తొక్కే కదా అని తీసి పారేయొద్దు...అరటి తొక్కతో అద్భుత ప్రయోజనాలు

అరటి పండు తొక్కతో ఎన్నో లాభాలున్నాయి. దాని ప్రయోజనాలు తెలిస్తే ఇకపై ఎప్పుడూ తొక్కని విసిరేయరు.

news18
Updated: February 21, 2019, 9:28 PM IST
తొక్కే కదా అని తీసి పారేయొద్దు...అరటి తొక్కతో అద్భుత ప్రయోజనాలు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: February 21, 2019, 9:28 PM IST
  • Share this:
అరటి పళ్లను అందరూ ఇష్టంగా తింటారు. బాకా ఆకలిగా ఉన్నప్పుడు రెండు అరటి పళ్లు తింటే చాలు...కడుపు నిండిపోతుంది. ఈ తీయటి పండుతో ఆరోగ్యమే కాదు.. అందమూ పెరుగుతుంది. పండు ఆరోగ్యాన్ని అందిస్తే..దాని తొక్క సౌందర్యాన్ని ప్రసాదిస్తుంది. అవును.. మీరు విన్నది నిజమే..! అరటి పండు తొక్కతో ఎన్నో లాభాలున్నాయి. దాని ప్రయోజనాలు తెలిస్తే.. ఇకపై ఎప్పుడూ తొక్కని తీసి పారేయరు.

అరటి తొక్కతో ప్రయోజనాలు


  • అరటి పండులో విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటుంది. మన శరీరానికి కావల్సిన  ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం అందిస్తుంది. అలాగే అరటి తొక్కతోనూ మనకు ఎన్నో ఉపయోగాలున్నాయి.

  • దంతాలు మిలమిలా మెరవాలంటే అరటి తొక్కతో వారానికి ఓ సారి పళ్లు తోమండి. కనీసం రెండు నిమిషాల పాటు రుద్దితే పళ్లు శుభ్రపడతాయి.

  • ముఖంపై ముడతలు పోగొట్టేందుకు అరటి తొక్క సాయపడతుంది. అరటి తొక్క పేస్టును ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. అలా కొన్ని రోజుల పాటు చేస్తే ముడతలు పోతాయి.

  • అంతేకాదు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి ఉన్నచోట అరటి తొక్కను రుద్దాలి. కాసేపట్లోనే నొప్పి మటు మాయం అవుతుంది.
  • ముఖంపై మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలను పోగొడుతుంది. మొటిమలపై అరటి గుజ్జుతో మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేయాలి.

  • రెండు రోజులకోసారి అరటి తొక్కతో ముఖాన్ని మసాజ్ చేసుకుంటే... చర్మం మృదువుగా,  సున్నితంగా మారుతుంది. మరింత కాంతివంతంగా మెరుస్తుంది.

  • అరటి పండు తొక్కను తినవచ్చు కూడా. అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు రకాల వంటకాల్లోనూ అరటి తొక్కను ఉపయోగిస్తారు.

First published: February 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading