WORLD CANCER DAY HERES WHAT YOU NEED TO KNOW ABOUT WORKING NIGHT SHIFTS SS
World Cancer Day: నైట్ షిఫ్ట్ ఉద్యోగంతో క్యాన్సర్ ముప్పు
World Cancer Day: నైట్ షిఫ్ట్ ఉద్యోగమా? క్యాన్సర్ రావొచ్చు జాగ్రత్త
World Cancer Day | నిద్రలేమికి, డీఎన్ఏ దెబ్బతినడానికి సంబంధం ఉందని తేలింది. డీఎన్ఏ దెబ్బతింటే మళ్లీ బాగుచేయలేమని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకులు వెల్లడించారు.
మీరు తరచుగా నైట్ డ్యూటీ చేస్తుంటారా? అయితే జాగ్రత్త. రాత్రి వేళల్లో నిద్రపోకపోతే మీ ప్రాణానికే ముప్పు. మీ డీఎన్ఏ నిర్మాణం దెబ్బతినడమే కాదు ఫలితంగా అనేక ప్రాణాంతక రోగాలు తప్పవు. నైట్ షిఫ్ట్ డ్యూటీలతో క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయని తేల్చింది ఓ అధ్యయనం. అనస్థీషియా అకడమిక్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయన ఫలితాలు షాకిచ్చేలా ఉన్నాయి. నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవారి డీఎన్ఏ దెబ్బతింటుందని ఆ అధ్యయనంలో తేలింది. పగలు పనిచేసి రాత్రి నిద్రపోయేవారితో పోలిస్తే, రాత్రి పనిచేసి పగలు నిద్రపోయేవారిలో డీఎన్ఏ దెబ్బతినే అవకాశాలు 30 శాతం ఎక్కువ. ఆ తర్వాత నిద్రలేమి కారణంగా మరో 25 శాతం డీఎన్ఏ డ్యామేజ్ అవుతుంది.
28 నుంచి 33 ఏళ్లలోపు గల ఆరోగ్యవంతమైన ఫుల్ టైమ్ డాక్టర్లపై ఈ పరిశోధన జరిగింది. మూడు రోజులపాటు సరైన నిద్రలేని వాళ్ల రక్తాన్ని సేకరించి పరీక్షించారు. అంతేకాదు... నైట్ షిఫ్ట్ చేసినవారి నుంచి అదనంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరిశీలించారు. నిద్రలేమికి, డీఎన్ఏ దెబ్బతినడానికి సంబంధం ఉందని తేలింది. డీఎన్ఏ దెబ్బతింటే మళ్లీ బాగుచేయలేమని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకులు వెల్లడించారు. దీనివల్ల జన్యుపరమైన అస్థిరత, మృతకణాల సమస్య లాంటి హానికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది పరిశోధకుల వాదన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.