Squid game costume: ‘స్క్విడ్‌ గేమ్‌’లోని ఈ కాస్ట్యూమ్స్‌ కోసం తెగ వెతుకుతున్నారట!

ప్రతీకాత్మక చిత్రం

Searching for squid game costumes: డిజైన్‌ బండిల్స్‌ చేపట్టిన ఈ అధ్యయనంలో స్క్విడ్‌ గేమ్‌ కాస్ట్యూమ్స్‌ సెర్చింగ్‌ మొదటి స్థానంలో ఉండగా.. క్యాట్‌ ఉమెన్,హార్లీ క్విన్, జోకర్, స్పైడర్‌ మ్యాన్‌ ఇతరులు తదుపరి స్థానాల్లో నిలిచాయి.

  • Share this:
‘స్క్విడ్‌ గేమ్‌' (squid game)  ప్రస్తుతం పాపులర్‌గా స్ట్రీమ్‌ అవుతున్న కొరియన్‌ డ్రామ (korean drama) టెలివిజన్‌ సిరీస్‌. ఇది ప్రస్తుతం మన దేశంలో కూడా ఒక ప్రముఖ ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని రిలీజ్‌ చేశారు. అన్ని దేశాల వారికి ఈ సిరీస్‌ తెగ నచ్చేస్తోంది. అందుకే ప్రస్తుతం ఇదే ట్రెండింగ్‌లో ఉంది. అయితే, ఈ ఏడాదికి హలోవీన్‌ (halloween) సీజన్‌ థ్యాంక్స్‌ సీజన్‌ కూడా వచ్చేసింది. దీంతో స్క్విడ్‌ గేమ్‌లో పోటీదారులు ధరించిన ఒక కాస్ట్యూమ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వివిధ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫాంలలో తెగ వెతికేస్తున్నారట. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

అయితే, స్క్విడ్‌ గేమ్‌ దుస్తులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌లలో అందుబాటులో ఉన్నాయని, స్క్వీడ్‌ గేమ్‌ హాలోవీన్‌ దుస్తులు ఇంటర్నెట్‌ సెర్చింగ్‌లో అగ్రస్థానంలో ఉందని ఒక అనాధికారిక అధ్యయనం కనుగొంది.

ఇది కూడా చదవండి: కృత్రిమ ఐల్యాషస్‌ వాడితే.. కళ్లకు ఇంత డేంజరా..?

స్క్విడ్‌ గేమ్‌ కాస్ట్యూమ్‌ (squid game costume) కోసం ఆన్‌లైన్‌లో మితిమీరిని సెర్చింగ్‌లు ఉన్నట్లు ఒక అధ్యయనం వెల్లడించింది. దీనికి ఒక సీఎన్‌ఎన్‌ నివేదికను ఉదహరించారు.
డిజైన్‌ బండిల్స్‌ చేపట్టిన ఈ అధ్యయనంలో 11 అత్యంత ప్రజాదరణ పొందిన కాస్ట్యూమ్స్‌ సెర్చ్‌లలో దాదాపు మూడింట ఒక వంతు దుస్తులు ఉన్నాయని కనుగొన్నారు. స్క్విడ్‌ గేమ్‌ కాస్ట్యూమ్స్‌ సెర్చింగ్‌ మొదటి స్థానంలో ఉండగా.. క్యాట్‌ ఉమెన్,హార్లీ క్విన్, జోకర్, స్పైడర్‌ మ్యాన్‌ ఇతరులు తదుపరి స్థానాల్లో నిలిచాయి.



స్క్విడ్‌ గేమ్‌ (squid game contestants)పోటీదారుల కాస్ట్యూమ్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌. టీల్‌ ట్రాక్‌సూట్‌లపై నంబర్స్‌ రాసి ఉన్నాయి. 70 నుంచి నేరుగా కనిపిస్తాయి. ప్రస్తుతం హాట్‌ హాట్‌గా ఉన్న మరో ట్రెండ్‌ ఏంటంటే.. ఈ హిట్‌ సిరీస్‌లోని పోటీదారులందరూ వేసుకునే షూస్‌ మీద వైట్‌ స్లిప్స్‌ ఉంటాయి. అవి వ్యాన్‌ల నుంచి వైట్‌ స్లిప్‌ ఆన్‌లుగా అనిపిస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిక్‌టాకర్స్, ఇన్‌స్టాగ్రామర్‌లు కూడా స్క్విడ్‌ గేమ్‌ కంటెస్టెంట్‌ మాదిరి డ్రెస్‌ ఎలా వేసుకోవాలో ట్యూటోరియల్స్‌ కూడా పోస్ట్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  ఈ డ్రింక్స్‌తో ఈజీగా వెయిట్‌ తగ్గొచ్చు!


ఇక ఈ స్క్విడ్‌ గేమ్‌ డ్రామాలో ఒకరికి ఒకరు తెలియరు. తెలియన వారి కోసం స్క్విడ్‌ గేమ్‌ మిలియన్ల డాలర్లను గెలుచుకునేందుకు ప్రాణాంతక పరిణామాలతో పిల్లల ఆటల రేంజ్‌లో ఆడటానికి ఆహ్వానిస్తారు. అందరూ కలిసి 456 మంది అవుతారు. ప్రపంచవ్యాప్తంగా ‘స్క్విడ్‌ గేమ్‌ ట్రాక్‌సూట్‌లు’, ‘స్క్విడ్‌ గేమ్‌ షూస్‌’ కోసం శోధిస్తున్నారు. షూస్, ట్రాక్‌సూట్‌లపై స్లిప్‌ వంటి కొన్ని రెట్రో ఫ్యాషన్‌ని తిరిగి తీసుకువచ్చింది.
Published by:Renuka Godugu
First published: