కాన్పు అయిన నెలరోజులకే మళ్లీ కవలలు... నెలరోజుల్లో ముగ్గురు పిల్లలు...

మొదటి ప్రసవం జరిగిన 26 రోజులకు కవలలు జననం... బంగ్లాదేశ్‌లో వెలుగుచూసిన వైద్య చరిత్రలో అరుదైన సంఘటన...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 28, 2019, 8:33 PM IST
కాన్పు అయిన నెలరోజులకే మళ్లీ కవలలు... నెలరోజుల్లో ముగ్గురు పిల్లలు...
కాన్పు అయిన నెలరోజులకే మళ్లీ కవలలు... నెలరోజుల్లో ముగ్గురు పిల్లలు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 28, 2019, 8:33 PM IST
ఒకే కాన్పులో కవలలు పుట్టడం సహజం. ముగ్గరు, నలుగురు, ఐదుగురు పుట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే కాన్పు జరిగిన నెల రోజుల తర్వాత మళ్లీ ప్రసవం జరిగి, కవలలు పుట్టిన అరుదైన సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది. బంగ్లాదేశ్‌లోని జెస్సోరి ఏరియాకు చెందిన 20 ఏళ్ల అరిఫా సుల్తానా ఐతీ అనే యువతికి ఫిబ్రవరి 25న నొప్పులు వచ్చాయి. వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాడు తన భర్త. సాధారణ ప్రసవంలో ఆమె నెలల నిండని ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన తర్వాతి రోజే తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండడంతో ఇంటికి పంపించారు వైద్యులు. అయితే నెలరోజుల తర్వాత మార్చి 22న సుల్తానాకు మళ్లీ నొప్పులు వచ్చాయి. ప్రసవం జరిగిన నెల రోజులకు నొప్పులు రావడంతో ఏం జరిగిందోననే అనుమానంతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు తన భర్త. ఆమెను పరీక్షించిన వైద్యులు... తన గర్భంతో మరో ఇద్దరు శిశువులు ఉన్నట్టు గుర్తించారు. వెన్నుపూసకు వెనకాల ఉన్న రెండో గర్భాశయంలో ఉన్న ఈ కవలలను సర్జరీ చేసి బయటికి తీశారు. మొదటి ప్రసవం జరిగిన 26 రోజులకు పూర్తిగా నెలలు నిండిన కవలలు జన్మించారు.

10 లక్షల మంది మహిళల్లో ఒక్కరికి మాత్రమే రెండు గర్భాశయాలు ఉంటాయని, వాటిని గుర్తించకపోవడంతో మొదటి కాన్పు సమయంలో రెండో గర్భంలో ఉన్న కవలల గురించి తెలియలేదని తెలిపారు డాక్టర్లు. మొదటి ప్రసవంలో మగబిడ్డకు జన్మనిచ్చిన సుల్తానా... రెండో గర్భంలో ఓ ఆడ, మగ కవలలకు జన్మనిచ్చింది. వైద్య చరిత్రలో ఇలా నెల రోజుల గ్యాప్‌లో కవలలు పుట్టిన అరుదైన సంఘటన మొదటిసారిగా వెలుగుచూసిందని బంగ్లా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. కొన్నిరోజుల కిందట ఇలాంటి సంఘటనే అమెరికాలోనూ వెలుగుచూసింది. కోమాలో జారుకున్న ఓ యువతి, నిద్రలేచేసరికి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు రెండు గర్భశయాలు ఉండడం వల్ల గర్భం దాల్చిన సంగతి కూడా గ్రహించలేకపోయింది.

also Read: తలనొప్పిగా ఉందని పడుకుంది... నిద్ర లేచేసరికి ఏడు నెలల గర్భం...

First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...