World storytelling Day : పిల్లలకు కథలు చెప్పడం వల్ల ఎన్ని లాభాలో చెబుతున్న సైకాలజిస్టులు

చిన్నప్పుడు ఎన్నో కథలు వింటూ పెరిగాం.. ఇప్పుడు ఆ అలవాటు పెద్దలకు తగ్గింది.. చిన్నపిల్లలకు అసలు అలాంటివి తెలియనే తెలియదు.. వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డే సందర్భంగా.. ఆ గొప్పతనమేంటో తెలుసుకుందాం..

Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 11:38 AM IST
World storytelling Day : పిల్లలకు కథలు చెప్పడం వల్ల ఎన్ని లాభాలో చెబుతున్న సైకాలజిస్టులు
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 11:38 AM IST
నీతికథలు, జానపదకథలు, హాస్యకథలు, పేదరాసి పెద్దమ్మ కథలు.. ఇలా ఎన్నో.. ఈ కాలం వారు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న వీటి గురించి మాట్లాడుకోవాలి. మన చిన్నతనంలో తల్లీదండ్రులు, అమ్మమ్మ, తాతమ్మ, తాతయ్యలు ఇలా మనకి కథలు చెప్పే ఉంటారు. దాని వల్ల మనకు ఎంతోకొంత లోకజ్ఞానం తెలిసే ఉంటుంది. మరీ.. ఇప్పటి జనరేషన్ పరిస్థితి ఏంటి.. వారికి ఇలాంటి కథలు చెప్పే సమయం మనకు లేదు. ఓ స్మార్ట్ ఫోన్ ఇస్తే చాలు.. అందులో వారు ఏం చేసుకున్నా పర్లేదు. మనల్ని డిస్టర్బ్ చేయరు. ఈ పర్యావసనమే చిన్నతనంలోనే పిల్లలు నేర ప్రవృత్తి కలిగి ఉండడం, సైబర్ నేరాలకు పాల్పడడం.
కథలు చెప్పడం వల్ల చిన్నతనంలోనే వారికి లోకజ్ఞానం తెలుస్తుంది. ఎలా ఉండాలి. ఎలా నీతిగా బతకాలి. ప్రతీఒక్కరికి ఎలా సాయపడాలి.. ఇలాంటి విలువలు నేర్చుకుంటారు. దీనివల్ల తల్లీదండ్రులతో వారికి ఓ మంచి బంధం కూడా ఏర్పడుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. జీవితంలో మనం ఎదుర్కొన్న సమస్యలను, మనచుట్టూ మనుషులు ఎలా ఉంటారు. ఎలా బతకాలి. సమాజ విలువలు, కట్టుబాట్లు ఇలా ప్రతీఒక్కవిషయాన్ని వాళ్లకి కథల రూపంలో చెబితే.. అందమైన భవిష్యత్‌ని ఇచ్చినవారవుతాం. దీనివల్ల ఇప్పుడు సమాజంలో జరిగే నేరాలను అరికట్టినవారవుతాం. అదేవిధంగా మన పిల్లల అందమైన భవిష్యత్‌ని చూసి ఆనందపడొచ్చని చెబుతున్నారు సైకాలజిస్టులు.

డబ్బు సంపాదించడం ముఖ్యమే. కానీ కుటుంబం, పిల్లలకంటే ముఖ్యం కాదు. కాబట్టి ఎన్ని పనులున్నా రాత్రి పడుకునేముందు పిల్లలతో గడపండి. వారికి మంచి మంచి కథలు చెప్పండి.. సమాజంలో జరిగే నేరాల సంఖ్యని తగ్గించండి..

ఇవి కూడా చదవండి..

హోలీ కోసం ఇంట్లోనే సహజసిద్ధ రంగులు తయారు చేసుకోండి.. 

Health Tips : టెన్షన్ ఎంత ఉందో చెప్పే ప్యాచ్ వచ్చేసింది.. ఎగ్జామ్స్ టైమ్‌లో బెస్ట్...
Loading...
హోలీ కోసం ఇంట్లోనే సహజసిద్ధ రంగులు తయారు చేసుకోండి..
First published: March 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...