Health Benefits Of Eggs: గుడ్లు తింటే ఈ 5 ప్రయోజనాలు పొందవచ్చు..

గుడ్లు తినడం ద్వారా ఎన్నో పోషకాలను పొందవచ్చు

పురాతన కాలం నుంచి గుడ్లు మానవులు తీసుకునే ఆహారంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో పోషక విలువలున్న గుడ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి

  • Share this:
    Eggs, Health Benefits Of Eggs, nutrients In Eggs, Benefits With Eating eggs, ఎగ్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్, ఎగ్స్‌లో ఉండే పోషకాలు
    పురాతన కాలం నుంచి గుడ్లు మానవులు తీసుకునే ఆహారంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గుడ్డు రుచికరంగా ఉండటమే కాకుండా.. ఎన్నో పోషక విలువలున్న దివ్యమైన ఆహారం.పేదల నుంచి ధనికుల వరకు.. అందరికీ అందుబాటులో దొరికే ఈ గుడ్డు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. శరీరానికి తక్కువ కెలరీలు, నాణ్యత కలిగిన ప్రోటీన్స్‌ను అందజేస్తాయి.


    Eggs, Health Benefits Of Eggs, nutrients In Eggs, Benefits With Eating eggs, ఎగ్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్, ఎగ్స్‌లో ఉండే పోషకాలు
    ఎక్కువ ప్రోటీన్స్‌తో చాలా చౌకగా లభించే గుడ్లను వివిధ రూపాల్లో వంటకాల్లో వాడుతుంటారు. ఇందుకోసం పలు దేశీయ పక్షులను కూడా చాలా మంది పెంచుకుంటుంటారు.


    ఎక్కువ ప్రోటీన్స్‌తో చాలా చౌకగా లభించే గుడ్లను వివిధ రూపాల్లో వంటకాల్లో వాడుతుంటారు. ఇందుకోసం పలు దేశీయ పక్షులను కూడా చాలా మంది పెంచుకుంటుంటారు.
    ఎక్కువగా ఉష్ట్రపక్షి, కోడి గుడ్లను ఎక్కువగా తింటుంటారు. అపారమైన పోషకాలు ఉన్న చాలా డైట్‌లో ప్రధానంగా వినియోగిస్తున్నారు. మంచి ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు మూడు గుడ్ల వరకు తినొచ్చు. గుడ్లు తినడం వల్లే కలిగే 5 ప్రయోజనాలను ఒక్కసారి చుద్దాం.


    Eggs, Health Benefits Of Eggs, nutrients In Eggs, Benefits With Eating eggs, ఎగ్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్, ఎగ్స్‌లో ఉండే పోషకాలు
    1.గుండె సంబంధిత వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తుంది.. తక్కువ సాంద్రత గల లిపో ప్రోటిన్‌ను సాధారణంగా ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్‌గా పిలుస్తారు. ఇది గుండె సంబంధిత వ్యాధులు రిస్క్‌ను పెంచుతోంది. ఎక్కవ పరిమాణంలో ఉండే ఎల్‌డీఎల్ కన్నా.. తక్కువ పరిణామంలో ఉండేవి గుండెకు హాని చేస్తాయి. ఇక, గుడ్లలో మధ్యస్థంగా ఉండే ఎల్‌డీఎల్ కోలెస్ట్రాల్.. గుండె సంబంధింత వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తాయి.


    Eggs, Health Benefits Of Eggs, nutrients In Eggs, Benefits With Eating eggs, ఎగ్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్, ఎగ్స్‌లో ఉండే పోషకాలు
    2. కొలెస్ట్రాల్ నియంత్రణలో.. గుడ్లలో తీసుకోవడం ద్వారా ఎక్కువ సాంద్రత గల లిపొప్రోటీన్స్ శరీరానికి లభిస్తాయి. దీనిని మంచి కోలెస్ట్రాల్ అంటారు. ఇది కొలెస్ట్రాల్‌ నిర్వహించడానికి సాయపడుతుంది.




    Eggs, Health Benefits Of Eggs, nutrients In Eggs, Benefits With Eating eggs, ఎగ్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్, ఎగ్స్‌లో ఉండే పోషకాలు
    3. కోలైన్ కలిగి ఉండటం.. శరీరానికి కోలైన్ అనేది శరీరానికి అవసరమైన మఖ్యమైన పోషకం అని చాలా మందికి తెలియదు. ఇది కాలేయ పనితీరు, మెదడు అభివృద్ధి, నాడి ఫంక్షన్ లో కీలక పాత్ర పోషిస్తుంది. గుడ్లలో కోలైన్ అనేది సమృద్దిగా లభిస్తోంది. ఒక్క గుడ్డులో 100 ఎంజీల కోలైన్ దొరుకుతుంది.


    Eggs, Health Benefits Of Eggs, nutrients In Eggs, Benefits With Eating eggs, ఎగ్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్, ఎగ్స్‌లో ఉండే పోషకాలు
    4. కంటి ఆరోగ్యం.. ప్రతి వ్యక్తి కంటి ఆరోగ్యం అనేది పలు కారణాల చేత ప్రభావితమవుతుంది. ఒకవేళ వయసు పైబడుతున్న కొద్ది కంటి ఆరోగ్యం క్షీణించినట్టయితే.. పోషకాల ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా చూడటంతో కీలక భూమిక పోషిస్తాయి. ఈ రెండు పోషకాలు గుడ్ల సోనలో గణనీయమైన మోతాదులో ఉన్నాయి.


    Eggs, Health Benefits Of Eggs, nutrients In Eggs, Benefits With Eating eggs, ఎగ్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్, ఎగ్స్‌లో ఉండే పోషకాలు
    5. బరువు తగ్గించడంలో.. గుడ్లలో ఉండే అధిక పోషకాలు ఉంటాయి. ఇది తినడం ద్వారా తక్కువ కెలరీలను శరీరానికి అందుతాయి.. దీంతో బరువు తగ్గడం తేలిక అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
    Published by:Sumanth Kanukula
    First published: