‘వరల్డ్ క్యాన్సర్ డే’ రోజున ఇవి జరుగుతాయి..

ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ డేగా జరుపుతారు. ఆ రోజున ఏం చేస్తారో తెలుసుకోండి.

Amala Ravula | news18-telugu
Updated: February 3, 2019, 5:52 PM IST
‘వరల్డ్ క్యాన్సర్ డే’ రోజున ఇవి జరుగుతాయి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రతీఒక్కరిని క్యాన్సర్ కబళిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.. ఈ మహమ్మారి గురించి ప్రతీఒక్కరిక అవగాహన కల్పించి.. చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ డేగా ప్రకటించారు.
ఈ రోజున క్యాన్సర్ వల్ల అనారోగ్యం మరియు గణనీయంగా తగ్గించటమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. అందులో ‘నో హెయిర్’, ‘నో బ్రా’ అనేవి ఒకటి.. అంటే.. క్యాన్సర్ పేషెంట్లకి మద్దతుగా తలవెంట్రుకల తీసేయడం, బ్రాలు వేసుకోకపోవడం వంటివి చేస్తుంటారు.


ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC)చే స్థాపించబడ్డ ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతీఒక్కరికీ మద్దతుగా ఉంటూ అండగా మేమున్నామంటూ చేయడమే ఆ కార్యక్రమాల ఉద్దేశ్యం.
ఇక్కడ చెప్పాల్సింది ఒక్కటి చెప్పాలంటే.. సినిమాలోని డైలాగ్‌లా రోగిని ప్రేమించలేనివాళ్లు కూడా రోగితో సమానం అన్నట్లుగా పేషెంట్లకి కావాల్సిన ట్రీట్‌మెంట్‌ కంటే ముందుగా ఓదార్పు, భరోసా కావాలి. కాబట్టి.. క్యాన్సర్ డే రోజున ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి.
First published: February 3, 2019, 5:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading