World Osteoporosis Day: సూర్యరశ్మి సరిగా అందకుంటే ఆ వ్యాధి వచ్చే ఛాన్స్.. వివరాలివే..

World Osteoporosis Day: అక్టోబర్ 20ని ప్రపంచ దేశాలు వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే గా గుర్తించాయి. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలకు వచ్చే వ్యాధి. దీన్ని బోలు ఎముకల వ్యాధి అంటారు. ఇది సోకిన వారిలో ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారుతాయి.

news18-telugu
Updated: October 20, 2020, 5:35 PM IST
World Osteoporosis Day: సూర్యరశ్మి సరిగా అందకుంటే ఆ వ్యాధి వచ్చే ఛాన్స్.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అక్టోబర్ 20ని ప్రపంచ దేశాలు వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే గా గుర్తించాయి. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలకు వచ్చే వ్యాధి. దీన్ని బోలు ఎముకల వ్యాధి అంటారు. ఇది సోకిన వారిలో ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారుతాయి. ఈ రోజు ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి, అవి పెళుసుగా మారకుండా, బోలు ఎముకల వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బోలు ఎముకల వ్యాధి.. ఇది ఎముకలకు సోకే వ్యాధి. దీని బారిన పడిన వారి శరీరంలో ఎముకలు పెళుసుగా మారుతాయి. వారికి తేలికపాటి దగ్గు వచ్చినా, లేదా వంగినా తుంటి, వెన్నెముక లేదా మణికట్టు ఎముకల్లో పగుళ్లు ఏర్పడతాయి. సాధారణంగా ఇది 35 ఏళ్లు పైబడిన మహిళల్లో, మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో కనిపిస్తుంది. దీని వల్ల ఎముక విరిగిన ప్రదేశంలో కొత్త ఎముక వృద్ధి చెందదు.

ఎందుకు సోకుతుందంటే..

బోలు ఎముకల వ్యాధి కొంతమంది మగవాళ్లకు కూడా సోకుతుంది. తగినంత సూర్యరశ్మిని అందనివారు, వ్యాయామం చేయని వ్యక్తులు దీని బారిన పడే అవకాశం ఉంది. మద్యపానం, పొగతాగే అలవాటు ఎక్కువగా ఉన్న వారికి ఆస్టియోపోరోసిస్ రావచ్చు. శరీరంలో కాల్షియం స్థాయులు తక్కువగా ఉన్నవారిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుంది. కుటుంబంలో ఇంతకు ముందే ఎవరికైనా ఈ వ్యాధి సోకితే, జన్యుపరంగానూ ఇది వ్యాపించవచ్చు.

లక్షణాలు..
వెన్నునొప్పి, శరీరాకృతి వంగిపోవడం, ఎత్తు తగ్గుతున్నట్లు కనిపించడం, చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగిపోవడం వంటివి బోలు ఎముకల వ్యాధి సాధారణ లక్షణాలు. పెన్నుపూసలో పగుళ్లు ఏర్పడితే వెన్నెముక, తుంటి ప్రాంతంలో నొప్పి వస్తుంది. సరైన నివారణ చర్యలు తీసుకోకపోతే కొంతమంది మహిళల్లో ఇది మూపురంలా పెరుగుతుంది. తుంటి ఎముకలో ఏర్పడే పగుళ్లు (హిప్ ప్రాక్చర్) త్వరగా నయం కావు. పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.

రోగ నిర్ధారణ
ఎక్స్‌రే ద్వారా  బోలు ఎముకల వ్యాధిని నిర్ధారించవచ్చు. తక్కువ లక్షణాలు ఉండే వారిలో ఎముకలు పెళుసుగా మారాయని తెలుసుకోలేరు. ఇలాంటి అతిచిన్న లక్షణాలను గుర్తించడానికి, సరైన చికిత్స అందించడానికి DEXAస్కాన్ (బోన్ డెన్సిటీ స్కాన్) సహాయపడుతుంది.

చికిత్స ఇలా..
ఈ వ్యాధి బారిన పడిన వారు వైద్యుల సలహాతో మందులు వాడాలి. వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మధ్యపానం, పొగ తాగడం మానేయాలి. ఎముకల దృఢత్వానికి విటమిన్ డి లభించే ఆహారం తీసుకోవాలి. చికిత్సలో భాగంగా గ్లూటెన్ లభించే పదార్ధాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Published by: Nikhil Kumar S
First published: October 20, 2020, 5:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading