Life Expectancy: ఆ గ్రామ మహిళల ఆయుర్దాయం 95 సంవత్సరాలు.. రికార్డు స్థాయి ఆయుష్షుకు కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

బ్రిటన్‌ ప్రజల సగటు ఆయుర్దాయం 83 సంవత్సరాలు. కానీ ఈ గ్రామంలో మహిళల ఆయుర్దాయం 95 సంవత్సరాలు. అంటే సాధారణం కన్నా ఇక్కడి పౌరులు 12 సంవత్సరాలు అధికంగా జీవిస్తారన్న మాట. ఇక్కడి పురుషుల సగటు ఆయుర్దాయం 86 సంవత్సరాలు. ఇది మహిళల కంటే 9 సంవత్సరాలు తక్కువ.

  • Share this:
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం జీవించగలుగుతారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ ఆశ్చర్యకరంగా ఎక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు. ఈ కోవలోకే వస్తుంది ఇంగ్లాండ్‌లోని (England) ఒక గ్రామం. ఏకంగా 95 ఏళ్ల ఆయుర్దాయంతో (Life Expectancy of 95 Years) అక్కడి ప్రజలు రికార్డు సృష్టిస్తున్నారు. అక్కడ పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ ఖ్యాతి ఆర్జించిన గ్రామం పేరు డెట్లింగ్‌ అండ్‌ తన్హామ్‌ (Detling and Thurnham). ఈ గ్రామస్తులు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. తినడం, తాగడం, అలవాట్ల విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటారు.

బ్రిటన్‌ ప్రజల సగటు ఆయుర్దాయం 83 సంవత్సరాలు. కానీ ఈ గ్రామంలో మహిళల ఆయుర్దాయం 95 సంవత్సరాలు. అంటే సాధారణం కన్నా ఇక్కడి పౌరులు 12 సంవత్సరాలు అధికంగా జీవిస్తారన్న మాట. ఇక్కడి పురుషుల సగటు ఆయుర్దాయం 86 సంవత్సరాలు. ఇది మహిళల కంటే 9 సంవత్సరాలు తక్కువ.

Telangana Covid Vaccination: తెలంగాణలో నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ బంద్.. కారణమిదే..

ఈ గ్రామంలో బయటే కాదు ఇళ్లలోనూ పొగ తాగడం నిషేధం. బ్రిటన్‌లో ఈ నిషేధం అమల్లోకి రావడానికి 7 సంవత్సరాల ముందే ఈ గ్రామం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇక్కడి వారు ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించడానికి బహుశా ఇది కూడా ఒక కారణమై ఉంటుంది. నార్త్‌ డౌన్స్‌లోని ఇసుకమేటలకు సమీపంలో ఉండే డెట్లింగ్‌ గ్రామ (Detling village) జనాభా 800. దేశంలోని అత్యంత వృద్ధుల జనాభా ఉన్న ప్రాంతాల జాబితాలో ఈ గ్రామం ఉంది. దేశంలోని అతిపెద్ద వయస్కుల జాబితాలో చాలా మంది గ్రామవాసుల పేర్లను బ్రిటీష్‌ ప్రభుత్వం (British Government) చేర్చింది.

Lucky Couple: పెళ్లి జరిగాక హనీమూన్ పక్కన పెట్టిన దంపతులు.. వాళ్లు చేసిన పని కోట్ల వర్షం కురిపించింది.. నాలుగు రోజులకే..

ఆరోగ్యం విషయంలో ఈ గ్రామస్తులు ఎంత శ్రద్ధ తీసుకుంటారంటే ఇక్కడ 8 మంది డాక్టర్లు ఉన్నారు. అంటే ప్రతీ వంది మందికి ఒక డాక్టర్‌. ఇక్కడి ప్రజల ఆయుష్షు ఎక్కువ ఉండటానికి ప్రధాన కారణంగా అందుబాటులో వైద్య సేవలు. ఈ గ్రామంలో సహజసిద్ధంగా ఏర్పడిన ఒక రిజర్వాయర్‌ (Natural reservoir) ఉంది. దాని నీళ్లు అత్యంత పరిశుభ్రమైనవిగా పరిగణిస్తారు. అందరూ ఈ నీటినే వినియోగిస్తారు.

Sajjanar: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ.. వైరల్‌గా మారిన సజ్జనార్ ట్వీట్.. పోస్ట్ మాములుగా లేదుగా..

ఈ గ్రామానికి చెందిన ఐరిన్‌ నోబ్స్‌ (Irene Nobbs) అనే మహిళ తన 102వ పుట్టిన రోజును ఏప్రిల్‌లో జరుపుకున్నారు. హెయిర్‌ డ్రెస్సర్‌గా పనిచేసిన ఆమె ఒక నర్సింగ్‌ హోమ్‌లో నివస్తున్నారు. తీరిక లేకుండా జీవించడం వల్లే తాను ఇంత కాలం బతికానని ఆ బామ్మ మురిసిపోతున్నారు. పరిశుభ్రమైన గాలి, నీరుతో పాటు కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ జీవన నాణ్యత మెరుగ్గా ఉంది. బ్రిటిన్‌ ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇంగ్లాండ్‌లోని బ్ల్యాక్‌పూల్‌లో మహిళల ఆయుర్దాయం 73 సంవత్సరాలు, పురుషులైతే 67 సంవత్సరాలు. ఇక మన దేశం విషయానికి వస్తే ఇక్కడ సగటు ఆయుర్దాయం 69.66 సంవత్సరాలు మాత్రమే.
Published by:Sumanth Kanukula
First published: