Health Tips : నడుముని సన్నగా మార్చే యోగాసనం

ప్రతీకాత్మక చిత్రం

Health Tips | అధికబరువుని తగ్గించుకోవాలనుకుంటున్నారా.. అయితే, ఇప్పుడు చెప్పే ఆసనం వేయండి. ఈ ఆసనం వల్ల బరువు తగ్గడమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

  • Share this:
ఉండాల్సిన బరువుకంటే ఎక్కువ బరువు ఉండడాన్ని అధికబరువు అంటారు. ఈ సమస్య వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువ దూరం నడవలేకపోవడం, నడిచినా ఆయాసపడడం, కూర్చోవడానికి ఇబ్బంది పడడం, కూర్చున్నతర్వాత లేవలేకపోవడం.. చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతడంతా అవుతుంది. ఇలాంటి వారు వ్యాయామాలు చేయడమూ కష్టమే. కానీ.. సులువైన, తేలికైన సీతాకోకాచిలుక ఆసనం ద్వారా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చు. అదెలాగంటే..
* ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి.
* ఇప్పుడు రెండు పాదాలను మధ్యలోకి తీసుకొచ్చి కాళ్లవేళ్లను పట్టుకోవాలి.
* తర్వాత కాళ్లను పైకి కిందకు కదుపుతూ 20 సార్లు చేయాలి.
* క్రమంగా చేస్తుంటే మోకాలిని కూడా నేలకు ఆనించొచ్చు.
ప్రయోజనాలు..
* క్రమం తప్పకుండా ఈ ఆసనం చేస్తే శరీరం చురుగ్గా మారడమే కాకుండా.. ఒత్తిడీ కూడా తగ్గుతుంది.
* పొట్ట, తొడల దగ్గరున్న కొవ్వు కరిగిపోతుంది.
* నడుము సన్నగా మారుతుంది.
* ఉదయాన్నే పరగడపున గోరువెచ్చని నీరు తాగి ఈ ఆసనం చేయడం వల్ల అదనపు లాభాలు..

ఇవి కూడా చదవండి..

Health Tips : షుగర్ ఉన్నవారు టమాట తినొచ్చా..
First published: