Home /News /life-style /

hair dye: జెట్‌ స్పీడ్‌లో హెయిర్‌ బ్లాక్‌ అవ్వాలంటే.. ఇది కలపండి!

hair dye: జెట్‌ స్పీడ్‌లో హెయిర్‌ బ్లాక్‌ అవ్వాలంటే.. ఇది కలపండి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

natural dye for hair: హెన్నాతో మీ జుట్టు సహజ గోధుమ రంగులోకి మారుతుంది. ఇది మీకు నచ్చకపోతే దీంతోపాటు మరికొన్ని పదార్థాలు కలపాలి.

గతంలో 40 ఏళ్లు పైబడిన తర్వాత జుట్టు నెరిసేది. అయితే, ఇప్పుడు కేవలం 20 ఏళ్ల వయసువారికి కూడా జుట్టు నెరుస్తోంది. ఒకరు యవ్వనంగా (youthful) .. అందంగా కనిపించాలంటే జుట్టు కీలకపాత్ర పోషిస్తుంది.

అందువల్ల ప్రస్తుతం చాలా మందికి బాలనెరుపు సమస్య (grey hair problem) సాధర ణమైంది. మన జుట్టు న ల్లబడటానికి యూమెలనిన్, బయోమెలనిన్‌ అనే వర్ణద్రవ్యాలు కారణం. వీటి వల్ల ముదురు వెంటుకలు, బూడది రంగులోకి మారిపోతాయి.

అదనంగా ధూమపానం (smoking), మద్యపానం, ఫాస్ట్‌ఫుడ్,ప్రోటీన్‌ లోపం, విటమిన్‌ లోపం వంటి జన్యుపరమైన అంశాలు కౌమారదశకు కారణమవుతున్నాయి. పరిష్కారం లేనప్పుడు ఏ ఒక్కరికీ వేరే మార్గం ఉండదు. కానీ, దుకాణాల్లో కొనుగోలు చేసే రంగుల్లో రసాయనాలు ఉండటం వల్ల ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా హెన్నా కీలకపాత్ర పోషిస్తుంది. హెన్నాతో చేసిన రంగు 100 శాతం సహజమైంది. కాబట్టి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

ఇది కూడా చదవండి:  ప్రొటీన్‌ షేక్స్‌ వాడకుండా.. దీంతో మజిల్స్‌ బలోపేతం సాధ్యమే!


హెన్నాతో మీ జుట్టు సహజ గోధుమ రంగులోకి మారుతుంది. ఇది మీకు నచ్చకపోతే దీంతోపాటు మరికొన్ని పదార్థాలు కలపాలి. అవేంటో తెలుసుకుందాం.

బ్లాక్‌ టీని డిస్టిల్‌ చేసి అందులో ఒక గుడ్డు సొన, ఒక టీస్పూన్‌ నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఒక టీస్పూన్‌ కాఫీ పొడి, ఒక టీస్పూన్‌ జామ ఆకు పొడి వేసి ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. దీన్ని మరుసటి రోజు ఉదయం జుట్టుకు పట్టించాలి. సుమారు 2 గంటలపాటు అలాగే ఉంచాలి. మీ షాంపూతో మీ జుట్టును కడగాలి. మీరు గుడ్డు ఉపయోగించకుంటే.. బదులుగా పెరుగు జోడించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జుట్టులోని తెల్లని రంగు మాయమై నల్లగా మారుతుంది.

ఇది కూడా చదవండి: తేనె యాంటీ బ్యాక్టిరియల్‌ లక్షణాలతో.. 5 లాభాలు!


గోరింట ఆకులు రెండు జామ ఆకులు, కాఫీ గింజలు ఒక గిన్నెలో తీసుకుని బాగా గ్రైండ్‌ చేయాలి. దీన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ పేస్ట్‌ను జట్టుకు పట్టించి 30 నిమిషాలు పాటు ఆరనిచ్చి తేలికగా కడగాలి. మీ జుట్టు ముదురు రంగులోకి మారడాన్ని మీరే చూస్తారు.

ఒక గిన్నెలో తగినన్ని నీరు పోసి అందులో టీపొడి వేయాలి. దాన్ని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో జామ ఆకు పొడి., హెన్నా బాగా కలపాలి. పెరుగు, కాఫీ, డికాక్షన్‌ వేయాలి. దీన్ని 1–2 గంటలు నాననివ్వాలి. ఆ తర్వాత జుట్టుకు పట్టించి ఆరనివ్వాలి. దీంతో జుట్టుకు సహజమైన రంగు వస్తుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Hair problem tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు