ఆ విషయంలో ఆడవాళ్లూ అంతే... మగాళ్లలాగే చాలా ఊహించుకుంటారు... పరిశోధనలో వెల్లడి

Sex Dreams : 16 నుంచీ 30 ఏళ్ల వయసున్న మగాళ్లు కంటున్న కలల్లో 25 శాతం బూతు పురాణాలే ఉంటుంటే... అదే వయసున్న ఆడవాళ్లు కంటున్న కలల్లో 22 శాతం అవే ఉంటున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: July 10, 2019, 2:55 PM IST
ఆ విషయంలో ఆడవాళ్లూ అంతే... మగాళ్లలాగే చాలా ఊహించుకుంటారు... పరిశోధనలో వెల్లడి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెక్స్ విషయంలో... మగాళ్లైతే... చాలా మందిని ఊహించుకుంటారనీ... అదే ఆడవాళ్లైతే... ఒకరినే ఊహించుకుంటారనే ప్రచారం అబద్ధమని తేలిపోయింది. ఆడవాళ్లు కూడా చాలా మందిని ఊహించుకుంటారని ఓ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. జర్నల్ సైకాలజీ అండ్ సెక్సువాలిటీ‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం... ఆడవాళ్లకు 50 ఏళ్ల వయసులో కంటే... 16 నుంచీ 30 ఏళ్ల మధ్య... సెక్స్ డ్రీమ్స్ మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని జర్మనీ... ఫ్రీగ్‌బర్గ్ యూనివర్శిటీలోని స్లీప్ పరిశోధకులు తేల్చారు. 1966, 1998లో కూడా ఇలాంటి పరిశోధనలు జరిగాయి. అప్పట్లో 4 శాతం మహిళలకు మాత్రమే సెక్సువల్ డ్రీమ్స్ ఉంటున్నాయని తేలింది. ఇప్పుడు రోజులు మారాయి కదా. సెక్స్ అనే అంశం గురించి మనం ఇలా ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం. అందువల్ల మగాళ్లతోపాటూ... మహిళల్లో కూడా సెక్సువల్ ఆలోచనలూ, డ్రీమ్స్ పెరిగాయన్నమాట. మగాళ్లు ఎలాగైతే... సెక్సీ డ్రీమ్స్‌ని గుర్తుంచుకుంటారో... ఆడవాళ్లు కూడా గుర్తుంచుకుంటారని పరిశోధనల్లో తేలింది.

16 నుంచీ 92 ఏళ్ల వయసున్న 2,907 మందిపై ఈ అధ్యయనం చేశారు. వారిలో (మహిళలు, మగాళ్లు)... 18 శాతం కంటున్న కలలు... డర్టీ పిక్చర్లేనని తేలింది. ఆ కలల్లో కూడా చాలా వరకూ ముద్దాడుతున్నట్లూ, సరససల్లాపాల్లో తేలియాడుతున్నట్లు కంటున్నవేనట.

16 నుంచీ 30 ఏళ్ల వయసున్న మగాళ్లు కంటున్న కలల్లో 25 శాతం బూతు పురాణాలే ఉంటుంటే... అదే వయసున్న ఆడవాళ్లు కంటున్న కలల్లో 22 శాతం అవే ఉంటున్నాయి. చిత్రమేంటంటే... స్పోర్ట్స్, రాజకీయాల్లో పాల్గొనే వారికంటే... సాధారణ వ్యక్తులకు సెక్సువల్ డ్రీమ్స్ మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధనల్లో తేలింది.

ఓవరాల్‌గా పరిశోధనకులు చెబుతున్నదేంటంటే... ఈ రోజుల్లో 16 నుంచీ 30 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు కూడా అబ్బాయిల లాగే... సెక్స్ విషయంలో జోరుగానే ఉన్నారనీ... సిగ్గు, మొహమాటాల్ని పక్కన పెట్టి... ఓపెన్‌గా మాట్లాడుతున్నా్రని అంటున్నారు. అదే ఇదివరకటి తరాల్లో అదే వయసున్న మహిళలైతే... సెక్స్ మాటెత్తితే... సిగ్గుల మొగ్గలై... ముడుచుకుపోయేవారని తేల్చారు. కాలంతో పాటూ వచ్చే మార్పు మంచిదే అంటున్నారు రీసెర్చర్లు.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>