Home /News /life-style /

సెల్ ఫోన్ బానిసత్వం సంకెళ్లు తెంచుకోవడానికి ఆరు సూత్రాలు...

సెల్ ఫోన్ బానిసత్వం సంకెళ్లు తెంచుకోవడానికి ఆరు సూత్రాలు...

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఈ లాక్ డౌన్ 21 రోజుల్లో 21 పాఠాలు నేర్చుకుందాం అంటూ కర్ణాటక మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై కొన్ని పాఠాలు చెబుతున్నారు. ఆయన చెప్పిన 9వ పాఠం.

  (కె.అన్నామలై, మాజీ ఐపీఎస్ అధికారి, కర్ణాటక)

  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నందున మనమంతా 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ‘ఈ 21 రోజుల్లో 21 పాఠాలు’ నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై తన జీవిత పాఠాలను చెబుతున్నారు. ఈ సందర్భంగా టెక్నాలజీ బానిసత్వం నుంచి ఎలా బయటపడాలనే అంశాలను ఆయన వివరించారు.

  మనం ఓ పరిష్కారం కనుక్కోవాలనుకున్నప్పుడు ముందుగా సమస్యను గుర్తించాలి. చాలా మంది దీన్ని అంగీకరించరు. లేదా కొట్టిపారేస్తారు. మీరు ఈ కింద పేర్కొన్న సమస్యలతో బాధపడితే మాత్రం, ఈ ఆర్టికల్ కచ్చితంగా మీ కోసమే.

  1. ఉదయాన్నే మంచం మీద నుంచి నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ చెక్ చేయడం, ఓ 15 నిమిషాలు ఫోన్ చెక్ చేస్తూ గడపడం.
  2. నిద్రపోయే ముందు చివరగా ఫోన్ చూసుకోవడం, ఏదైనా సోషల్ మీడియానో చూడడం లేదా యూట్యూబ్‌లో వీడియోలు చూసి పడుకోవడం.
  3. తరచుగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ ‌స్టాగ్రామ్ అకౌంట్లలో స్టేటస్ అప్ డేట్ చేయడం
  4. భోజనం చేసే సమయంలో కూడా ఫోన్ చెక్ చేసుకోవడం, సోషల్ మీడియాలో ఏమైనా అప్ డేట్స్ ఉన్నాయేమోనని చూడడం.
  5. మధ్య మధ్యలో ఫోన్ చూసుకోకుండా కనీసం పక్కవారితో పట్టుమని ఓ పది నిమిషాలు కూడా మాట్లాడలేకపోవడం
  6. రోజుకు 5 గంటలు కంటే ఎక్కువ సమయం సెల్ ఫోన్ మీదే గడపడం

  ఈ లిస్ట్ అనేది కేవలం ఆరంభం మాత్రమే. మనకి సమస్య ఉందా? అని చెక్ చేసుకోవడానికి ఇదో ఆరంభ సూచికగా ఉపయోగపడుతుంది.

  Crime, Inter Students Crime, Auto Driver, 14 years student committed suicide, suicide thoughts, suicides for silly reasons, mobile addiction, Cellphone suicides, మొబైల్ ఫోన్, సెల్ ఫోన్ సూసైడ్స్, ఫోన్ లాక్కుందని ఆత్మహత్య, విద్యార్థుల ఆత్మహత్య
  ప్రతీకాత్మక చిత్రం


  మనం ఈ దశకు ఎందుకు వచ్చాం?
  మన చుట్టూ ఉన్న ప్రపంచం ప్రస్తుతం నిదానం కంటే వేగానికి, క్లాలిటీ కంటే క్వాంటిటీకి, నిశ్చలత్వం కంటే గిరగిరా తిరగడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అది నిజంగా అలాగే ఉందా? లేకపోతే అలాగే ఉందని మనం అనుకుంటున్నామా? వాస్తవానికి మనం మరింత లోతుగా ప్రపంచాన్ని పరిశీలిస్తే అది నెమ్మదిగా ఉండడం, సహనంతో ఉండడం, నిశ్చలత్వం, క్వాలిటీ వర్క్‌కు ప్రాధాన్యం ఇస్తూనే ఉంది. ప్రపంచం పెద్దగా మారలేదు. కానీ మనం మారాం. మనకన్నా ముందు కొన్ని కోట్ల మంది వారి విధానాల్లో జీవించారు. ఒక ప్రయోజనం కోసం, ఆనందం కోసం, ఉత్సాహవంతమైన జీవితాలను గడిపారు. కానీ, మనం మాత్రం పురోగతి పేరుతో ఎక్కడో గందరగోళానికి గురవుతున్నాం. నిరంతరాయంగా ‘ట్రెడ్ మిల్’ తొక్కుతూనే ఉన్నాం. దురదృష్టవశాత్తూ కొందరు ఏకంగా పులి మీద స్వారీ చేస్తున్నారు. వారు కిందకు దిగలేరు. ఈ సంస్కృతి వల్లే మన జీవితంలోకి ఈ టెక్నాలజీ వచ్చి దానికి మనల్ని బానిసలుగా మార్చేసింది. దీన్నుంచి బయటపడడానికి మన ముందు ఉన్న ఒక మార్గం ఏంటంటే, ప్రస్తుతం మనం ఈ గేమ్ ఆడే విధానాన్ని మార్చాలి. వేగాన్ని తగ్గించుకుని మన ఉనికిని మనం గుర్తించాలి. ఇది ఆచరించడం కంటే చెప్పడం సులువే.

  cellphone are banned in colleges, tamil nadu
  ప్రతీకాత్మక చిత్రం


  చిన్నవయసు, టీనేజ్‌లోనే టెక్నాలజీకి బానిసలుగా మారడం

  ఓ కుటుంబం హోటల్లో డిన్నర్‌కు వెళ్లిందనుకోండి. అక్కడ సహజంగా తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే, ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చే వరకు సెల్ ఫోన్లు తీసి చూసుకోవడం. అలాగే, పక్కన ఉన్న పిల్లలకు కూడా ట్యాబ్‌లు ఇచ్చేస్తారు. అందులో ఓ వీడియోనో, లేకపోతే ఏదైనా గేమ్ ప్లే అవుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు భోజనం చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్‌ను పదే పదే చూస్తూ ఉంటారు. ఒక్కసారి భోజనం చేసేటప్పుడు పిల్లల దగ్గరి నుంచి ఆ ఎలక్ట్రానిక్ వస్తువుని తీసుకోవడానికి ప్రయత్నించారంటే, వారు గోల గోల చేసేస్తారు. అక్కడ కచ్చితంగా తల్లిదండ్రుల తప్పు ఉంది. పిల్లలకు టైంపాస్ కావడానికి ఎలక్ట్రానిక్ వస్తువులను ఇవ్వడంలో తల్లిదండ్రుల అలసత్వం ఉంది. అలాగే జరిగితే ఓ దశలో పిల్లలు ప్రతి దానికీ ఆ స్క్రీన్ మీద ఆధారపడిపోతారు. (దాన్ని డిపెండెన్సీ సిండ్రోమ్ అంటారు.) ఆ సీన్ హోటల్‌కే పరిమితం కాదు. ఇళ్లలో కూడా జరుగుతూ ఉంటుంది. చిన్న పిల్లలు ఏడవడం లేదా గోల చేయడం ఆలస్యం... వెంటనే వారి చేతిలో సెల్ ఫోన్ పెట్టేస్తారు.

  smartphone in toilet, smartphone in toilet disadvantages, using smartphone in toilet, smartphone addiction, smartphone, is it normal to use your phone on the toilet, using your cell phone in the bathroom, స్మార్ట్‌ఫోన్ టాయిలెట్, స్మార్ట్‌ఫోన్ అడిక్షన్, స్మార్ట్‌ఫోన్ నష్టాలు, స్మార్ట్‌ఫోన్ వ్యసనం, బాత్‌రూంలో సెల్‌ఫోన్ వాడితే
  ప్రతీకాత్మక చిత్రం


  ఇక్కడ టీన్స్ గురించి ఆలోచిస్తే వారు తమ కోరికను నెరవేర్చుకోవడానికి తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తుంటారు. అలాగే, తల్లిదండ్రుల అనాలోచిత, చెత్త అలవాట్ల వల్ల పిల్లలకు మరింత వరంగా మారుతుంది. అసలు వారికి జీవితం అంటే ఏంటో నేర్పడం లేదు. టీచర్లు, తల్లిదండ్రులు వాస్తవ జీవితాలను వారికి చూపించడం లేదు. కాబట్టే, టీన్స్ అంతా తమ ప్రపంచంలో తాము బతుకుతున్నారు. అది టెక్నాలజీ బానిసత్వానికి దారితీస్తుంది.

  ‘జీవితం’ నుంచి దూరంగా ‘బతకడం’ అనేది ఈ కాలంలో కుర్రకారు అలవరుచుకుంటున్నారు. మంచిని మాత్రమే చూడాలి. చెడును అసలు చూడొద్దనుకోవడం కూడా మరో కారణం. చాలా మంది కుర్రకారు జీవితంలో ఆనందాన్ని కోల్పోయి వారి ప్రపంచంలో వారు బ్రతుకుతున్నారు.

  Redmi Note 7S blast, Redmi Note 7S explodes, Redmi Note 7S explosion, which phone blast mostly, cell phone blast news today, smartphone blast news, smartphone blast reason, smartphone battery blast, Smartphone charging tips, Smartphone safety tips, రెడ్‌మీ నోట్ 7ఎస్ బ్లాస్ట్, పేలిన రెడ్‌మీ నోట్ 7ఎస్, రెడ్‌మీ నోట్ 7ఎస్ పేలుడు, స్మార్ట్‌ఫోన్ బ్లాస్ట్, పేలిన స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్ టిప్స్
  (ప్రతీకాత్మక చిత్రం)


  ఈ బానిసత్వం నుంచి బయటపడడానికి కొన్ని అవకాశాలు

  1. దీన్ని పరిష్కరించడానికి కఠినమైన, వేగమైన రూల్ ఏదీ లేదు. నాలుగేళ్ల పిల్లలు, టీన్స్, కుర్రకారు, అమ్మమ్మ, తాతయ్యల వరకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన విధానం అవసరం. సెల్ ఫోన్లు అనేవి కేవలం మన జీవితంలో ఓ భాగం. మనకు అవసరమైన ఓ ‘దెయ్యం’గా గుర్తించాలి. జీవితం మొత్తం దానిమీదే ఆధారపడి ఉందనుకోకూడదు.
  2. మొదట మన ప్రాధాన్యతలను గుర్తించాలి. మన ఉద్యోగం దేంతో మొదలై దేంతో ముగుస్తుందో చూసుకోవాలి. మన జీవితానికి ఏది ముఖ్యమో గుర్తించాలి. మన జీవితంలో అంతగా ప్రాధాన్యం లేని అంశాలను బేరీజు వేసుకోవాలి. నా డ్యూటీ ఏంటి? - నా కుటుంబం, నా ఉద్యోగం, నా సమాజం. ఏంటో గుర్తించాలి. ఒకసారి మన ప్రాధాన్యాతలను దానికి తగినట్టుగా మనం సమయం కేటాయించవచ్చు.
  3. రెండు అలవాట్లు చేసుకోండి. ఒక రోజులో ‘నో సెల్ ఫోన్ టైమ్’ పెట్టుకోండి. అది కనీసం మూడు గంటల నుంచి 4 గంటలు అయి ఉండాలి. అలాగే వారంలో ‘నో సెల్ ఫోన్ డే’ అని పెట్టుకోండి. (ఇన్ కమింగ్ కాల్స్ రిసీవ్ చేసుకోవడమా లేదా అనేది మీ ఇష్టం) అప్పుడు మన మెదడు రకరకాల ఆలోచనలు చేస్తుంది. ఎక్కువగా టెక్నాలజీకి బానిసలుగా మారడం వల్ల మన నరాల వ్యవస్థ అంతా గజిబిజి అయిపోయింది. దాన్ని మనం సరిచేయాలి.
  4. బెడ్‌రూమ్‌కి సెల్ ఫోన్ దూరంగా పెట్టండి. (ఒకసారి ఇలా చేయడం అలవాటయితే, అప్పుడు ఉదయాన్నే లేవగానే ఫోన్ చూడడం, పడుకునే ముందు వీడియోలు చూసి పడుకోవడం లాంటి అలవాట్లు తగ్గుతాయి)
  5. భోజనం చేసే సమయంలో అసలు సెల్ ఫోన్ అనేదాన్ని పక్కన పడేయండి. ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు సెల్ ఫోన్ తీసి సోషల్ మీడియాలో అప్ డేట్స్ చెక్ చేయడం మానేయండి.
  6. సోషల్ మీడియా ఎంతసేపు చూడాలనేదాన్ని మనకు మనం కండిషన్ పెట్టుకోవచ్చు. దానికోసం చాలా యాప్స్ ఉన్నాయి. అలాగే, మొబైల్ సెట్టింగ్స్‌లోకి కూడా వెళ్లి సెట్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మనం పరిమితం సమయం మాత్రమే సోషల్ మీడియాను వినియోగించవచ్చు.

  Redmi Note 7S blast, Redmi Note 7S explodes, Redmi Note 7S explosion, which phone blast mostly, cell phone blast news today, smartphone blast news, smartphone blast reason, smartphone battery blast, Smartphone charging tips, Smartphone safety tips, రెడ్‌మీ నోట్ 7ఎస్ బ్లాస్ట్, పేలిన రెడ్‌మీ నోట్ 7ఎస్, రెడ్‌మీ నోట్ 7ఎస్ పేలుడు, స్మార్ట్‌ఫోన్ బ్లాస్ట్, పేలిన స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్ టిప్స్
  ప్రతీకాత్మక చిత్రం


  ఈ ప్రాసెస్‌లో మనం ఎంత ప్రయత్నం చేస్తామనేదానికంటే కూడా, ‘ఇది వాస్తవం. ఇలాగే ఉండాలి’ అని మనం మొదటగా గుర్తించాలి. ‘ప్రపంచానికి మనతో పనిలేదు. అలాగే, మనకు ప్రపంచంతో పనిలేదు. అవసరం అయినప్పుడు ప్రపంచం మొత్తం నాతో ఉంటుంది. అలాగే, నేను ప్రపంచంతో ఉంటా.’ అని నరనరాల్లోకి ఎక్కించుకోవాలి. మన చుట్టూ జరిగేదంతా మనకు తెలియాలి. అలాగే, మన అభిప్రాయం కూడా అందులో చాలా ముఖ్యం అనుకునే మైండ్ సెట్ మారాలి. ఈ విశ్వానికి అవసరం అయినప్పుడు అది మన మాట తప్పకుండా వింటుంది.

  మనలో ఉన్న ‘స్వప్రాధాన్యత’ (మనం చాలా ఇంపార్టెంట్) అనే భావన మొదట పోవాలి. ఆ భావనను మనం పోగొట్టుకోగలిగితే, మిగిలినవన్నీ సెట్ అయిపోతాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Cell phone, Life Style

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు