Home /News /life-style /

WORLD NEWS DIWALI CELEBRATION IN ALL OVER WORLD NEPALIS CELEBRATE 5 DAYS FOR DIWALI NGS

Diwali Celebrations: ఆ ప్రాంతంతో దీపావళి వేడుకలు ఐదు రోజులు.. కాకి, కుక్క, ఎద్దులకు పూజ

నేపాల్ లో ఐదు రోజుల పాటు దీపావళి వేడుకలు

నేపాల్ లో ఐదు రోజుల పాటు దీపావళి వేడుకలు

Diwali Celebrations 2021: ప్రపంచ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. సాధారణంగా దీపావళి అంటే లక్ష్మీ దేవిని పూజించడం.. సాయంత్రం బాణాసంచా కాల్చడమే చూస్తూ ఉంటారు.. కానీ ఓ ప్రాంతంలో మాత్రం దీపావళిని ఐదు రోజుల పాటు చేసుకుంటారు. అంతేకాదు కాకి, కుక్కు, ఎద్దు, ఆవులను కూడా అక్కడి ప్రజలు పూజిస్తారు.

ఇంకా చదవండి ...
  Diwali Celebrations 2021: దీపావళి (Diwali) అంటే ఒక్క రోజు పండుగే.. చీకటి పడిన తరువాత రాత్రి వరకు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా బాణాసంచా పేల్చుకోడమే చాలా వరకు అందరికీ తెలిసిన దీపావళి పండుగ అంటే.. అయితే పొరుగు దేశం నేపాల్ (Nepal) లో దీపావళి పండగను ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగను అక్కడ తీహార్  (Thihar) అని పిలుస్తారు. రెండవ ప్రాచుర్యం కలిగిన దీపావళి పండగలో దేవతలతో పాటు.. జంతువులు, పక్షులను పూజిస్తారు. కార్తీక మాసం  (Karithika maasam) కృష్ణ పక్షం రోజులను చాలా పవిత్రంగా భావిస్తారు నేపాలీలు. ఈ సందర్భంగా తీహార్ పండుగలను జరుపుకుంటారు. తీహార్ పండగలో శ్రీ లక్ష్మి, యమ, గోవర్ధన వంటి దేవతలతో పాటు , కాకులు, కుక్కలు, ఆవులు, ఎద్దుల వంటి జంతువులను కూడా పూజిస్తారు. ఇలా చేయడం తమ జీవితాలకు ఆనందం, విజయం, అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నేపాలీలు నమ్మకం. ఇలా ఈ తీహార్ ను జరుపుకోవడానికి ఒక పురాణాల కథ కూడా ఉంది. ఎవరైతే కార్తీక కృష్ణ పక్షం త్రయోదశి, చతుర్థశి ఆ తర్వాతి రోజు తమ తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి ఉండదనీ యమధర్మ రాజు వరం ఇచ్చినట్లు నేపాలీల నమ్మకం. అందుకే అక్కడ దీపావళిని తీహార్ గా ఐదు రోజులు యమ పంచకం పండుగలుగా జరుపుకుంటారు.

  యమ పంచకంలో మొదటి రోజైన కాగ తీహార్ (Caga Thihar) పండుగను జరుపుకుంటారు.  అంటే యమధర్మ రాజు దూతగా భావించే “కాగా” (అంటే కాకి) ని పూజించడం అక్కడ ఆచారం. నేపాలీలు తమ ఇంటి పై కప్పులపై కాకులను ఆహ్వానిస్తూ.. రుచికరమైన ఆహారపదార్ధాలను, స్వీట్లను పెడతారు.

  ఇదీ చదవండి: దీపావళి వేడుకల్లో సెలబ్రిటీల సందడి.. ఎవరు ఎలా చేసుకున్నారంటే..?

  రెండో రోజున కుకుర్ తీహార్ అంటే భైరవుల పండుగ అని పిలుస్తారు. నేపాల్‌లో కుక్కలను స్వర్గపు ద్వారాల సంరక్షకులుగా భావిస్తారు. ముఖ్యంగా నల్లని రంగు కుక్కలను పూజిస్తారు. వాటి ముఖానికి బొట్టు పెట్టి, మెడలో పూల దండలు వేసి, మాంసం, పాలు, గుడ్లు మొదలైన వాటితో పాటు వారికి ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తారు.  అంతేకాదు ఈరోజు వీధి కుక్కలను అధికారులు సత్కరిస్తారు.

  ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్ న్యూస్.. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తగ్గింపు.. ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయంటే.?

  మూడో రోజున పశువుల పండగ జరుపు కుంటారు.  హిందువులు పవిత్రంగా భావించే ఆవును ఆరాధిస్తారు. ఆవుల మెడలో పూలహారాన్ని వేసి.. నుదిటి మీద తిలకంతో అలంకరిస్తారు. లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తూ పూజిస్తారు. ఇంట్లో దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ఇంటి ముందు రంగు ఇసుక, ధ్యానం, పువ్వుల సహాయంతో “రంగోలి” ని వేస్తారు. ఈ సాయంత్రం, పిల్లలు , యువతులు పొరుగు ఇళ్లకు వెళ్లి, సాంప్రదాయ టిహారా పాటలను పాడతారు. చిన్నవారు తమ కుటుంబంలో పెద్దలనుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.

  తీహార్ లోని నాల్గో రోజు గోవర్ధన్ వేడుకలను జరుపుకుంటారు.  ఎద్దులను ఆరాధిస్తారు. తమ వ్యవసాయాన్ని ఎంతో సాయం చేస్తున్న ఎద్దులకు  పూర్తి విశ్రాంతిస్తారు. అంతేకాదు తీహార్లోని నాలుగోరోజు కూడా ప్రజలు తమ ఇండ్లను దీపాలతో అలంక రిస్తారు. అందరూ తలంటుకుని స్నానంచేసి ఎద్దులకు కూడా స్నానంచేయించి, అలంకరించి పూజిస్తారు. ఆవులను పాలు పితకరు, ఎద్దులను పనిలో పెట్టరు. ఇక కన్నయ్య భక్తులు ఈ రోజున గోవర్థన పూజ చేస్తారు. దీని కోసం వారు ఆవు పేడ ను పర్వతంగా మలుస్తారు.

  ఇదీ చదవండి: ఆపరేషన్ పరివర్తన్.. గిరిజన గ్రామాల్లో తీవ్ర ఉధ్రిక్తత.. ఏపీలో గంజాయి లేకుండా చేసేందుకు సీఎం జగన్ ప్లాన్

  యమ పంచకంలో చివరి రోజు ఐదో రోజున భాయ్ టికా పండగను జరుపుకుంటారు. ఈ రోజున యమ ధర్మ రాజు తన చెల్లె లైన యమునా’ ఇంటికి వెళ్ళి బోజనం చేస్తాడని నేపాలీలు నమ్మకం. రాఖీపండగ తీరునే అన్నచెల్లెల పండగను కూడా జరుపుకుంటారు. సోదరులను చెడు నుండి రక్షించమని, సుఖ సంపదలతో జీవించాలి సోదరీమణులు కోరుకుంటూ జరుపుకునే వేడుక.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Diwali 2021, India news, International news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు