హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Hair fall treatment: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? అయితే ఈ చిట్కాతో సమస్యకు చెక్​ పెట్టొచ్చు

Hair fall treatment: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? అయితే ఈ చిట్కాతో సమస్యకు చెక్​ పెట్టొచ్చు

తీవ్ర ఒత్తిడి: ఎమోషనల్ స్ట్రెస్ (Emotional Stress) అధికంగా ఉన్న మహిళల్లో జుట్టురాలడం చాలా తీవ్రంగా ఉంటుంది. కుదుళ్లు బలంగా ఉండాలంటే ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. పదేపదే మానసిక సమస్యల బారినపడే మహిళల తల చూస్తుండగానే బాగా పల్చబడుతుంది. కేశాల క్రమాన్ని పరిశీలిస్తే 3 దశలుంటాయి. మొదటి దశలో తలపై మొలకల్లా వచ్చే వెంట్రుకలు ఆ తరువాతి దశలో పెరుగుతాయి. మూడో దశలో జుట్టు రాలుతుంది దీన్నే రెస్టింగ్ ఫేజ్ అంటారు. కాబట్టి జుట్టు రాలడం చాలా సహజమనే విషయాన్ని అర్థం చేసుకోండి.

తీవ్ర ఒత్తిడి: ఎమోషనల్ స్ట్రెస్ (Emotional Stress) అధికంగా ఉన్న మహిళల్లో జుట్టురాలడం చాలా తీవ్రంగా ఉంటుంది. కుదుళ్లు బలంగా ఉండాలంటే ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. పదేపదే మానసిక సమస్యల బారినపడే మహిళల తల చూస్తుండగానే బాగా పల్చబడుతుంది. కేశాల క్రమాన్ని పరిశీలిస్తే 3 దశలుంటాయి. మొదటి దశలో తలపై మొలకల్లా వచ్చే వెంట్రుకలు ఆ తరువాతి దశలో పెరుగుతాయి. మూడో దశలో జుట్టు రాలుతుంది దీన్నే రెస్టింగ్ ఫేజ్ అంటారు. కాబట్టి జుట్టు రాలడం చాలా సహజమనే విషయాన్ని అర్థం చేసుకోండి.

జుట్టు (hair) మనిషికి అందాన్నిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే పొడవైన కేశాలను చూసి అమ్మాయిలే అసూయ పడుతారట. మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తాయి. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఇంకా చదవండి ...

జుట్టు (hair) మనిషికి అందాన్నిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే పొడవైన కేశాలను చూసి అమ్మాయిలే అసూయ పడుతారట. మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తాయి. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం(hair fall) జరుగుతుంది. జుట్టు(hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. వీటిని నివారించుకోవడానికి (Hair fall treatment) మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (tips) మంచి ఫలితాలను ఇస్తాయి.

నూనెతో తలస్నానం..

ఒకప్పుడు ప్రకృతిలో దొరికే కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె(oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు(hair) అందరికీ ఉండేది. కానీ ఇప్పటి కాలుష్యం, షాంపూలు (shampoo), హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఆ సహజ పదార్థాలతో జుట్టుని కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

కలబంద (Aloe Vera) వల్ల మనుషులకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే జుట్టుకు, చర్మానికి కూడా కలబంద చాలా ఉపయోగపడుతుంది.  కలబంద (Aloe Vera) ,కొబ్బరి నూనె (Coconut oil) ,ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ నూనె తయారీకి మొదట చేయవలసిన పని ఉల్లిపాయను మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ రసం తాజాగా ఉండేలా చూసుకోవాలి. తరువాత కలబంద పేస్ట్ ను , కొబ్బరి నూనెతో ఉల్లిపాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు జుట్టుకు పూయాలి.  తద్వారా మీ జుట్టు అందంగా (Beauty) , మందంగా, పొడవుగా (long) బలంగా కనిపిస్తుంది. ఉల్లి రసం, ఆలివ్ ఆయిల్ (olive Oil) కలిపి తలమీద పూయడంవల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.

ఇది కూడా చదవండి: ఎవరూ లేని స్మశానానికి ఒంటరిగా వెళ్లిన మహిళ.. అక్కడ అస్థిపంజరాన్ని తీసుకొని నృత్యం చేస్తూ..

జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు (dandruff) కూడా ఒకటి. సరైన పోషకాలను అందించకపోతే చుండ్రు తో సహా ఇతర సమస్యలు కూడా వస్తాయి. జుట్టు రాలడాన్ని(hair fall) నివారించడానికి ఉల్లిపాయ రసాన్ని జుట్టు సంరక్షణ దినచర్యలో చేయడానికి ప్రయత్నించండి. మీ జుట్టుకి  ఉల్లిపాయ రసం (Onion Juice) తీసుకొని, అందులో ఒకటి నుండి రెండు టీ స్పూన్ల తేనె కలిపి,  ఈ మిశ్రమాన్ని మీ తల తో సహా జుట్టు అంతా రాయండి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. అంతేకాకుండా మంచి ఆహారం కూడా మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

First published:

Tags: Ayurveda health tips, Hair fall, Hair Loss, Life Style

ఉత్తమ కథలు