Kitchen tips: ఈ చిట్కాతో మీ వంటింట్లోకి ఈగలు అస్సలు రావు!

ఇక నాన్‌ వెజ్‌ వంటకాల్లో చికెన్‌ ఎంతో మందికి ఇష్టం. చికెన్‌ వేయించేటపుడు చక్కని రంగు రావాలంటే, మొక్కజొన్న పిండికి బదులుగా పాలపొడిలో అద్ది వేయించాలి. దీంతో చికెన్‌కు భలే రంగు వస్తుంది.

ఇక నాన్‌ వెజ్‌ వంటకాల్లో చికెన్‌ ఎంతో మందికి ఇష్టం. చికెన్‌ వేయించేటపుడు చక్కని రంగు రావాలంటే, మొక్కజొన్న పిండికి బదులుగా పాలపొడిలో అద్ది వేయించాలి. దీంతో చికెన్‌కు భలే రంగు వస్తుంది.

 • Share this:
ఈ వర్షాకాలంలో అనేక రోగాలకు దారితీస్తుంది. ఇప్పటికే కరోనా, డెంగీ Dengue వ్యాధుల విజృంభణ కూడా మొదలయ్యింది. అయితే, ఇంట్లో మనం కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. పని త్వరగా అయిపోవడమే కాకుండా.. వండుకునే ఆహారం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
మనం సాధారణంగా పప్పు ఏదైనా రసం చేసుకుంటే.. సైడ్‌ డిష్‌ తప్పనిసరి ఉండాల్సిందే. కొంత మందికి ఆమ్లెట్‌ చాలా ఇష్టం. అయితే, ఈ ఆమ్లెట్‌ వేసినపుడు గుల్లగా పొంగినట్లు రావాలంటే కొడిగుడ్డు సొనని గిలక్కొట్టే ముందు అందులో చిటికెడ్‌ ఉప్పు వేయాలి. ఆమ్లెట్‌ పొంగుతుంది.

 • బిర్యానీ  biryani చేసేటపుడు బియ్యం కడిగిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి ghee వేస్తే అన్నం పొడిపొడిగా వస్తుంది.

 • పప్పు త్వరగా ఉడకాలంటే అందులో చిన్న కొబ్బరి ముక్క వేయండి.

 • ముఖ్యంగా వంటగదిలో ఈగలు వంటివి రాకుండా ఉండటానికి రెండు చెంచాల వెనిగర్‌లో కొన్ని వేడినీళ్లు వేసి, టేబుల్‌ స్పూన్‌ ఉప్పు కలిపి కిచెన్‌ ప్లాట్‌ఫాంను శుభ్రం చేస్తే కింద ఏదైనా నూనె, ఇతర పదార్థాల వల్ల ఏర్పడిన మొండి మరకలు తొలగిపోతాయి.

 • బంగాళదుంప potato, బెండకాయ వంటి ఫ్రైలు చేసుకునేటపుడు మూకుడు అడుగు భాగానికి అంటుకుంటాయి. అలా కాకుండా ఉండాలంటే.. మూకుడు వేడి అయిన తర్వాతే నూనె వేయాలి.

 • ఏవైనా పండ్లు త్వరగా మగ్గాలంటే.. వాటిని ఓ న్యూస్‌ పేపర్‌లో చుట్టి.. బియ్యం డబ్బాలో పెట్టాలి.

 • ఇక పప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే.. అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరి.

 • పచ్చి బఠాణి ఏడాదిపాటు నిల్వ ఉండాలంటే.. వాటిని ఓ వస్త్రంలో మూటకట్టి ముందుగా వేడినీళ్లలో 3 నిమిషాలపాటు.. మరో మూడు నిమిషాలపాటు చల్లటి నీళ్లలో ముంచాలి. తర్వాత ఎండలో ఆరబెట్టి,వాటిని గాలి వెళ్లని డబ్బాలో వేసి.. ఫ్రీజ్‌లో పెట్టండి.


నిల్వ చేసిన పిండిలో పురుగులు చేరుతున్నాయా? ఈ విధంగా తరిమేయండి!
 • తేనెలో నాలుగు మిరియం గింజలు వేస్తే.. చీమలు చేరవు.

 • అగరబత్తి వెలిగించిన తర్వాత రాలే బూడిదతో ఇత్తడి పాత్రలు తోమితే తళతళమంటాయి.

 • లడ్డూలని ఓ అర నిమిషం మైక్రోవేవ్‌లో ఉంచి తీస్తే తాజాగా ఉంటుంది.

 • ఓవెన్‌ను microwave oven శుభ్రం చేసే ముందు రోజు వంటసొడా చల్లి రాత్రంతా మూత పెట్టాలి. ఉదయమే ఉప్పు,నిమ్మరసం సమానంగా కలిపి శభ్ర పరిస్తే దుర్వాసన రాదు.

 • పసుపునీటితో వంటింటి గట్టును తూడిస్తే.. ఈగలు ముసురుకోవు.

Published by:Renuka Godugu
First published: