Home /News /life-style /

Spoiled milk uses: పాలు పాడైపోతే పారేయకండి.. వీటితో ఎన్ని ఉపయోగాలు తెలుసా?

Spoiled milk uses: పాలు పాడైపోతే పారేయకండి.. వీటితో ఎన్ని ఉపయోగాలు తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పాలు పాడవ్వకుండా ఉండటానికి రోజుకు రెండుమూడుసార్లు వేడి చేయండి. లేదా ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.అయితే వాతావరణంలో మార్పులు వల్ల కొన్నిసార్లు పాలు పాడైపోతాయి.దీంతో చెత్తలో పడేస్తాం. అయితే చెడిపోయిన పాలతో అద్భుతమైన డెసర్ట్‌లు తయారు చేయవచ్చు.

ఇంకా చదవండి ...
ఇక పై మీ ఇంట్లో పాలు (Milk) పాడైపోతే.. ఆందోళన పడకండి. ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు. వీటితో ఎన్నో రకాల డెసర్ట్‌లు (Desserts ) కూడా తయారు చేసుకోవచ్చు. ఇక పాలు వేస్టేజ్‌ కావు. ఏ సందేహం లేకుండా.. వీటితో స్వీట్లు తయారు చేసుకుంటే.. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు.అవేంటో తెలుసుకుందాం.

వెన్న..
పాడైపోయిన పాలను ఓవెన్‌లో పెట్టండి. ఇందులో ఒక టీస్పూన్‌ నిమ్మరసం (Lemon) లేదా వెనిగర్‌ వేసి మీడియం స్టీమ్‌ మీద పెట్టుకుని బాగా కలపాలి. ఒక రెండు నిమిషాల పాలు పాలను అటూ ఇటూ కదుపుతూ ఉంటే.. నీరు వేరుపడి.. పాలు గడ్డలుగా మారుతుంది. ఇది పూర్తిగా వెన్న వలె మారుతుంది. అప్పుడు దీన్ని ఒక కాటన్‌ క్లాత్‌ లేదా ఏదైనా స్టెయినర్‌తో వడ కట్టుకోవాలి. కాస్త రోజ్‌ వాటర్‌ను వేయాలి. దీంతో నిమ్మ ఫ్లేవర్‌ పోతుంది. కాస్త చల్ల నీరు పోసి.. మరోసారి నీళ్లు పోయేలా వడకట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని.. కొద్దిగా షుగర్‌ పౌడర్‌ను వేసి బాగా కలిపితే అంతే.. ఎంతో రుచికరమైన కమ్మటి వెన్న రెడీ అవుతుంది.

ఇది కూడా చదవండి: గర్భాశయ కేన్సర్‌ను ఇలా గుర్తిస్తే.. త్వరగా తగ్గించుకోవచ్చు!



మిల్క్‌ కేక్‌..
పాడైన పాలతో మిల్క్‌ కేక్‌ తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల కేక్‌ పౌడర్‌ను తీసుకుని, అందులో 1 టీస్పూన్‌ బేకింగ్‌ సొడా, 4 టీ స్పూన్ల షుగర్‌ పౌడర్‌ను యాడ్‌ చేయాలి. దీనికి కాస్త ఎక్కువగా కిస్‌మిస్, గ్రేట్‌ చేసిన డ్రైఫ్రూట్స్‌ను కలపాలి. ఇప్పుడు 2 కప్పుల పాలు, మరో 2 కప్పుల నీరు వేసి బాగా కలపాలి. ఒక స్పూన్‌ వెన్నతోపాటు గుడ్డును బాగా గిలకొట్టాలి. ఇది పిండి మిశ్రమంలో వేసి పదార్థాలన్నింటిని కలపాలి. దీన్ని వెన్న రాసిన బేకింగ్‌ ట్రేలో వేసి.. 300 డిగ్రీల సెల్సియస్‌ వద్ద 25 నిమిషాలపాటు బేక్‌ చేయాలి. ఆ తర్వాత అవసరమైనట్లుగా చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: పండుగ వేళలో ఉపవాసం ఉంటే.. ఈ 7 హెల్తీ ఫుడ్స్‌ తీసుకోండి!



కలాకంఢ్‌..
పాడైన పాలలో 1 టీ స్పూన్‌ లెమన్‌ జ్యూస్‌ వేసి.. పాలు గడ్డలు పడకుండా.. కాసేపు ఉడికించాలి. ఇప్పుడు దాంట్లో నీరు ఆవిరైపోతుంది. ఇప్పుడు మరో గిన్నెలో 4 కప్పుల మంచి పాలను రెండు కప్పులు అయ్యేవరకు వేడి చేయాలి. తర్వాత ఫిల్టర్‌ చేసి.. రోజ్‌ వాటర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని చిక్కగా మృదువుగా మారే వరకు కలపాలి. ఇప్పుడు షుగర్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. అప్పుడు చిన్నగా గడ్డలుగా ఏర్పడితే.. అది సిద్ధమైందని అర్థం. వెన్న రాసిన ప్లేట్‌లోకి పోసి స్ప్రెడ్‌ చేయాలి. చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి.

డోనట్స్‌..
ఒక గిన్నెలో రెండు కప్పుల డోనట్‌ పౌడర్, 1 స్పూన్‌ బేకింగ్‌ సొడా, టీస్పూన్‌ బేకింగ్‌ పౌడర్, చిటికెడు ఉప్పు, 2 కప్పుల షుగర్‌ పౌడర్‌ వేసి కలపాలి. ఇప్పుడు మరో గిన్నెలో రెండు గుడ్లు గిలకొట్టి అందులో చెడిపోయిన పాలు 2 స్పూన్లు వేసి.. వెన్న పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ రెండింటినీ మరో గిన్నెలో తీసుకుని చపాతీ పిండి ముద్దలా చేసుకుని ఫ్రిజ్‌లో 2 గంటలపాటు పెట్టాలి. ఆ తర్వాత డోనట్స్‌ కట్టర్‌తో కట్‌ చేసి, గోల్డెన్‌ రంగులోకి వచ్చేలా వేయించాలి. దానిపై చాక్లెట్‌ సిరప్‌ పోసి, నచ్చిన విధంగా డెకరేట్‌ చేసుకోవచ్చు.
Published by:Renuka Godugu
First published:

Tags: Kitchen tips

తదుపరి వార్తలు