World Social Media Day: సోషల్ మీడియాకి బానిసగా మారిపోయారా..? ఎలా బయటపడాలి? పూర్తి వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

World Social Media Day: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్​ మీడియాలో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ అయినా ఉపయోగిస్తున్నాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి.

  • Share this:
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్​ మీడియాలో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ అయినా ఉపయోగిస్తున్నాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి ద్వారా స్నేహితులు, బంధువులతో టచ్​లో ఉండటం వినోదభరితంగా ఉంటుంది. కానీ ఇది మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. మన రోజువారీ జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఇలాంటి ప్లాట్‌ఫాంల ఉపయోగాలతో పాటు దుష్ప్రభాలపై అవగాహన కల్పించేందుకు జూన్ 30న ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా సోషల్​ మీడియా మనపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

ఉద్యోగాలు కోల్పోవడం

సోషల్​ మీడియా పోస్టులు కూడా ఉద్యోగ వేటలో కీలక పాత్ర వహిస్తాయి. మీరు పెట్టే కొన్ని పోస్టులు ఉద్యోగం కోల్పోవడానికి కూడా కారణం కావొచ్చు. ఎందుకంటే మీరు పనిచేసే కంపెనీ.. మీ సోషల్​ మీడియా అకౌంట్​పై నిఘా పెడుతుంది. తద్వారా మీ వ్యక్తిత్వం, అభిరుచులు తెలుసుకుంటుంది. మీరు చేసిన పోస్టులు, లైక్స్, కామెంట్లతో మీ క్యారెక్టర్​ను అంచనా వేస్తుంది. మీరు ఏవైనా అభ్యంతకర పోస్టులు పెడితే, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు.

ESTA అప్లికేషన్స్​

ESTA అప్లికేషన్స్​ ద్వారా మీ సోషల్ మీడియా సమాచారం తెలుసుకుంటాయి కంపెనీలు. మీ అకౌంట్​ భద్రతను అంచనా వేయడానికి అధికారులు ఈ సమాచారాన్ని సమీక్షిస్తారు. గతంలో మీరు చేసిన పోస్ట్​లను పరిశీలించి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తాయి.

చట్టపరమైన విషయాలు

మీ సోషల్ మీడియా పోస్టులను చట్టప్రకారం సాక్ష్యాలుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు అల్లరి చేస్తున్నారని వారిని దండిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తే.. న్యాయస్థానాలు వాటిని సాక్ష్యాలుగా తీసుకుంటాయి. తద్వారా మీకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అందువల్ల, సోషల్​ మీడియాతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

కొత్త సంబంధాలు

ఎవరైనా కొత్త వ్యక్తిని కలిసినప్పుడు, వారి గురించి తెలుసుకోవడానికి సోషల్​ మీడియాను ఉపయోగిస్తున్నారు చాలా మంది. గతంలో వారు పెట్టిన పోస్ట్​ల ద్వారా వారి క్యారెక్టర్​, అభిరుచులను అంచనా వేస్తున్నారు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో, మీపై ఒక అభిప్రాయం ఏర్పడటంలో మీ సోషల్​ మీడియా అకౌంట్​ కీలక పాత్ర పోషిస్తుంది.

* సోషల్ మీడియా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అవేంటో పరిశీలిద్దాం.

దుర్వినియోగం, వేధింపులు
సోషల్ మీడియాలో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే, డేటా దుర్వినియోగం, వేధింపులు. సైబర్​ నేరగాళ్లు యూజర్​ అకౌంట్ల నుంచి డేటా సేకరించి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కేటుగాళ్లు సోషల్​ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకొని తర్వాత వారిని వేధిస్తున్నారు. మరికొందరు డబ్బులు కాజేస్తున్నారు.

ఆందోళన, ఒంటరితనం
సోషల్​ మీడియాతో ప్రపంచంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దీనితో నష్టాలు కూడా ఉన్నాయి. ఇది మీలో ఆందోళన, ఒంటరితనం భావాలను రేకెత్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీ డేటాకు భద్రత ఉంటుందా? లేదా? అనే దానిపై ఎక్కువ ఆందోళన చెందుతుంటారు. మరోవైపు, ఎక్కువ సమయంలో సోషల్​ మీడియాలో గడపడం మూలాన. ఇతరులతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పర్చుకోలేరు. ఇది భవిష్యత్తులో మీ ఒంటరితనానికి దారి తీస్తుంది.

అసత్య ప్రచారం
సోషల్ మీడియాలో ఎన్నో అసత్య వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిని నిజమేనని నమ్మి మోసపోతుంటాం. అంతేకాక, సోషల్​ మీడియా మన కొత్త ఆలోచనలకు పరిమితం చేస్తుంది. తద్వారా మన ఆలోచనకు మద్ధతివ్వని వారిపై కోపం పెరుగుతుంది. ఇది క్రమంలో హింసకు దారితీస్తుంది.

వీటి నుంచి ఎలా బయటపడాలి?
సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కాబట్టి ఈ ప్లాట్‌ఫారమ్‌లకు పూర్తిగా దూరం కాకూడదు. అయితే, సోషల్ మీడియా మీకు హాని చేస్తుందా? లేదా? అనే విషయాన్ని అంచనా వేసుకోండి. వీటి ద్వారా మీకు ప్రయోజనాలకంటే దుష్రభావాలే ఎక్కువగా ఉన్నట్లు భావిస్తే వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. అయితే మీ నుంచి సోషల్ మీడియాను పూర్తిగా వేరుచేయడం చాలా కష్టం. కానీ, ఇలా చేయడం ద్వారా అపారమైన సానుకూల ప్రయోజనాలు కలుగుతాయని గుర్తించుకోండి.
Published by:Sridhar Reddy
First published: