మహిళలు బ్రా తీసేసి తిరగడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆరు రాష్ట్రాల్లో...

మహిళలను టాప్‌లెస్‌గా తిరగనివ్వకపోవడం వల్ల ఆడవారి దేహం, స్థనాలు అంటే కేవలం శృంగారానికి సంబంధించినవనే భావన ఏర్పడుతుందని కోర్టు అభిప్రాయపడింది.

news18-telugu
Updated: September 26, 2019, 8:24 PM IST
మహిళలు బ్రా తీసేసి తిరగడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆరు రాష్ట్రాల్లో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహిళలు టాప్‌లెస్‌గా తిరగొచ్చంటూ అమెరికాలోని ఓ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అమెరికాలోని ఉటా, కొలరాడో, వోమింగ్, న్యూమెక్సికో, కన్సాస్, ఒక్లహామా రాష్ట్రాల్లో మహిళలు ఎదపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా స్వేచ్ఛగా తిరిగేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. #FreeTheNipple అనే ఉద్యమం ఊపందుకుని చివరకు ఇంతవరకు వచ్చింది. మహిళలు పబ్లిక్‌లో టాప్ లెస్‌గా తిరగనివ్వకపోవడం అంటే వారి స్వేచ్ఛకు, లింగ సమానత్వానికి భంగం వాటిల్లినట్టేనంటూ ఇద్దరు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ప్లెయింటిఫ్స్ బ్రిట్ హోగ్‌లాండ్, సమంతా సిక్స్ అనే ఇద్దరు మహిళలు కోర్టులో దావా వేశారు. ఈ సందర్భంగా వారి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘ఎండాకాలం వస్తుంది. పురుషులు స్వేచ్ఛగా చొక్కా విప్పుకుని తిరుగుతూ ఉంటారు. అలాంటి స్వేచ్ఛ మహిళలకు ఎందుకు ఉండదు. మగవారు చేస్తే ఓకే. ఆడవారు చేస్తే తప్పా?. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య భేదం ఎందుకు?’ అని వాదించారు. దీంతో వారి వాదనతో కోర్టు ఏకీభవించింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెద్ద మార్పునకు దారి తీస్తాయని కోర్టు అభిప్రాయపడింది. మహిళలను టాప్‌లెస్‌గా తిరగనివ్వకపోవడం వల్ల ఆడవారి దేహం, స్థనాలు అంటే కేవలం శృంగారానికి సంబంధించినవనే భావన ఏర్పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అభిప్రాయం నుంచి ప్రజలను బయటకు తీసుకురావడం కోసమైనా టాప్ లెస్‌గా తిరగడానికి అనుమతి ఇవ్వాలని కోర్టు అభిప్రాయపడింది. స్థానిక కోర్టు తీర్పు మీద అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేయలేదు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 26, 2019, 8:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading