World Sleep Day 2019: మీ పిల్లలు బాగా నిద్రపోవాలా? ఈ 4 టిప్స్ చాలు

World Sleep Day 2019 | పిల్లల్లో నిద్రలేమి సమస్య ఆరోగ్యాన్ని మాత్రమే కాదు... మానసికంగా దెబ్బతీస్తోంది. ఆ ప్రభావం చదువులు, మార్కులపై పడుతోంది. మరి మీ పిల్లలు బాగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: March 15, 2019, 1:26 PM IST
World Sleep Day 2019: మీ పిల్లలు బాగా నిద్రపోవాలా? ఈ 4 టిప్స్ చాలు
World Sleep Day 2019: మీ పిల్లలు బాగా నిద్రపోవాలా? ఈ 4 టిప్స్ చాలు (Photo courtesy: AFP)
news18-telugu
Updated: March 15, 2019, 1:26 PM IST
మార్చి 15... వాల్డ్ స్లీప్ డే. ప్రతీ ఏడాది ఈ రోజు వచ్చేసరికి ప్రపంచానికి నిద్ర ప్రాముఖ్యత గుర్తొస్తుంది. మంచి ఆరోగ్యం కోసం మంచి నిద్ర అవసరమన్న స్పృహ పెరుగుతుంది. అయితే పెద్దల సంగతేమో కానీ... ఈ తరం పిల్లల్లో నిద్రలేమి తీవ్రంగా ఉందని అధ్యయనాలు తేలుస్తున్నాయి. నిద్రలేమి సమస్య ఆరోగ్యాన్ని మాత్రమే కాదు... మానసికంగా దెబ్బతీస్తోంది. ఆ ప్రభావం చదువులు, మార్కులపై పడుతోంది. మరి మీ పిల్లలు బాగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

నిద్రవేళల విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండండి


నిద్రవేళల విషయంలో 2017లో కెనెడాలో ఓ అధ్యయనం నిర్వహించారు పరిశోధకులు. నిద్రవేళల విషయంలో తల్లిదండ్రులు స్ట్రిక్ట్‌గా ఉండటం పిల్లలకు మేలు చేస్తుందని, రోజూ ఒకే సమయంలో నిద్రపోయే పిల్లలకు చక్కగా నిద్రపడుతుందని తేలింది. 18 ఏళ్లలోపు పిల్లలున్న 1,622 మంది తల్లిదండ్రులతో జరిపిన అధ్యయనం ఇది.

స్క్రీన్ టైమ్ తగ్గించడం


పిల్లల్లో స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ ఉపయోగించే అలవాటు పెరిగిపోతుంది. చదువు, నిద్ర మానేసి మరీ స్క్రీన్‌కు అతుక్కుపోతుంటారు. ఇలా స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం నిద్రలేమికి కారణమని యురోపియన్ పరిశోధకులు తేల్చారు. 278 మంది పిల్లలతో అధ్యయనం జరిపితే రాత్రి సమయంలో స్క్రీన్ ఉపయోగించే పిల్లల్లో నిద్రలేమి అవకాశాలు ఎక్కువని స్లీప్ క్వాలిటీ తక్కువని తేలింది. అందుకే పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు ఇవ్వడం తగ్గించాలి.



Read this: Healthy Sleep Tips: హాయిగా నిద్రపోవాలంటే ఈ 9 టిప్స్ ఫాలో అవండి

World Sleep Day 2019, Sleep Day, child sleep chart, benefits of sleep for child, sleep disorders, Healthy Sleep Tips, food for good sleep, sleep hygiene tips, పిల్లల్లో నిద్రలేమి, నిద్ర సమస్యలు, నిద్రకు టిప్స్, వరల్డ్ స్లీప్ డే, స్లీప్ డే, అతి నిద్ర, నిద్ర పట్టాలంటే
ప్రతీకాత్మక చిత్రం
Loading...

తల్లిదండ్రుల బెడ్‌రూమ్‌లో పిల్లలు నిద్రపోవడం


పిల్లలు కాస్త పెద్దయ్యాక వారికి బెడ్‌రూమ్ వేరుగా కేటాయిస్తారు తల్లిదండ్రులు. అయితే తల్లిదండ్రుల బెడ్‌రూమ్‌లో పిల్లలు నిద్రపోవడం మంచిదేనని పలు పరిశోధనలు తేలుస్తున్నాయి. పిల్లల్లో నిద్రపై పాజిటీవ్‌గా ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు.

మంచి ఆహారంతో మంచి నిద్ర


పిల్లల్లో ఆహారపు అలవాట్లు నిద్రపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయని గ్రీక్‌లో ఓ అధ్యయనం జరిగింది. 8 నుంచి 17 ఏళ్లలోపు 177,091 మంది పిల్లలతో జరిపిన అధ్యయనం ఇది. బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం, త్వరగా తినడం, రోజూ స్వీట్లు తినడం లాంటివి నిద్రపై దుష్ప్రభావం చూపిస్తున్నట్టు తేలింది.

Photos: ఈ లేడీ బైకర్ ఆన్‌‌లైన్ సెన్సేషన్... అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్

ఇవి కూడా చదవండి:

Delete Facebook: ఫేస్‌బుక్ డిలిట్ చేయండి... వాట్సప్ కో-ఫౌండర్ సలహా

Air India Jobs: ఇంటర్ పాసైనవారికి 160 ఉద్యోగాలు... రూ.95,000 జీతం... పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ

IRCTC PNR Linking: ఏప్రిల్ 1 నుంచి అమలులోకి... ప్రయాణికులకు ఎంత లాభం?
First published: March 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...