హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Fake Orgasm: సెక్స్ ని ఓ బాధ్యతగా చేస్తున్నారా? జాగ్రత్త.. మీ భాగస్వామి ‘ఫేక్ ఆర్గాజమ్’కు గురయ్యే ప్రమాదం ఉందట!

Fake Orgasm: సెక్స్ ని ఓ బాధ్యతగా చేస్తున్నారా? జాగ్రత్త.. మీ భాగస్వామి ‘ఫేక్ ఆర్గాజమ్’కు గురయ్యే ప్రమాదం ఉందట!

 లైంగిక మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరచడానికి ఆహారంలో చేర్చవలసిన విషయాలు : ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మీ రక్త ప్రసరణను పెంచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును తగ్గించడానికి ఇవి చాలా అవసరం మరియు లైంగిక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. మిరపకాయలు మరియు మిరియాలు కూడా రక్తపోటు మరియు వాపు తగ్గించడం వలన రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి.(ప్రతీకాత్మక చిత్రం)

లైంగిక మరియు పునరుత్పత్తి పనితీరును మెరుగుపరచడానికి ఆహారంలో చేర్చవలసిన విషయాలు : ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మీ రక్త ప్రసరణను పెంచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును తగ్గించడానికి ఇవి చాలా అవసరం మరియు లైంగిక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. మిరపకాయలు మరియు మిరియాలు కూడా రక్తపోటు మరియు వాపు తగ్గించడం వలన రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి.(ప్రతీకాత్మక చిత్రం)

మెజార్టీ పురుషులు సెక్స్​ని ఒక బాధ్యతగా చేస్తున్నారే తప్ప.. దాన్ని ఆస్వాదించడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. దీని వల్ల మహిళలు సరిగా భావప్రాప్తి పొందట్లేదని వెల్లడైంది. అందుకే, స్త్రీలు అనేక సందర్భంలో తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నట్లు అధ్యయనం తేల్చి చెప్పింది.

ఇంకా చదవండి ...

మెజార్టీ పురుషులు సెక్స్ (Sex)​ని ఒక బాధ్యత (Responsibility)గా చేస్తున్నారే తప్ప.. దాన్ని ఆస్వాదించడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. దీని వల్ల మహిళలు (Women) సరిగా భావప్రాప్తి పొందట్లేదని వెల్లడైంది. అందుకే, స్త్రీలు అనేక సందర్భంలో తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నట్లు అధ్యయనం తేల్చి చెప్పింది. ఈ అంశంపై సోషల్ సైకలాజికల్ అండ్ పర్సనాలిటీ సైన్స్‌లో ఓ ఆర్టికల్ ప్రచురించింది. స్త్రీలు (Women) తమ భాగస్వామి మగతనాన్ని(Male During Sex) నిలబెట్టుకునే అంశంపై ఏ విధంగా సహాయ పడుతున్నారు? అనే అంశంపై జరిపిన సర్వేలో ఈ ఆసక్తికర విషయం బయటపడింది.ఈ అధ్యయనాలను పరిశీలించిన అమెరికా నిపుణులు ఫేక్ ఆర్గాజమ్ (Fake Orgasm) అనే దృగ్విషయంపై కీలక విషయాలను వెల్లడించారు.

నకిలీ భావప్రాప్తికి కూడా సిద్ధంగా..

లైంగిక కోరికలు బాగానే ఉన్నప్పటికీ మానసికంగా దుర్భలంగా(Sexual Sensitive) ఉన్న పురుషుడిపై మహిళలు జాలి చూపుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ విషయాన్ని వారు గ్రహించిన వెంటనే.. లైంగిక చర్యలో కాస్త సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నట్లు కనుగొన్నారు. ఇటువంటి స్త్రీలు క్రమం తప్పకుండా సెక్స్ చేస్తారని, నకిలీ భావప్రాప్తికి కూడా సిద్ధంగా ఉంటారని, ఫలితంగా వారి ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేస్తారని అధ్యయనం వెల్లడించింది.

మొత్తం 283 మంది స్త్రీలపై జరిపిన సర్వేలో... ఎక్కువ మంది మహిళలు తమ భాగస్వామి పురుషత్వానికి ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారని తేలింది. అంతేగాక, వారి భర్తలు సెక్స్ గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నట్లు సర్వే తేల్చి చెప్పింది.మరో సర్వే ప్రకారం... తమ భాగస్వాముల కంటే ఎక్కువ డబ్బు సంపాదించే మహిళలు ఇతరులతో పోలిస్తే రెండు రెట్లు నకిలీ భావప్రాప్తికి గురవుతున్నారని వెల్లడైంది.

పురుషత్వంపై ప్రభావం..

జంటలో ఒక వ్యక్తి తక్కువ డబ్బు సంపాదిస్తున్నాడనే విషయం అతని పురుషత్వంపై ప్రభావం చూపడమే దీనికి కారణం. ఈ మహిళలు తమ లైంగిక అవసరాలు, వారి సంతృప్తిని త్యాగం చేసి మరీ తమ భాగస్వామి అవసరాలను తీరుస్తున్నారు. ఫలితంగా వారి(పురుషులు) ప్రత్యేక హక్కుగా భావించే మగతనాన్ని అందిస్తున్నారని సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రతినిధి జెస్సికా జోర్డాన్ వివరించారు. మానసిక భారం, విపరీత ఆలోచనలు, తన చుట్టూ ఉన్నవారి అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడం, కుటుంబంలో అందరినీ సంతోషపెట్టేందుకు ప్రయత్నించడం వంటి మహిళల ధోరణి వల్ల వారు లైంగింకంగా ఆనందించలేకపోతున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు.

283 మంది స్త్రీలపై జరిపిన సర్వే..

అదే సమయంలో పురుషులు మాత్రం.. మగతనం అనే ఉచ్చులో చిక్కుకొని భార్యతో సుఖంగా గడపలేకపోతున్నారనిఅధ్యయనంలో బయపటడింది.చాలా మంది పురుషులు పడకగదిలో చేసే పనిని ఓ బాధ్యతగా భావిస్తున్నారని,ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది పురుషులు భార్య మెప్పు పొందేందుకుప్రయత్నిస్తున్నారు తప్ప భావప్రాస్తిని పట్టించుకోవడం లేదని తేలింది.లైంగిక (మానసిక) ఆవేశం, మగతనం అనేవి రెండు భిన్నమైన సామాజిక అంశాలని, లింగ బేధం తొలగింపు, భాగస్వాముల మధ్య సెక్స్ గురించిన అంశాలపై చర్చలతో "ఫేక్ ఆర్గాజమ్"ను బాగు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: Life Style, Sex life, Sexual Wellness

ఉత్తమ కథలు