Home /News /life-style /

WOMEN WHO HAVE SEX WITH YOUNGER MEN HAVE MORE SATISFYING FEELINGS AND RELATIONSHIPS ACCORDING TO NEW SURVEY AK

వారితోనే మహిళలకు ఎక్కువ సంతృప్తి... సర్వేలో షాకింగ్ విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తమ కంటే వయసులో చిన్నవారైనా పురుషులతో సెక్స్ చేసే మహిళలు... శృంగారంలో ఎక్కువ సంతృప్తి పొందుతున్నారని స్టడీలో తేలింది.

    ప్రముఖ సెక్స్ సైకాలజిస్ట్ జస్టిన్ లెహ్‌మిల్లర్ స్టడీలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ కంటే వయసులో చిన్నవారైన పురుషులతో సెక్స్ చేసే మహిళలు... శృంగారంలో ఎక్కువ సంతృప్తి పొందుతున్నారని స్టడీలో తేలింది. అనేక మంది సెలబ్రిటీలు సైతం తమ కంటే వయసులో చిన్నవాళ్లతో డేటింగ్, శృంగారం చేయడానికి ఇదే ప్రధాన కారణమని తేలింది. ఇందుకు సంబంధించి దాదాపు 200 మంది మహిళల అభిప్రాయాలను తీసుకున్న జస్టిన్ లెహ్‌మిల్లర్... వాటన్నింటిపై అధ్యయనం చేశారు. వారి సమాధానాలు తెలుసుకున్న తరువాతే మహిళలు తమ కంటే వయసులో చిన్నవారైన పురుషులతో సెక్స్ ద్వారా ఎక్కువ సంతృప్తి పొందుతున్నారనే అభిప్రాయానికి వచ్చారు.

    ఈ స్డడీలో మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. తమ కంటే పదేళ్లు చిన్నవారైన పురుషులతో సెక్స్ చేసే మహిళలు... తమ శృంగారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారని తేలింది. అందుకే తమ కంటే వయసులో పదేళ్లు చిన్నవారైన పురుషులను కొందరు మహిళలు సెక్స్ పార్టనర్స్‌గా ఎంచుకుంటున్నారని సమాచారం. తమ కంటే వయసులో చిన్నవాళ్లైన పురుషులు సెక్స్‌లో యాక్టివ్‌గా ఉండటం వల్ల వివిధ భంగిమల్లో శృంగారం చేసి తమను సంతృప్తి పరుస్తారని కొందరు మహిళలు బలంగా నమ్ముతున్నారని లెహమిల్లర్ స్టడీలో తేలింది.





    First published:

    Tags: Sex Education

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు