Home /News /life-style /

WORLD WATER DAY 2022 HISTORY THEME AND SIGNIFICANCE OF THE DAY MODI INTERESTING COMMENTS ON THIS DAY DETAILS HERE GH VB

World Water Day: వరల్డ్ వాటర్ డే సందర్భంగా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ వివరాలు ఇలా..

ప్రధాని మోదీ (పాత ఫొటో)

ప్రధాని మోదీ (పాత ఫొటో)

వర్షం, మంచు కారణంగా రీఛార్జ్ అయిన భూగర్భజలాలను అవసరానికి మించి తోడెయ్యడంతో భవిష్యత్తులో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోతుంది ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రతి ప్రకృతి ప్రసాదితమైన నీరుకు ప్రత్యామ్నాయం లేదు. దీంతో ఉన్న జలాన్ని పొదుపుగా సమర్థవంతంగా వినియోగించుకోవాలి. దేశం అన్ని రంగాల్లో పురోగమించాలన్నా జలమే కీలకం. గ‌ృహం, ఆహారం, సంస్కృతి, ఆరోగ్యం(Health) ఇలా ప్రతి అంశం జలంతో ముడిపడి ఉంది. అయితే నీటి కాలుష్యం, వినియోగంలో వృథా నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఇప్పటికీ సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఏటా మనం మార్చి22న ప్రపంచ నీటి దినోత్సవంగా(International Water Day) జరుపుకుంటున్నాం. నీటి ప్రాముఖ్యతపై దృష్టిసారించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ సురక్షిత జలం లేకుండా జీవిస్తున్న 2 బిలియన్లపైగా జనాభాకు అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం. యూఎన్‌ఓ ప్రకారం... ప్రపంచ వ్యాప్తంగా నీటి సంక్షోభాన్ని నివారించడంపై ప్రధానంగా దృష్టిసారించాలని... సుస్థిర అభివృద్ధి 6వ లక్ష్యంగా 2030 నాటికి అందరికీ మంచినీరు, పారిశుద్ధ్య సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Explained: మీ క్రెడిట్‌ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలు ఏవి..? బెస్ట్ క్రెడిట్ స్కోర్ కోసం ఏమి పాటించాలి..?


* ఈ ఏడాది స్పెషల్ థీమ్
ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా స్పెషల్ థీమ్‌ను ప్రకటించడం అనవాయితీగా వస్తుంది. ఈసారి ‘‘భూగర్భ జలాలు పెంపొందించేలా చర్యలు చేపట్టడం’’ అనే థీమ్‌తో ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంది. భూగర్భ జాలాలు కంటికి కనిపించవు. అయితే భూమి ఉన్న ప్రతి చోటా దాన్ని ప్రభావం ఉంటుంది. భూగర్భ జలాలు మన జీవితాలను సుసంపన్నం చేసే నిధిలాంటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రెష్ ద్రవ మంచి నీరు అంతా భూగర్భజలం రూపంలోనే ఉంది. అయితే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో ఈ విలువైన సంపదను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నీటి ప్రాముఖ్యతను worldwaterday.org నొక్కి చెప్పింది.

వర్షం, మంచు కారణంగా రీఛార్జ్ అయిన భూగర్భజలాలను అవసరానికి మించి తోడెయ్యడంతో భవిష్యత్తులో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోతుంది ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. నేడు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ జలాల అతి దోపిడిని అరికట్టడానికి అందరూ కృషి చేయాలని యూఎన్‌ఓ విజ్ఞప్తి చేసింది. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి, భూగర్భ జలాలను అన్వేషించడం, రక్షించడం, స్థిరంగా ఉపయోగించడం ముందున్న లక్ష్యాలని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేశారు. మానవ మనుగడకు జలమే ఆధారమన్నారు. ప్రతి నీటిబొట్టును రక్షించుకోవాలని మానవాళికి పిలుపునిచ్చారు.

కాగా, 1992లో రియో ​​డి జెనీరోలో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సమావేశమైనప్పుడు..1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22ని ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే.
Published by:Veera Babu
First published:

Tags: Life Style, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు