ఈ టిప్‌తో పట్టుచీరలు ఎప్పుడూ.. కొత్తవిగా ఉంటాయి!

ప్రతికాత్మక చిత్రం

పట్టు వస్త్రాలను వేసుకుంటే ఎంతో అందమైన లుక్‌ ఉంటుంది. ఎప్పుడో వేసుకునే ఈ వస్త్రాలు ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వస్త్రాలు ఖరీదైనవి.

 • Share this:
ఏవైనా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లాల్సి వస్తే.. మొదట మనం ప్రాధాన్యత ఇచ్చేది పట్టుబట్టలకే. ఎప్పుడో ఒకసారి వాడే ఈ పట్టువస్త్రాలు బీరువాలోనే ఎక్కువ రోజులు ఉంటాయి. అయితే, వీటిని ఎక్కువ రోజులు మన్నికగా.. కొత్తవాటిలా ఉండాలంటే కొన్ని టిప్స్‌ పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.

 • పట్టువస్త్రాలను ఎల్లప్పుడూ మృదువైన నీటితోనే ఉతకాలి. కఠిన జలంతో ఉతకకూడదు. నీటిని సాప్ట్‌ చేయడానికి అందులో కాసింత బొరాక్స్‌ల లేదా అమ్మోనియా వేస్తే సరిపోతుంది.

 • నాణ్యమైన సబ్బును పొడి లేదా ద్రవరూపంలో ఉపయోగించాలి. కఠిన జలమైతే డిటర్జెంట్లు వాడాలి.

 • సబ్బులోని మట్టిని తొలగించడానికి పట్టు వస్త్రాలను వేడి నీటిలో రెండుమూడు సార్లు జాడించాలి. ఆ తర్వాత వాటిని చల్లటి నీటిలో జాడించాలి. ఆ నీటిలో కాస్త ఎసిటిక్‌ యాసిడ్‌ లేదా సిట్రిక్‌ యాసిడ్‌ను కలపాలి.

 • ఏదైన ఇతర రంగు పట్టు వస్త్రాలపై పడితే.. వాటిని ఉతికే ముందు 1–2 నిమిషాల పాటు చిటికెడు సిట్రిక్‌ యాసిడ్‌ లేదా ఎసిటిక్‌ యాసిడ్‌ను కలిపిన చల్లటి నీటితో తుడవాలి.

 • పట్టు చీరలను ఉతికి సున్నితంగా నీటిని పిండి, కేవలం నీడ పట్టునే ఆరవేయాలి.

 • పట్టు వస్త్రాలపై రక్తపు మరకలు పడితే.. వాటిని తీసివేయడానికి జాడించే నీటిలో కొన్ని చుక్కల అమ్మోనియా 10 సీసీల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలిపి మరకల మీద రుద్దాలి.

 • చాక్‌లెట్‌ పడితే.. వేడి నీటిలో జాడించి ఉతికితే సరిపోతుంది.

 • కాఫీ లేదా టీ మరకలు పట్టు చీరలపై పడితే.. కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌ను పూయాలి. మరక పోకపోతే దాంట్లోనే హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను కలిపిన వేడినీటితో ఉతకాలి.


ఈ ఒక్క పనిచేస్తే.. స్పైడర్‌ వెబ్ పర్మినెంట్‌గా రాదు!
 • వైన్‌ లేదా శీతల పానియాలు పట్టు బట్టల మీద పడితే.. చల్లటి నీటిలో జాడించి ద్రావణం రూపంలో ఉన్న డిటర్జెంట్‌ను ఉపయోగించి వేడినీటిలో ఉతకాలి.

 • ఇక పట్టుబట్టలను మడతలు పడకుండా.. పరిశుభ్రంగా భద్రపరచాలి. పురుగులు దుమ్మూధూళి పడకుండా.. ఎక్కువ గాలి, కాంతి తగలకుండా కాపాడాలి.

 • కలప మీద పట్టు వస్త్రాలు నేరుగా తాకేల భద్రపరచరాదు.

 • ప్లాస్టిక్‌ సంచుల్లో పెట్టకూడదు. కాటన్‌ సంచుల్లో మాత్రమే ఉపయోగించాలి.

 • అప్పుడప్పుడు వాటికి బయటకు తీయాలి. కాసింత గాలి తగిలేలా చూడాలి.

 • ముఖ్యంగా పట్టుచీరలను భద్రపరచే ప్రదేశంలో సిలికాన్‌ జెల్‌ సంచులను ఉపయోగించాలి.

Published by:Renuka Godugu
First published: