స్వరా కంటే ముందే ఆ సీన్ చూపించిన సినిమాలు...

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2019, 2:20 PM IST
స్వరా కంటే ముందే ఆ సీన్ చూపించిన సినిమాలు...
స్వరా భాస్కర్ కంటే ఆ సీన్ చూపించిన సినిమాలు
 • News18
 • Last Updated: June 6, 2019, 2:20 PM IST
 • Share this:
బాలీవుడ్ లో గత వారం విడుదలయిన ‘వీర్ ది వెడ్డింగ్’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ, బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ ఫీమేల్ సబ్జెక్ట్ తో రూపొందిన ఈ సినిమాలో ఓ సన్నివేశం మాత్రం వివాదాస్పదమైంది. మోడ్రన్ అడిక్టెడ్ గర్ల్ పాత్రలో కనిపించిన స్వరా భాస్కర్... ఓ సన్నివేశంలో స్వయంతృప్తి చెందుతూ కనిపిస్తుంది. ఆ సీన్ మీద ట్వీట్లర్లో ట్రోలింగ్ రావడం, దానికి స్వరా కామెంట్ వేయడం కూడా జరిగిపోయింది. అయితే ఇంతకు ముందే కొన్ని సినిమాల్లో ఆడవాళ్లు స్వయంతృప్తి చెందుతున్న సీన్లు ఉన్నాయి. బాలీవుడ్లో ఇలాంటి సన్నివేశాలు చూపించే సాహసం చేసినవారు లేకపోయినా హాలీవుడ్లో మాత్రం చాలా చిత్రాల్లోనే ఈ తరహా ఇంటిమేటెడ్ సీన్లు కనిపించాయి. అవేంటంటే...


 •  నాట్ అనదర్ టీన్ మూవీ
  2001లో విడుదలయిన ఈ టీనేజ్ అడల్ట్ కామెడీ హాలీవుడ్ మూవీలో అభ్యంతర సన్నివేశాలకు కొదువే లేదు. ఈ సినిమా ప్రారంభమే స్వయంతృప్తి సన్నివేశంతో ప్రారంభమవ్వడం విశేషం. అప్పట్లో ఈ సినిమా మీద అనేక వివాదాలు, విమర్శలు వచ్చాయి. అవన్నీ దాటుకుని మంచి వసూళ్లు సాధించి, టీనేజ్ యువత మెప్పు పొందిందీ సినిమా.

 • ప్లెసెంట్ విల్లే
  1998లో వచ్చిన ఈ కామెడీ డ్రామా మూవీలో ఓ సన్నివేశంలో తల్లీకూతుర్ల మధ్య ‘స్వయంతృప్తి’ గురించి చర్చ ఉంటుంది. తండ్రి దూరంగా ఉండడం వల్ల బాధపడుతున్న తల్లి కష్టాన్ని గుర్తించిన కూతురే...వాళ్ల అమ్మకి దీని గురించి వివరిస్తుంది. ఆ తర్వాత సీన్ లో తల్లి స్వయంతృప్తి చెందడం కూడా ఉంటుంది. ఈ సినిమా కూడా చాలా వివాదాస్పదమైంది.

 •  స్లాకర్స్2002లో వచ్చిన ఈ సినిమాలో కూడా తన బాయ్ ఫ్రెండ్ ని ఊహించుకుంటూ స్వయంతృప్తి చెందుతుంది ఓ అమ్మాయి. రొమాంటిక్ కామెడీ సినిమా అయిన స్లాకర్స్ మూవీలో ఈ సన్నివేశం మీద ఎలాంటి వివాదాలు రాకపోవడం ఆశ్చర్యకరం.

 • ది నియాన్ డెమాన్
  2016లో విడుదలయిందీ సినిమా. సూపర్ మోడల్ కావాలనుకునే ఓ అమ్మాయి జీవితంలోకి ఓ దెయ్యం ప్రవేశిస్తుంది. ఆత్మ అని తెలియక ఆ అమ్మాయి, దాంతో చాలా చనువుగా ఉంటుంది. ఇద్దరి మధ్య స్వలింగ సంపర్క సన్నివేశాలూ, స్వయంతృప్తి సన్నివేశాలు చాలా ఉంటాయిందులో.

 • సెక్రటరీ
  2002లో విడుదలయిన ఇంగ్లీష్ డ్రామా మూవీ సెక్రటరీ. బాస్ కీ, సెక్రటరీకి మధ్య జరిగే కథ ఇది. ఇందులో కూడా హీరోయిన్ బాస్ ని తలుచుకుంటూ స్వయంతృప్తి చెందుతూ ఉంటుంది.

 • టు డూ లిస్ట్
  2013లో వచ్చిన అమెరికన్ కామెడీ డ్రామా మూవీ ‘టు డూ లిస్ట్’. ఇందులో కూడా మహిళ స్వయంతృప్తి చెందుతున్న సన్నివేశం ఉంటుంది.

Published by: Ramu Chinthakindhi
First published: June 5, 2018, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading