World Sparrow Day : మనకి మేలు చేసే పిచ్చుకలను ఇలా కాపాడుకుందాం..

చిన్ని రెక్కలతో కిచ్.. కిచ్.. అంటూ సందడి చేస్తూ తిరిగే పిచ్చుకల గురించి ఇప్పుడు ఎంతమందికి తెలుసు. ఒకప్పుడు వీటి సందడితోనే నిద్రలేచేవారు. అంతేకాదు.. వీటివల్ల కలిగే లాభాల గురించి అందరికీ తెలీదు.

Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 4:37 PM IST
World Sparrow Day : మనకి మేలు చేసే పిచ్చుకలను ఇలా కాపాడుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 4:37 PM IST
ఎక్కడపడితే సెల్ టవర్స్.. వాటి నుంచి వచ్చే రేడియేషన్, క్రిమిసంహారక మందులు, చెట్లను నరకివేయడం వీటన్నింటి ఫలితమే పిచ్చుకల పతనానికి కారణమని చెప్పొచ్చు. గుప్పెడు గింజల కోసం అటు ఇటూ తిరుగుతూ మనకు నష్టం కలిగించే ఎన్నో రకాల క్రిమి కీటలకాలు నాశనం చేస్తాయి పిచ్చుకలు. పొలాల్లో ఈ పిచ్చుకలు ఉండడం వల్ల క్రిమీకీటకాలు నాశనమై పంటలు మంచిగా పండుతుంది. అంతేకాదు.. వీటి కిలకిలరావాలు మనలో పాజిటీవ్ వైబ్రేషన్స్ పెంచుతాయని చెబుతున్నారు నిపుణులు.
ఇంత మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాలంటే.. కాలుష్యం తగ్గేలా చూడాలి. చెట్లను నరికివేయడం ఆపేయాలి. అదేవిధంగా.. సెల్‌టవర్స్‌ని జనావాసాల మధ్య ఉండకుండా జాగ్రత్తపడాలి.

పక్షుల కోసం ప్రత్యేకంగా ఆవాసాలు, బర్డ్ ఫీడర్లు ఏర్పాటు చేయాలి. అయితే.. సుప్రీంకోర్టు ఈ మధ్యే వీటికి వ్యతిరేకంగా జనావాసాల మధ్య పక్షులకి ఆహారం వేయొద్దని సూచించింది. అది దృష్టిలో పెట్టుకుని వాటికంటూ ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి. వాటికోసం ఏర్పాటు చేసిన ఆవాసాల్లో పిచ్చుకల కోసం ఆహారం, నీటిని ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల పిచ్చుకలను కాపాడుకున్నవారవుతాం.

ఇవి కూడా చదవండి..

Summer Tips : కొబ్బరినీళ్లు తాగుతున్నారా.. 15 లాభాలున్నాయి తెలుసుకోండి..
First published: March 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...