Home /News /life-style /

YOU CAN TAKE THESE FOODS FOR PROTEINS IF YOU ARE VEGETARIAN AK

మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాస్తవానికి గుడ్లు హైలెవల్ కొలెస్ట్రాల్ ఫుడ్ అయినప్పటికీ ఆరోగ్యానికి ఇవి ఎటువంటి హాని కలిగించవని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే, కొంత మంది శాఖాహారులు గుడ్డు తినడానికి ఇష్టపడరు. అటువంటి వారు గుడ్డులోని ప్రోటీన్ విలువలను మిస్ అవుతుంటారు.

ఇంకా చదవండి ...
    భారతదేశంలో గుడ్ల వినయోగం చాలా ఎక్కువ. గుడ్లలో ఉండే విలువైన పోషక పదార్థాల దృష్ట్యా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రోజుకి ఒక గుడ్డు తినమని వైద్యులు సలహాలిస్తుంటారు. ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వాస్తవానికి గుడ్లు హైలెవల్ కొలెస్ట్రాల్ ఫుడ్ అయినప్పటికీ ఆరోగ్యానికి ఇవి ఎటువంటి హాని కలిగించవని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే, కొంత మంది శాఖాహారులు గుడ్డు తినడానికి ఇష్టపడరు. అటువంటి వారు గుడ్డులోని ప్రోటీన్ విలువలను మిస్ అవుతుంటారు. మరి అటువంటి వారు గుడ్లకు బదులు ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆహారాన్ని తినాలో తెలుసుకుందాం.

    ప్రోటీన్ అంటే?
    మానవ శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి, అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి ప్రోటీన్లు బాగా ఉపయోగపడుతాయి. శరీరంలో ప్రోటీన్లు తగినంతగా లేకపోతే తరచూ అనారోగ్యానికి గురవుతాము. కాబట్టి, ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సలహాలిస్తుంటారు.

    ప్రోటీన్ ఆవశ్యకత ఏమిటి?
    వ్యాధుల నుంచి బయటపడటానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రోటీన్లు ఎంతగానో సహాయపడుతాయి. అంతేకాకుండా, ప్రోటీన్లు గల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా చర్మం, జుట్టు, వేళ్లు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇది మీ శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాకుండా మీ ముఖాన్ని అందంగా మారుస్తుంది.

    గుడ్లలో ప్రోటీన్లు ఉంటాయా?
    గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అందువల్లే ప్రతి రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు తినాలని డాక్టర్లు సలహాలిస్తుంటారు. గుడ్డును తక్కువ క్యాలరీలు గల ఆహారంగా పేర్కొనే గుడ్లలో 6.42 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.

    పీనట్ బటర్
    శాఖాహారులు గుడ్లకు బదులు పుష్కలంగా ప్రోటీన్లు లభించే పీనట్ బటర్ను తీసుకోండి. ఎందుకంటే దీనిలో 7 గ్రాముల ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వెజిటేబుల్ స్టిక్స్ లేదా శాండ్విచ్తో పీనట్ బటర్ తింటే రుచికరంగా ఉంటుంది.

    క్వినోవా
    మెరుగైన రోగనిరోధక శక్తిని మెయింటైన్ చేయడానికిప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ప్రోటీన్లు పుష్కలంగా లభించే గుడ్లను తినని వారు ప్రత్యామ్నాయంగా క్వినోవా కిచిడీ వంటకాన్ని ప్రయత్నించండి. ఒక కప్పు క్వినోవా కిచిడీలో 8 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.

    బాదం పప్పు
    శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చే డ్రైఫ్రూట్స్లో బాదం పప్పుది కీలక పాత్ర. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టడంతో పాటు జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బాదం పప్పులో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కేవలం పావు కప్పు బాదంలో 7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.

    పెరుగు
    మీ రోజు వారి ఆహారంలో పెరుగు చేర్చండి. ఎందుకంటే పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పు పెరుగులో 23 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.

    సోయాబీన్
    గుడ్లు తినని శాకాహారులకు మంచి ఎంపిక సోయాబీన్. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పు సోయాబీన్లో 28 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.

    గుమ్మడికాయ గింజలు
    ప్రోటీన్లు, ఖనిజాలు, బమేగా కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభించే విత్తనాలను ఆహారంలో చేర్చడం ద్వారా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా గుమ్మడికాయ గింజలు శరీర జీవక్రియను మెరుగుపర్చి జీవక్రియను సులభతరం చేస్తాయి. కుకీస్, జ్యూస్ తయారీలో కేవలం 30 గ్రాముల గుమ్మడికాయ గింజలను వాడితే చాలు 9 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.

    Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్‌.. ఆ తరువాతే అమలు చేస్తారా ?

    KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

    Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

    Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

    కాటేజ్ చీజ్
    శాకాహారులు అత్యంత ఇష్టపడే వాటి కాటేజ్ చీజ్ ఒకటి. వివిధ వంటకాల్లో ఉపయోగించే దీన్ని పన్నీర్ అని కూడా అంటారు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనిలో పోషక పుదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పు కాటేజ్ చీజ్లో 24 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Vegetables

    తదుపరి వార్తలు