Home /News /life-style /

Eye Care: చల్లని వాతావరణంలో కంటి సమస్యలు.. అధిగమించండి ఇలా..

Eye Care: చల్లని వాతావరణంలో కంటి సమస్యలు.. అధిగమించండి ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శరీర భాగాల్లో అతి ముఖ్య భాగమైన కంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనలోనే చాలా మందికి పొడి కళ్ళు, కంటి శుక్లం, మాక్యులర్ క్షీణత వంటి మరెన్నో కంటి సంబంధిత సమస్యలు వస్తుంటాయి.

  అందంగా కనపడాలంటే కేవలం ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు.. అందమైన కళ్ళు కూడా ఉండాలి. అయితే, చలికాలంలో చర్మ సమస్యలతో పాటు కంటి సమస్యలు కూడా అధికంగా వస్తుంటాయి. దీంతో ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో మీ కళ్ళ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. వీటి సంరక్షణకై ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. శరీర భాగాల్లో అతి ముఖ్య భాగమైన కంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనలోనే చాలా మందికి పొడి కళ్ళు, కంటి శుక్లం, మాక్యులర్ క్షీణత వంటి మరెన్నో కంటి సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలకు అధిక ఒత్తిడి, స్మార్ట్ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం, తరచూ కంప్యూటర్ తెరపై గడపడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మరికొన్ని కాలానుగుణంగా లేదా వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా కూడా రావొచ్చు. ముఖ్యంగా, ఎక్కువ మందిని పొడి కన్ను సమస్య వెంటాడుతుంది. కళ్ళలో కన్నీళ్లు తగినంతగా ఉత్పత్తి చేయకపోవడం, ఉష్ణోగ్రతలు తగ్గడం కూడా పొడి కన్ను సమస్యకు దారితీస్తుంది. కాగా, కంటి సమస్యలపై న్యూఢిల్లీలోని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తుషార్ గ్రోవర్ మాట్లాడుతూ "కొన్ని అంతర్లీన పరిస్థితులు తరచుగా పొడి కంటి సమస్యకు దారితీస్తాయి.

  కాని తక్కువ తేమ, చల్లని ఉష్ణోగ్రత, గాలులతో కూడిన వాతావరణం వంటి సాధారణ కారణాలతో కొంతమందిలో ఈ సమస్య అధికమవుతుంది. అందువల్ల, శీతాకాలంలో కళ్ళపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక, అప్పుడప్పుడూ కంటి చుక్కలను వేసుకోవాలని వారు సిఫార్సు చేస్తున్నారు. వీటితో పాటు ఆరోగ్యకరమైన కళ్ళకు పోషక అవసరాలను నొక్కి చెబుతున్నారు. ఈ శీతాకాలంలో మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ఈ ఆహారాలను తీసుకోవాలని వారు పేర్కొంటున్నారు.

  ఆరోగ్యకరమైన కళ్ళకు 5 శీతాకాల ఆహారాలు..
  ఆమ్లా
  విటమిన్ ‘సి’(vitamin C) ఎక్కువగా ఉంటే ఆమ్లా(Amla) మీ శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేకాక, మీ కళ్ళు అద్భుతంగా పనిచేసేలా సహకరిస్తుంది. ఇది మీ రెటీనా సంబంధిత సమస్యలను తగ్గించి, రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

  ఆరెంజ్
  కళ్ళ సమస్యలను దూరం చేసే విటమిన్ ‘సి’ ఆరెంజ్(Orange )లో ఎక్కువగా ఉంటుంది. ఆరెంజ్ మీ కళ్ళలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాక, ఆరెంజ్లోని అధిక నీటి కంటెంట్ కళ్ళను ఎల్లప్పుడూ హైడ్రేట్గా ఉంచుతుంది. దీంతో పొడి కళ్ళ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

  గువా
  శీతాకాలంలో విరివిగా లభించే గువా(Guava) పండులో గొప్ప పోషక పదార్థాలు ఉంటాయి. ఇది మీ కంటి చూపును పెంచడంలో, వయసు పెరుగుతున్న కొద్ది వచ్చే కళ్ళ సమస్యలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.

  Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

  మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

  చిలగడదుంప
  చిలగడదుంప(Sweet potato)లో విటమిన్ ‘ఎ’, బీటా కెరోటిన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.- ఈ రెండూ మీ కళ్ళను ఆరోగ్యకరంగా ఉంచడానికి బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా, బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇక విటమిన్ ‘ఎ’ విషయానికి వస్తే ఇది కంటి పొడి సమస్యలను తగ్గిస్తుంది.

  బచ్చలికూర
  శీతాకాలపు ఆకుపచ్చ కూరల్లో బచ్చలికూర(Spinach) ప్రసిద్ది చెందింది. ఇది ఆప్టిక్ నరాల క్షీణతను నివారించడానికి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉండే ఫోలిక్ ఆమ్లం కంటి సమస్యలను దూరం చేస్తుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన కళ్ళ కోసం బచ్చలికూరను మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చాలని నిపుణులు తరచూ సలహా ఇస్తారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Eye sight

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు