోసమే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. లేనివీ పోనివీ ఫేస్ ప్యాక్‌లు(face packs), క్రీమ్‌లు, హెయిర్ ఆయిల్లు వాడి ఉన్న జుట్టు, అందాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే మనిషి అందానికి కేశాలు (hair) కూడా ముఖ్యమే. కానీ, సగటు జీవిలో జుట్టు రాలిపోతుండటాన్ని(hair loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. అలాంటి జుట్టు పొడుగుగా(long) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సత్ఫలితాలిస్తాయంట.
మృదువుగా కావాలంటే..
కొందరికి స్ట్రాంగ్ జుట్టు (strong hair) ఉంటే మరికొందరి జుట్టు చాలా మృదువుగా (smooth)..సున్నితంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇటువంటి వారు వారి జుట్టు (hair) విషయంలో ఎక్కువ జాగ్రత్తలు (care) తీసుకోవాలి. చాలామంది తరచూ షాంపూలు (shampoo) మారుస్తూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదు. ఏ షాంపూ వల్ల అయితే మీ జుట్టులో కాస్తైనా మెరుగైన మార్పు వచ్చింది అనిపిస్తే ఇక ఆ షాంపు (one shampoo)కే ఫిక్స్ అవ్వండి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మీ జుట్టును అందంగా (beautiful) పొడవుగా పెరిగేలా చేయొచ్చు.
కుదుళ్ళ వరకు వెళ్లేలా..
షాంపూ (shampoo)ను మరి ఎక్కువ వేసుకోకండి. ఒక కాయిన్ సైజ్ (coin size) లో షాంపూను రెండు సార్లు అప్లై చేస్తే చాలు. షాంపూ అప్లై చేసేటప్పుడు బాగా మర్దన లాగా కుదుళ్ళ వరకు వెళ్లేలా చేయండి. శుభ్రం చేసేటప్పుడు కూడా జుట్టు నుండి షాంపూ మొత్తం వెళ్లి పోయే దాకా నీటితో బాగా కడగండి. వీలైనంత వరకు తలను ఆర పెట్టుకోవడానికి హెయిర్ డ్రయ్యర్ (hair drier) వాడక పోవడమే మంచిది. దానికి బదులుగా ఒక పదినిమిషాలు అధికంగా కేటాయించి కాటన్ బట్టతో శుభ్రంగా తుడుస్తూ ఆరపెట్టుకోండి.
ఇవి కూడా చదవండి: 26 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ ఇన్‌ఫ్లూయన్సర్ల డేటా లీక్.. గుర్తించిన సెక్యూరిటీ పరిశోధకులు
బయట పొల్యూషన్ (pollution) వల్ల మీ తలపై చుండ్రు వంటివి వచ్చినప్పుడు ఈజీ (easy)గా తీసుకోకుండా వెంటనే చుండ్రును పోగొట్టేలా వేపాకు పేస్ట్, మెంతుల పేస్ట్ వంటివి ఉపయోగించి చుండ్రు (dandruff) ని వదిలించుకోండి. కనీసం వారానికి రెండు సార్లైనా తలస్నానం చేయడం అలవాటు చేసుకోండి.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?
ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beauty tips, Hair fall, Hair Loss