శృంగారంలో పార్ట్‌నర్‌కు సంతృప్తి ఇవ్వలేకపోతున్నామని బాధపడుతున్నారా...?

పడకగదిలో సిగ్గు, బిడియం, మొహమాటం అనే పదాలను దరి చేరకుండా ఉండనీయటమే అసలు మందు అని కనిపెట్టారు. ప్రధానంగా శృంగారంలో దంపతులు సరిగమలు అని మొదలు పెట్టి, చివర్లో పదనిసలు దక్కడం లేదని వాపోతుంటారు.

news18-telugu
Updated: October 18, 2019, 9:10 PM IST
శృంగారంలో పార్ట్‌నర్‌కు సంతృప్తి ఇవ్వలేకపోతున్నామని బాధపడుతున్నారా...?
ఆల్కహాల్‌ తీసుకొన్నవారి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 42 శాతం ఎక్కువని చెప్పారు.
news18-telugu
Updated: October 18, 2019, 9:10 PM IST
పెళ్లి తర్వాత దంపతుల మధ్య వచ్చే అసలు సమస్య సంతృప్తి లభించడమే, అయితే పురుషుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా శృంగారంలో పార్ట్ నర్‌కు తృప్తి అందించామా లేదా అనేది, పురుషులకు కలిగే అసలైన సమస్య, అలాగే స్త్రీలలో సైతం తమకు సంతృప్తి కలగకపోయినా ఓపెన్ అయి తమ పార్ట్ నర్ తో చర్చించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధన నిర్వహించింది. ఇందు కోసం ముగ్గురు ప్రసిద్ధ రీసెర్చ్ స్కాలర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా పడకగదిలో సిగ్గు, బిడియం, మొహమాటం అనే పదాలను దరి చేరకుండా ఉండనీయటమే అసలు మందు అని కనిపెట్టారు. ప్రధానంగా శృంగారంలో దంపతులు సరిగమలు అని మొదలు పెట్టి, చివర్లో పదనిసలు దక్కడం లేదని వాపోతుంటారు. అయితే దీనికి పరిష్కారం మనసు విప్పి మాట్లాడుకోవడమే అని పరిశోధకులు తేల్చిచెప్పారు.

ఈ రీసెర్చిలో మొత్తం 48 కేస్ స్టడీస్ చేయగా, అందులో ప్రధానంగా సిగ్గు, బిడియం కారణంగానే తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని, పరిశోధకులు తేల్చి చెప్పారు. అంతేకాదు దంపతులు ప్రతీఏడాది హనీమూన్ ప్లాన్ చేసుకోవాలని, అప్పుడే దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని తేల్చింది. అలాగే దంపతులు ఇరువురు తమకు కలుగుతున్న అసౌకర్యాలను ఓపెన్‌గా డిస్కస్ చేసుకోవడం ద్వారా, సమస్యలు దూరమవుతాయని పరిశోధకులు తెలిపారు.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...