హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Working Women: వర్కింగ్ ఉమెన్ ఒత్తిడిని దూరంచేసే టిప్స్.. రోజువారీ పనులు ఇలా మ్యానేజ్ చేసుకోండి..

Working Women: వర్కింగ్ ఉమెన్ ఒత్తిడిని దూరంచేసే టిప్స్.. రోజువారీ పనులు ఇలా మ్యానేజ్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Working Women: తల్లిగా ఓ మహిళ బాధ్యతలు ఎంతో సవాల్‌గా ఉంటాయి. మహిళలకు ఓపిక ఎక్కువగా ఉంటుందంటారు. అన్ని రకాల పనులు బ్యాలెన్స్ (Balance) చేసుకోవడానికి.. వారికి టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అవసరం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

తల్లిగా ఓ మహిళ (Women) బాధ్యతలు ఎంతో సవాల్‌గా ఉంటాయి. అయితే ఇంతకంటే కష్టమైనది పిల్లలు, పని బాధ్యతలను బ్యాలెన్స్ చేయడం. ఉద్యోగం చేసే తల్లులు (Working Women) పిల్లలతో పాటు ఇంటి బాధ్యతలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇతరుల కోసం ఎంతో కష్టపడుతున్నా.. వారు తమ కోసం కొంచెం సమయాన్ని కూడా వెచ్చించలేరు. అందుకే మహిళలకు ఓపిక ఎక్కువగా ఉంటుందంటారు. ఇలా అన్ని రకాల పనులు బ్యాలెన్స్ (Balance) చేసుకోవడానికి.. వారికి టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అవసరం. అందుకే రోజువారీ పనుల కోసం సరైన షెడ్యూల్‌ రూపొందించుకోవాలి. అప్పుడు ప్రతిదీ సమయానికి అనుగుణంగా జరుగుతుంది. దీంతో కొంత విశ్రాంతి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు వర్కింగ్ ఉమెన్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడే కొన్ని చిట్కాలను పరిశీలిద్దాం.

* ఆర్గనైజ్‌గా వ్యవహరించడం

వర్కింగ్ ఉమెన్స్ అన్ని పనులను ఒక క్రమ పద్ధతిలో ఆర్గనైజ్డ్‌గా చేయాలి. తమ ప్రాధాన్యతను బట్టి పనులను విభజించుకుంటే అన్నిటినీ సకాలంలో పూర్తి చేయవచ్చు. పైగా విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కూడా దొరుకుతుంది. ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయే ముందు, మరుసటి రోజు కోసం ప్రణాళిక వేసుకోవాలి. తద్వారా పనులను ఎలాంటి ఒత్తిడి లేకుండా సమయానికి పూర్తి చేసుకోవచ్చు.

* మల్టీ టాస్కింగ్

టైమ్ మేనేజ్‌మెంట్‌ కోసం మల్టీటాస్కర్‌గా ఉండటం చాలా అవసరం. ఒకపక్క ఇల్లు, మరోపక్క ఆఫీస్ వ్యవహారాలను చక్కబెట్టాలంటే వర్కింగ్ ఉమెన్ మల్టీ‌టాస్కర్ అవతారమెత్తాల్సిందే. పైగా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అయితే ఇందుకు మీరు మానసికంగా సిద్ధపడాలి.

* నో అని చెప్పడం అలవాటు చేసుకోండి

ఆఫీసులో పని ఒత్తిడి ఉండడం సహజం. ఇది పెరిగేదే తప్ప తగ్గేది కాదు. దీంతో వేరే పని చేయడానికి సమయం ఉండదు. కాబట్టి ఒకరు భరించగలిగినంత మాత్రమే లోడ్ తీసుకోవాలి. ఆఫీస్ లేని సమయంలో పని వస్తే నో చెప్పండి. కొన్నిసార్లు ఇల్లు, ఆఫీసు పనికి నో చెప్పడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అన్ని బాధ్యతలు తీసుకుని సతమతమవ్వడం బదులు కొన్నిసార్లు నో అని చెప్పడం కూడా మంచిదే.

ఇది కూడా చదవండి : సెప్టెంబరులో చూడదగ్గ 5 పర్యాటక ప్రదేశాలు.. ఇంక్రెడిబుల్ ఇండియా.. వెంటనే ప్లాన్ చేసుకోండి..

* షార్ట్‌కట్స్ అవసరం

పనిని త్వరగా ముగించడానికి జీవితంలో కొన్ని షార్ట్‌కట్‌లను అనుసరించడం ముఖ్యం. రేపటి వంట కోసం ముందు రోజు రాత్రే కూరగాయలు కట్ చేస్తే, ఉదయం సమయాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు. అదే సమయంలో, వంట పాత్రలను మీరే కడగడానికి బదులుగా డిష్‌వాషర్లు ఉపయోగించవచ్చు. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. దీంతో మీకోసం కొంత సమయాన్ని గడపవచ్చు.

First published:

Tags: Life Style, Women, Work From Home

ఉత్తమ కథలు