• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • WORLD ENVIRONMENT DAY 2020 THEME PLACE ALL YOU NEED TO KNOW ABOUT THE SPECIAL DAY BA

World Environment Day | నేడే ప్రపంచ పర్యావరణ దినోత్సవం... ఈ ఏడాది థీమ్ ఏంటంటే...

World Environment Day | నేడే ప్రపంచ పర్యావరణ దినోత్సవం... ఈ ఏడాది థీమ్ ఏంటంటే...

ప్రతీకాత్మక చిత్రం

జూన్ 5, 2020న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో ఒక్కో చోట సదస్సు జరుగుతుంది.

  • Share this:
    నేడే ప్రపంచ పర్యావరణ దినోత్సం. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ప్రపంచం మొత్తం కొన్నిరోజుల పాటు ఇంట్లో ఉండడంతో పర్యావరణానికి చాలా మేలు జరిగింది. వాతారవణ కాలుష్యం గమనించదగిన స్థాయిలో తగ్గింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు చేయాలనుకుంటున్న పనులు, సాధించాలనుకున్న ప్రగతి కొన్ని రోజుల లాక్ డౌన్ వల్ల సమకూరింది. ఇలాంటి సమయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకొంటోంది మానవాళి.

    2020 థీమ్ ఏంటి?
    1972లో తొలిసారిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత 1974లో ‘ఒకే ఒక్క భూమి’ థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించాలి. ఇలా ప్రతిసారీ ఒక్కో థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటారు. 2019 సంవత్సరంలో ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’పేరుతో చైనాలో సదస్సు నిర్వహించారు. 2020లో థీమ్ ఏంటంటే.. ‘టైమ్ ఫర్ నేచర్.’ జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహిస్తున్నారు. కొలంబియాకు ఉన్న విశిష్టత ఏంటంటే.. ప్లానెట్‌లో ఉన్న బయోడైవర్సిటీలో 10 శాతం ఆ ఒక్కదాంట్లోనే ఉంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో భాగం కావడం వల్ల అది సాధ్యమైంది. పక్షులు, ఆర్చిడ్స్ బయోడైవర్సిటీ కేటగిరిలో కొలంబియా ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది. మొక్కలు, సీతాకోకచిలుకలు, స్వచ్ఛమైన నీటిలో లభించే చేపలు, ఉభయచరాల్లో రెండో స్థానంలో ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు