Physical Activity Guidelines: కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోగ నిరోధక శక్తి (Immunity Power)ని నాశనం చేసే ఈ మహమ్మారి ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపించింది. అందుకే అందరూ ఇప్పుడు రోగ నిరోధక శక్తి పెంచుకోవడంపై దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా శారీరక శ్రమ, వ్యాయామానికి ప్రాముఖ్యం ఏర్పడింది. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వారంలో కనీసం 150 నిమిషాలు అంటే రెండున్నర గంటలైనా శారీరక శ్రమ చేయాలని తెలిపింది. అధిక బరువు, ఉబకాయం వల్ల తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారు కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరే ప్రమాదముంది. 18 నుంచి 64 ఏళ్ల వయస్సు గల పెద్దవారు వారంలో కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్ర శారీరక శ్రమ చేయాలని WHO ఇదివరకే సిఫార్సు చేసింది. అయితే కొత్త మార్గదర్శకాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, దివ్యాంగులను కూడా చేర్చింది.
శారీరకంగా చురుకుగా ఉండటం ఆరోగ్యం, శ్రేయస్సుకు చాలా ముఖ్యమైందనీ... ఇది జీవితంలో మరిన్ని ఏళ్లు జోడించడానికి సహాయపడుతుందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఓ వార్తా ప్రకటనలో తెలిపారు. ప్రతి కదలికను లెక్కించామనీ, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రతిరోజు వ్యాయాయం చేయాలని తెలిపారు. సురక్షితంగా, సృజనాత్మకంగా మీరు ఎవరనే దానితో సంబంధం లేకుండా ముందడుగు వేయాలని కోరారు.
ప్రతి ఒక్కరూ చరుకుగా ఉండటం వల్ల ప్రయోజనం పొందవచ్చు. అంతేకాకుండా ఏమీ చేయకుండా ఉండటం కంటే శారీరక శ్రమ చేయడం మంచిది. నెమ్మదిగా ప్రారంభించి కాలక్రమేణా తీవ్రతను, వ్యవధిని పెంచాలి. ఇంట్లో లేదా జిమ్‌లో మీ కండరాలను బలోపేతం చేసుకోవచ్చు. శారీరక శ్రమ... గుండె, శరీరానికి చాలా మంచిది.
చిన్న పిల్లలు, టీనేజ్‌కి అవసరం:
కొత్త సిఫార్సుల ప్రకారం చిన్నపిల్లలు ప్రతి రోజు కనీసం 17 నుంచి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఎక్కువగా జాగింగ్, సైక్లింగ్, ఏరోబిక్ లాంటివి చెయ్యాలి. కండరాలు, ఎముకలను బలోపేతం చేసే చర్యలు కూడా అవసరం. పిల్లలు మరింత చురుకుగా ఉండేందుకు మరిన్ని యాక్టివిటీలను ఎంచుకోవచ్చని చిల్డ్రన్ హెల్త్ కేర్ ప్రముఖ డాక్టర్.స్టిఫానీ తెలిపారు. పిల్లలతో కలిసి పనిచేయడం, వ్యాయామం చేయడం, బయటకు వెళ్లి ఆడుకోవడం వల్ల వారిలో చురుకుదనం మరింత పెరుగుతుందని వివరించారు.
ఇది కూడా చదవండి: How to become Rich: ఇవి దానం చేస్తే ధనవంతులవ్వడం ఖాయం... పండితుల సలహా
నడక వల్ల పిల్లలు బోరింగ్ గా ఫీలైతే ఉత్సాహాన్ని కలిగించే స్క్రావేంజర్ హంట్, లేదా ఐ స్పై లాంటి ఆటలు ఆడించడం ద్వారా వారిని ఆనందపరచాలి. టీనేజ్‌లో ఉన్నవారు సంగీతం, వీడియో చాట్ చేయవచ్చు. లేదా ఫిట్ నెస్ యాప్స్‌ను ఉపయోగించవచ్చు. సాధారణంగా పిల్లలు లేదా టీనేజర్లు శారీరక శ్రమ చేయాలనుకుంటే స్నేహితులతో ఉన్నప్పుడో, సరదాగా కోసం, కొత్తగా ఏమైనా చేయాలనుకున్నప్పుడో దృష్టిపెడతారని ఇంగ్లాండ్‌లోని ఎక్స్టర్ వర్సిటీ చిల్డ్రన్ హెల్త్ కేర్ పరిశోధకులు డాక్టక్ గ్రేగ్ తెలిపారు. నడవడానికి ఇష్టపడకపోతే రన్నింగ్, రోలర్ స్కేట్ లేదా డ్యాన్ చేస్తే మంచిదని తెలిపారు. మీ పిల్లలు ఏమనుకుంటున్నారో గమనించి వారిని ప్రోత్సహించండి. వారు చెమటలు పట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నట్లయితే వారు బాగా చేశారని అర్థం చేసుకోవాలి.దీర్ఘకాలికంగా గుండె లేదా జీవక్రియ పరిస్థితుల కంటే యువకులు మానసిక అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదాన్ని వెంటనే కలిగి ఉంటారు. మీరు మీ టీనేజర్లను మరింత చురుకుగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటే శారీరక ఆరోగ్య ప్రభావాల గురించి హెచ్చరించడం కంటే మానసిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రోత్సహించడం చాలా ప్రభావవంతంగా ఉంటుందని లండన్ వర్సిటీ కాలేజీ సైక్రియాట్రిస్ట్ జోసేఫ్ హేస్ తెలిపారు. ఆహ్లాదకరమైన, పోటీలేని కార్యకలపాలు పిల్లలకు జీవితాంతం చురుకుగా ఉండటానికి, సామర్థ్యం, ఆనందాన్ని పెంపొందించడానికి సహాయపడతాయని వాల్ తెలిపారు. అవి వారి ఆత్మగౌరవం, విద్యా ప్రదర్శనను ప్రభావితం చేస్తాయని చెప్పారు.
పెద్దలకు మార్గదర్శకాలు:
64 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న పెద్దలు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల మితమైన ఏరోబిక్స్ లేదా కనీసం 75 నుంచి 150 నిమిషాల పాటు తీవ్రమైన ఏరోబిక్స్, వ్యాయామం చేయాలి. ఫలితంగా గుండె జబ్బులు, రక్తపోటు క్యాన్సర్, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని మార్గదర్శకాల నివేదిక తెలిపింది. కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు వారానికి కనీసం రెండు సార్లు చేయాలి. ఇదే నియమం వృద్ధులకు కూడా వర్తిస్తుంది. అయితే వారు వారంలో కొన్ని రోజులతో సమతూల్యతకు ప్రాధాన్యమివ్వాలి. ఇవి రక్తం సంబంధిత గాయాలను నివారించడంలో సహాయపడతాయి. అలాగే ఎముకల ఆరోగ్యం, సామర్థ్యాన్ని తగ్గుతాయి.
పని, ఇంటి కట్టుబాట్లు వైద్య పరిస్థితులు, ఒంటరితనం కార్యచరణ లక్ష్యాలను తాకడానికి ఆటంకం కలిగిస్తుందని మిస్సోరి కొలంబియా వర్సీటీ న్యూరాలజీ అద్యాపకులు డాక్డర్ అద్నాన్ ఖురేషి అన్నారు. మీ వ్యాయామ దినచర్యను ఎలా రీబుట్ చేయాలో శరీర బరువు కదలికలను నేర్చుకోవాలి. ఈ సమయంలో పెద్ద పరిమాణంలో ఇండోర్ నిరుత్సాహపరుస్తుంది. బహిరంగ కార్యకలాపాలు ఇప్పటికి మంచి ఎంపికలు కావచ్చు అని న్యూయార్క్ కొలంబియా వర్సిటీ న్యూరాలజీ అద్యాపకులు ఇయాన్ గూ అన్నారు.
ఇది కూడా చదవండి: పార్లమెంటులో రచ్చరచ్చ... పంది మాంసం విసురుకున్న ఎంపీలు... వైరల్ వీడియో
ఇండోర్ కార్యకలాపల కోసం ఏరోబిక్స్, పింగ్ పాంగ్ లాంటి అనే ఎంపికలు ఉన్నాయని ఖురేషి తెలిపారు. శారీరక శ్రమ మీ జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుస్తుందో అర్థం చేసుకోవాలి. వ్యక్తులతో పరస్పర చర్య ప్రకృతి లేదా సాంకేతికత లాంటి మరో అభిరుచికి కార్యచరణన లింక్ చేయాలి. గడిపిన సమయాన్ని దూరాన్ని లెక్కించాలి. మీ సాధారణ షెడ్యూల్లో వ్యాయామాన్ని చేర్చాలి. ఉన్న అడ్డంకులను పరిగణించి ఆరోగ్య నిపుణులతో వాటిని అధిగమించడానికి తగిన వ్యూహాలను కనుగొనాలి.
మీరు సాధించిన ప్రయోజనాలు సంభావ్య భద్రతా ప్రమాదాలకు వ్యతిరేకంగా సమతూల్యతను కలిగి ఉండాలి. వారు కలిగి ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి ప్రజలు జాగ్రత్త వహించాలని. వ్యాయామ నియమావళిని ఆచరించే ముందు డాక్టర్ని సంప్రదించాలి.
గర్భిణీలకు సలహాలు:
గర్భం దాల్చిన సమయంలో మహిళలు చురుకుగా ఉండటం వల్ల బిడ్డలకు ప్రయోజనం ఉంటుంది. ఇందులో గర్భధారణ మధుమేహం, డెలివరీ సమస్యలు, ప్రసవానంతర మాంద్యం వంటివి తగ్గుతాయి. వ్యాయమం చేయడం, సరిగ్గా తనిడం, మంచి నిద్రపోవడం, చాలా వ్యాధులను నివారించడానికి ప్రధాన మూడు మార్గాలు. నివేదిక ప్రకారం వారంలో కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. స్ట్రెట్చింగ్ వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. డీహైడ్రేట్ అయ్యే పరిస్థితులు, వ్యాయామాలను ముందే గ్రహించాలి. వాటిలో మైకం, బాధాకరమైన సంకోచాలు, యోని రక్తస్రావం లాంటివి ఉన్నాయి.
దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్నవారికి మార్గదర్శకాలు:
మీకు దీర్ఘకాలంగా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆరోగ్యకరమైన జీవనశైలి ఇప్పటికీ సాధ్యమేనని డబ్ల్యూహెచ్ఓ నివేదిక నొక్కి చెప్పింది. దీర్ఘకాలిక పరిస్థితులు ఉన్న కొంతమందికి సిఫార్సు చేయబడిన కొన్ని శారీరక శ్రమను ప్రదర్శించే సవాళ్లు ఉన్నాయి. రిస్కోస్ గురించి ఆందోళనల కారణంగా శారీరక శ్రమను నివారించవచ్చని అని అమెరికా హెల్త్ పాలసీ ప్రాక్టీస్ అసోసియోట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెజీనా డెవిస్ అన్నారు. ఒకరు చేయగలిగే శారీరక శ్రమ భిన్నంగా ఉండవచ్చు. అయితే ఇందులో ఇంకా ప్రయోజనాలు ఉన్నాయి. కాన్సర్, గుండె జబ్బులు లాంటి వ్యాధులనే కాకుండా శారీరక శ్రమతో ముందస్తు మరణం, వ్యాధి పురోగతి, జీవన నాణ్యత లాంటి ప్రమాదాలను నిరోధిస్తుంది.
దివ్యాంగులకు చిట్కాలు:
శారీరక లేదా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు, వైకల్యం లేని పిల్లలకు ప్రధాన మార్గదర్శకాలు వర్తిస్తాయి. ప్రయోజనాలు ఏవైనా ప్రమాదాలను అధిగమిస్తే చాలని శిశు వైద్యుల లేదా దివ్యాంగ నిపుణుల అభిప్రాయం. శ్రద్ధలో లోపం, హైపర్ యాక్టివ్ డిజార్డర్ లాంటి వ్యాధుల పనితీరును బలహీన పరిచే పరిస్థితులు ఉన్నవారికి వ్యాయామం ముఖ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. దివ్యాంగులైన పెద్దలకు శారీరక శ్రమ వారిలో పనితీరు, బలం, జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. "నిశ్చల, చురుకైన ప్రవర్తన ప్రభావాలకు సాక్ష్యాలు ఉన్నప్పటికీ పొరుగు ప్రాంతాల నుంచి వైకల్యాలున్న వ్యక్తుల మధ్య ఫలితాలు గురించి అంతగా తెలియదు. దీని కోసం డబ్ల్యూహెచ్ఓ వాదించడాన్ని చూడటం చాలా బాగుంది. కానీ శారీరక శ్రమ అనేది ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించి ముఖ్యమైన గుర్తు అని గుర్తించడం వైద్యపరంగా కాకుండా ఆర్థికంగా సాంస్కృతికంగా కాకుండా సమాజానికి దాని ప్రాముఖ్యతను పొందపరచడానికి సహాయపడుతుంది" అని విలియమ్స్ అన్నారు.