Home /News /life-style /

WOMAN LOVES GROOM FRIEND AND WENT TO HOTEL WITH HIM BUT HEART ATTACK OCCURRED DURING ROMANCE SU

ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన మహిళ.. అక్కడ వరుడి ఫ్రెండ్‌తో లవ్.. రాత్రి హోటల్ రూమ్‌లో అతనితో రొమాన్స్.. కానీ అప్పుడే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తనకు ఇష్టమైన వ్యక్తితో హోటల్ గదిలో రొమాన్స్ చేస్తున్నప్పుడు జరిగినప్పుడు చోటుచేసుకున్న సంఘటన గురించి మహిళ సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఇది తెలుసుకున్న చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    సోషల్ మీడియాలో కొన్ని సందర్బాల్లో చాలా వింత వార్తలను చూస్తుంటాం. చాలా మంది తమ జీవితంలో జరిగిన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవడం పరిపాటిగా మారింది. అయితే Redditలో ఓ మహిళ తనకు ఇష్టమైన వ్యక్తితో హోటల్ గదిలో రొమాన్స్ చేస్తున్నప్పుడు జరిగినప్పుడు చోటుచేసుకున్న సంఘటన గురించి పంచుకుంది. అయితే ఇది తెలుసుకున్న చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘నేను నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాను. అక్కడ నేను వరుడి ఫ్రెండ్‌తో లవ్‌లో పడ్డాను. అతడిని ప్రత్యక్షంగా కలవడం అదే తొలిసారి. గతంలో అతనితో వీడియో కాల్‌లో మాట్లాడాను. కానీ అప్పుడు నా స్నేహితురాలు, ఆమెకు కాబోయే భర్త కూడా ఉన్నారు’అని ఆ మహిళ చెప్పింది.

    ఇక, పెళ్లిలో అతడిని కలవగానే చాలా ఆనందమేసిందని చెప్పింది. వివాహ వేడుకలో అతనితో మాట్లాడనని, పలు సందర్భాల్లో డ్యాన్స్ కూడా చేసినట్టుగా తెలిపింది. ‘పెళ్లి వేడుక ముగిసిన తర్వాత ఇద్దరం కలిసి రాత్రి పూట హోటల్ గదికి వెళ్లాం. అక్కడ రొమాన్స్ చేయడం మొదలుపెట్టాం. అది నా జీవితంలో మరిచిపోలేని అనుభవం. కానీ రొమాన్స్ చేస్తున్న సమయంలో నా గుండెలో నొప్పిగా అనిపించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాను. దీంతో అతడు వెంటనే నా వెన్నుపై నుంచి తట్టడం మొదలు పెట్టాడు. తాగేందుకు నీళ్లు తీసుకొచ్చాడు. రాత్రి మొత్తం నాతో పాటే ఉన్నాడు. అతను నాపై చూపించిన ప్రేమకు నేను చాలా మురిసిపోయాను’అని ఆ మహిళ చెప్పింది.

    Married Woman: అత్తమామలకు ఫోన్ చేసిన అల్లుడు.. అతడు చెప్పిన మాటలు విని షాక్.. అయ్యో పాపం..

    Actress Pragathi: మా ఎన్నికలు.. సహనం కోల్పోయిన నటి ప్రగతి.. అతడిపైకి ఆవేశంగా..

    ఇక, మరుసటి రోజు డాక్టర్ వద్దకు వెళ్లినట్టుగా మహిళ తెలిపింది. రాత్రి జరిగిన విషయం డాక్టర్‌కు వివరించడం సిగ్గుగా అనిపించిందని పేర్కొంది. శారీరక సంబంధం పెట్టుకునే సమయంలో గుండె ఎక్కువగా కొట్టుకోవడం వల్ల.. హార్ట్ అటాక్ వచ్చి ఉంటుందని డాక్టర్ తనకు చెప్పినట్టుగా వెల్లడించింది. అయితే ఈసీజీ రిపోర్ట్ మాత్రం నార్మల్‌గా వచ్చిందని.. కానీ డాక్టర్ సూచన మేరకు కార్డియాలజిస్ట్ వద్దకు వెళ్లానని పేర్కొంది. అక్కడ కూడా జరిగిన విషయాన్ని డాక్టర్‌కు వివరించాల్సి వచ్చిందని.. ఇలా ఇద్దరు డాక్టర్లతో వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం సిగ్గుగా అనిపించిందని తెలిపింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: VIRAL NEWS

    తదుపరి వార్తలు