WORLD EGG DAY 2020 EGGS ARE WELL KNOWN SOURCE OF PROTEIN WHICH IS PERFECT FOR BREAKFAST
World Egg Day 2020: బ్రేక్‌ఫాస్ట్‌గా రోజూ గుడ్డు తింటే.. బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్..
ప్రతీకాత్మక చిత్రం
World Egg Day 2020: అల్పాహారంగా గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుడ్డును అల్పాహారంగా తీసుకుంటే బరువు తగ్గుతారు. గుడ్డులో విటమిన్ ఏ కూడా ఉంటుంది. దీనివలన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
కోడి గుడ్డు.. బోలెడన్ని పోషక పదార్థాలు, ప్రొటీన్లు, కొలైన్ల సమాహారం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తారు. పచ్చి గుడ్డును, ఉడకబెట్టి, ఉడికించిన గుడ్డు బ్రెడ్ ని కలిపి టోస్ట్‌గా, పలావ్‌లలో, బేకరీల్లో కేకుల తయారీకి, ఆమ్లెట్, ఫ్రై ఇలా రకరకాలుగా వాడతాం. ఒక గుడ్డు తినడం వల్ల 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్ శరీరానికి అందుతుంది. ఇందులో అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్, అయోడిన్, సెలీనియం, ఐరన్, జింక్ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే. బరువు తగ్గడానికి ఉపయోగపడడమే కాకుండా, మెదడుకు ఆరోగ్యాన్ని సమకూర్చేందుకు గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డు సొనలో కోలిన్ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడు నుండి సంకేతాలు వేగంగా అందేందుకు కూడా ఉపయోగపడుతుంది.
గుడ్డులో ఉండే ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ విధంగా ఐరన్ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కేన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వేలి గోళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. వాస్తవానికి సూర్యరశ్మి ద్వారా శరీరానికి విటమిన్ డీ లభిస్తుంది. ఎండలో తిరగలేని వారికి గుడ్డు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
ప్రతీకాత్మకచిత్రం
కాగా, అల్పాహారంగా గుడ్డు తింటే మంచిది. గుడ్డును అల్పాహారంగా తీసుకుంటే బరువు తగ్గుతారు. గుడ్డులో విటమిన్ ఏ కూడా ఉంటుంది. దీనివలన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చిన్నపిల్లలకు గుడ్డును ఇవ్వడం వలన వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుడ్డు తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని శాస్త్రీయ పరిశోధనల్లో నిర్థారణ అయ్యింది. అలాగే గుడ్డులో పొటాషియం, కాల్షియం ఉంటుంది. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇలా రోజు ఒక గుడ్డు తీసుకుంటే నరాల బలహీనత తగ్గి, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
రోజూ రెండు గుడ్లు తింటే మీ శరీరంలో ఎర్రరక్త కణాలు మెరుగుపడుతాయని అధ్యయనంలో తేలింది. శరీరంలో గుడ్ కొలస్ట్రాల్ పెంచేందుకు, చర్మ ఆరోగ్యానికి కూడా గుడ్డు దోహదపడుతుంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా గుడ్డును తీసుకోవడం ద్వారా ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
ప్రతీకాత్మక చిత్రం
రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు?
ఆరోగ్యవంతులు రోజూ రెండు గుడ్లు తినొచ్చని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు గుడ్డు ఉపయోగపడుతోంది. గుడ్డులోని సొనలో విటమిన్ డీ ఉంటుంది. ఇది జలుబు, ఫ్లూ సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతోంది. అందుకే కరోనా నేపథ్యంలో రోజూ గుడ్డును తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రోజూ గుడ్డు తింటే సౌడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?
చివరల్లో మరో మాట...గుడ్డు రోజూ తినడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఇప్పటి వరకు ఏ శాస్త్రీయ అధ్యయనంలోనూ నిర్థారణ కాలేదు. అయితే రోజూ ఎన్నంటే అన్ని తినకుండా...రోజూ ఒకట్రెండు గుడ్లు మాత్రమే తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిర్థారించారు.
మరెందుకు ఆలస్యం...ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే ఒకట్రెండు గుడ్డులను రోజూ లొట్టలు వేసుకుంటూ లాగించేయండి.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.