Home /News /life-style /

WOMENS DAY UC BROWSER SURVEY 70 PERCENT OF PEOPLE BELIEVE SMALL CLOTHES ARE THE REASON FOR SEXUAL ABUSE BA

Women's Day Survey | ఆడవారి శానిటరీ ప్యాడ్స్... కొనడానికి సిగ్గుపడని పురుషులు

Good News: మహిళలకు గుడ్ న్యూస్... ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్‌కిన్స్
(Image: News18 Creative)

Good News: మహిళలకు గుడ్ న్యూస్... ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్‌కిన్స్ (Image: News18 Creative)

International Women's Day 2020 | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా UC Browser ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. అందులో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

    UC Browser Survey | ఆడవారి శానిటరీ ప్యాడ్స్ అంటే అదేదో తమకు సంబంధించిన వ్యవహారం కాదనే భావన పురుషుల్లో పోయింది. పురుషులు కూడా దుకాణాలకు వెళ్లి మహిళల కోసం శానిటరీ ప్యాడ్స్ కొని తీసుకుని రావడానికి ఎలాంటి సిగ్గు పడడం లేదు. యూసీ బ్రౌజర్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూసీ బ్రౌజర్ ఓ సర్వే నిర్వహించింది. 2020 మార్చి మొదటి వారంలో 10 భాషల్లో ఈ సర్వే చేపట్టగా అందులో 95,946 మంది నెటిజన్లు పాల్గొన్నారు. ఆ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    ‘మహిళల మీద జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులకు చిన్న దుస్తులే కారణమా?’ అని అడిగిన ప్రశ్నకు 70 శాతం ఔనని సమాధానం ఇచ్చారు. మహిళలు చిన్న చిన్న దుస్తులు వేసుకోవడం వల్లే లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. 38,236 మంది ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వారిలో 26,771 మంది చిన్న చిన్న దుస్తుల వల్లే లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

    ‘మీ ఇంట్లో నిర్ణయాధికారం ఎవరిది? పురుషులదా? మహిళలదా?’ అనే ప్రశ్నకు మెజారిటీ 63 శాతం మంది పురుషులే నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. 30627 మంది ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగా, అందులో 19,196 మంది పురుషులకే ఓటేశారు.

    ‘మహిళల శానిటరీ ప్యాడ్స్ తీసుకురావడానికి సిగ్గుపడుతున్నారా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వారిలో 70శాతం మంది తాము సిగ్గుపడడం లేదని చెప్పారు. మహిళల కోసం తాము శానిటరీ ప్యాడ్స్ కొని తీసుకొస్తామని చెప్పారు. 27056 మంది ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగా, వారిలో 18,621 మంది తాము శానిటరీ ప్యాడ్స్ కొని తెస్తామన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Survey, Womens Day 2020

    తదుపరి వార్తలు