Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    World Cancer Day: ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు

    క్యాన్సర్ తొలి దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కుటుంబ ఆరోగ్య చరిత్ర, జన్యుపరమైన రోగాలు, స్థూలకాయం ద్వారా క్యాన్సర్ రిస్క్‌ని విశ్లేషించొచ్చు.

    news18-telugu
    Updated: February 4, 2020, 9:44 AM IST
    World Cancer Day: ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు
    World Cancer Day: ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
    • Share this:
    ఇవాళ వాల్డ్ క్యాన్సర్ డే. క్యాన్సర్ పేరు వింటే చాలు వణికిపోతుంటారు. కారణం... అదో భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి ఆరోగ్యాన్ని క్షీణిపజేయడంతో పాటు మానసికంగానూ దెబ్బతీస్తుంది. అందుకే క్యాన్సర్‍‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ భయంకరమైన వ్యాధి శరీరంలోకి మిగతా భాగాలకూ సోకే ప్రమాదం ఉంది. మరి క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకోండి.

    క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పలు సూచనలు చేసింది. క్యాన్సర్ తొలి దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కుటుంబ ఆరోగ్య చరిత్ర, జన్యుపరమైన రోగాలు, స్థూలకాయం ద్వారా క్యాన్సర్ రిస్క్‌ని విశ్లేషించొచ్చు. శరీరానికి వ్యాయామం లేకపోవడం, రెడ్ మీట్ తీసుకోవడం, సిగరెట్, మద్యం అలవాట్లు క్యాన్సర్‌కు దారితీస్తే ప్రమాదం ఉంది. అందుకే ముందుగానే స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని క్యాన్సర్‌ను అంచనా వేయొచ్చు. 20-49ఏళ్ల మహిళలు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్రెస్ట్, సర్వికల్, కొలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరి. 55 ఏళ్లు దాటిన మహిళలకు లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి.

    ఇక 20-39 ఏళ్ల పురుషులు కొలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. 40 ఏళ్లు దాటినవాళ్లు ప్రొస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. పొగతాగే అలవాటు ఉన్నవాళ్లు, 50 ఏళ్లు పైబడ్డవాళ్లు లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. పొగాకుకు దూరంగా ఉండటం మంచిది. బరువును అదుపులో ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలి. ఆటలు, డ్యాన్సింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటివి క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. వారానికి 150 నిమిషాల వ్యాయామం మంచిది. దాంతోపాటు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారం తీసుకోవాలి. ఆల్కహాల్‌ తగ్గించాలి.

    క్యాన్సర్ అయినా, ఏ భయంకరమైన వ్యాధైనా ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే రిస్క్ తగ్గుతుంది. ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో ఇలాంటి జబ్బులు దరిచేరకుండా చూడొచ్చు.

    ఇవి కూడా చదవండి:

    LIC IPO: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్... మీ డబ్బుకు ప్రభుత్వానిదే గ్యారెంటీ

    Auto Sweep: ఈ టెక్నిక్ తెలిస్తే... మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబుల్ వడ్డీ

    Download Aadhaar: ఈ స్టెప్స్‌తో ఆధార్ కార్డ్ ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు
    Published by: Santhosh Kumar S
    First published: February 4, 2020, 9:44 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading