హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

World Heart Day 2022: మీ ఒంట్లోని కొవ్వు రంగు ఏంటో తెలుసా? ఈ రంగు కొవ్వు ఉంటే గుండె జబ్బులు తప్పవట.. తెలుసుకోండి

World Heart Day 2022: మీ ఒంట్లోని కొవ్వు రంగు ఏంటో తెలుసా? ఈ రంగు కొవ్వు ఉంటే గుండె జబ్బులు తప్పవట.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మనం శక్తిని కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటామనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ కొవ్వు ఏరంగులో ఉందనేది ఇక్కడ అతి ముఖ్యమైన విషయం. మన శరీరంలో రెండు రంగుల్లో కొవ్వు ఉంటుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  మనం శక్తిని కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటామనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ కొవ్వు ఏరంగులో ఉందనేది ఇక్కడ అతి ముఖ్యమైన విషయం. మన శరీరంలో రెండు రంగుల్లో కొవ్వు ఉంటుంది. మన శరీరంలో తెలుపు, గోధుమరంగు రెండు రకాల కొవ్వులుంటాయి. తెలుపు రంగు కొవ్వు (White fat) కణాల్లో శక్తి నిల్వలు ఉంటే గోధుమ రంగు కొవ్వు (brown fat) కణాలు ఆ కొవ్వు కరిగేందుకు సహాయపడతాయి. కాబట్టి గోధుమ రంగు కొవ్వును అందించే పదార్థాలను ఎక్కువ తినటం వల్ల కూడా శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు. తెలుపు, గోధుమ రంగు కొవ్వు కణాలు ఉష్ణోగ్రతలను బట్టి రూపాల్ని మార్పిడి కూడా చేసుకుంటాయి. అంటే క్యాప్సైసిన్‌ సప్లిమెంట్‌ను తీసుకుంటే శరీరంలో తెల్ల కొవ్వు కణాలు గోధుమ రంగు కొవ్వు కణాలుగా మారిపోయి, ఫలితంగా మెటబాలిక్‌ రేట్‌ పెరిగి ఎటువంటి వ్యాయామం చేయకుండానే బరువు తగ్గుతారని తేలింది. మెటబాలిజంను ప్రేరేపించే కేప్సైసిన్‌ అనే ఓ పదార్థం ఉంది. దీంతో తయారైన సప్లిమెంట్స్‌ తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుందట. క్యాప్సైసిన్ ఎక్కువగా మిరపకాయల్లో ఉంటుంది.

  బెల్లీ ఫ్యాట్ ది ఈ రంగే

  బెల్లీ ఫ్యాట్ (belly fat) త్వరగా ఎందుకు తగ్గదంటే ఇక్కడ తెల్ల కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉంటాయి. బ్రౌన్ ఫ్యాట్ విషయానికి వస్తే మెడ చుట్టూ, భుజాలు, చేతుల చుట్టూ ఈ కొవ్వు ఉంటుంది కనుక వీటిని సన్నబరచటం చాలా సులువు.

  World Heart Day 2022: గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే.. మాంసానికి బదులుగా ఏం తినాలో తెలుసా?

  ఈజీగా కరిగే బ్రౌన్ ఫ్యాట్

  శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించేది బ్రౌన్ ఫ్యాట్. చలి నుంచి మనల్ని రక్షించేలా చేసే బ్రౌన్ ఫ్యాట్ ను కరిగించటం చాలా ఈజీ. అందుకే ఒబేసిటీని (obesity) అదుపులోకి తెచ్చేందుకు ఈ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జోరుగా చేస్తున్నారు. కానీ మన శరీరంలో కేవలం 10శాతం మాత్రమే బ్రౌన్ ఫ్యాట్ నిల్వలు ఉంటాయి. ఎక్కువ శాతం ఉన్న వైట్ ఫ్యాట్ ను బ్రౌన్ ఫ్యాట్ గా మార్చితే సన్నబడటం చాలా ఈజీగా జరుగుతుంది. వైట్ ఫ్యాట్ తక్కువ ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు తక్కువ.

  హైపర్ టెన్షన్ తో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉండేలే చేసే వైట్ ఫ్యాట్ నిల్వలను మీ శరీరంలో కరిగించేలా ప్రయత్నించండి. ఒకవేళ ఎవరైనా ఊబకాయంతో బాధపడుతున్నప్పటికీ వారి ఒంట్లో వైట్ ఫ్యాట్ బదులు బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే వారికి ప్రాణాంతక జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. వైట్ ఫ్యాట్ తో హార్మోనల్ సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే కొందరిలో మాత్రమే జన్యుపరంగా ఎందుకు ఎక్కువ బ్రౌన్ ఫ్యాట్ ఉంటుందన్నది ఇంకా అతుచిక్కని చిక్కుగా మిగిలిపోయింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Health care, Heart Attack

  ఉత్తమ కథలు