news18-telugu
Updated: June 3, 2020, 4:38 PM IST
World Bicycle Day 2020: జిమ్‌కు వెళ్లే టైమ్ లేదా? సైకిల్ తొక్కితే ఈ 10 లాభాలు పొందొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)
మీకు సైకిల్ తొక్కే అలవాటు ఉందా? లేకపోతే వెంటనే సైక్లింగ్ అలవాటు చేసుకోండి. రోజూ సైకిల్ తొక్కితే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చు. కరోనా వైరస్ భయంతో జిమ్‌కు వెళ్లడం మానెయ్యాలనుకుంటే సైక్లింగ్ చేయండి. వారానికి ఒక్కరోజైనా సైకిల్ తొక్కితే అనేక లాభాలు. అందుకే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా బైస్కిల్ ప్రాముఖ్యతను గుర్తించడం విశేషం. జూన్ 3... వరల్డ్ బైస్కిల్ డే. ఈ ఒక్కరోజును బైస్కిల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం కాదు... మరి సైకిల్ తొక్కితే వచ్చే లాభాలేంటో తెలుసుకోండి.
మీకు జిమ్‌కు వెళ్లే టైమ్ లేకపోతే పర్లేదు. రోజూ ఇంటి దగ్గరే కాసేపు సైకిల్ తొక్కండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ దగ్గర టూవీలర్ ఉందా? అయినా సరే ఓ సైకిల్ కొనండి. చిన్నచిన్న పనులకు సైకిల్ పైనే వెళ్లండి. శరీరానికి కాస్త వ్యాయామం ఉంటుంది. మీ ఇంటికి ఆఫీస్ నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? అయితే టూవీలర్ పూర్తిగా మర్చిపోండి. సైకిల్ పైనే ఆఫీసుకి వెళ్లండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. పెట్రోల్ వాడరు కాబట్టి పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటుంది. పెట్రోల్ డబ్బులూ మిగుల్తాయి. మిగిలిన డబ్బును సేవింగ్స్‌గా మార్చండి.
సైకిల్ తొక్కితే శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది. అడ్రినలిన్, ఎండార్ఫిన్స్ విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది. సైకిల్ తొక్కడం గుండెకు మంచిది. కేలరీలను కరిగించడంతో పాటు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రోజూ సైకిల్ తొక్కడం బ్రెయిన్ పవర్‌ను పెంచుతుంది. రోజూ సైకిల్ తొక్కే పిల్లల్లో మెదడు చురుకవుతుంది. వయస్సు పెరిగిపోతుందని బాధపడుతున్నారా? వెంటనే సైకిల్ తొక్కడం మొదలుపెట్టండి. యాంటీ-ఏజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
బరువు తగ్గాలా? కండరాలు పెంచాలా? జిమ్ అవసరం లేదు. సైకిల్ తొక్కితే చాలు. బరువు తగ్గడంతో పాటు కండరాలు పటిష్టమౌతాయి. శృంగార జీవితంలో సమస్యలా? సైక్లింగ్‌కు మించిన మెడిసిన్ లేదంటారు వైద్య నిపుణులు. సైక్లింగ్ ఉదరం కిందిభాగంలో కండరాలకు మేలుచేస్తుంది. శృంగార సమస్యల్ని తీర్చుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? దీనికీ సైకిల్ తొక్కడమే మంచి మెడిసిన్. నిద్రపోయే ముందు సైకిల్ తొక్కి అలసిపోతే హాయిగా నిద్రపడుతుంది.
ఇవి కూడా చదవండి:
Coronavirus: ఆయుర్వేదంతో ఇమ్యూనిటీ పెంచుకోండి ఇలా... ఆయుష్ మంత్రిత్వ శాఖ టిప్స్
Food Tips: రోగనిరోధక శక్తిని పెంచే 9 ఆహార పదార్థాలివే...Good News: జన్ ధన్ ఖాతాలోకి డబ్బులు... ఎవరికి ఎప్పుడంటే
Published by:
Santhosh Kumar S
First published:
June 3, 2020, 4:38 PM IST