హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Flu symptoms: ముక్కు బ్లాక్‌ అయ్యిందా? ఈ 5 ఇంటి చిట్కాలు బెట్టర్‌ రిలీఫ్‌ ఇస్తాయి!

Flu symptoms: ముక్కు బ్లాక్‌ అయ్యిందా? ఈ 5 ఇంటి చిట్కాలు బెట్టర్‌ రిలీఫ్‌ ఇస్తాయి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Flu cases: టీకాలు అందుబాటులో ఉండటం, కొవిడ్‌ 19 కేసుల తగ్గుముఖం.. ప్రజలు గతంలో కంటే మరింత రిలాక్స్‌ అయ్యారు. తక్కువ అప్రమత్తంగా ఉన్నారు. దీంతో ఫ్లూ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది.

కరోనా (covid-19) ఒకవైపు ఫ్లూ సీజన్‌ మరోవైపు ఎన్నడూ లేనివిధంగా భయపెడుతున్నాయి. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (CDC) ప్రకారం 2020–21 సీజన్‌లో ఫ్లూ కేసులు (Flu cases)  అసాధారణంగా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, దీనికి లాక్‌డౌన్, మాస్క్‌ ఆదేశాలు, సామాజిక దూరం, పరిశుభ్రత పద్ధతుల వల్లే అది సాధ్యమైందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రజలు అనుభవించే కొన్ని సాధారణ ఫ్లూ లక్షణాలు తేలికపాటి జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారటం, బాడీ పెయిన్స్‌ వంటి సమస్యలు వస్తాయి. ముక్కు మూసుకుపోయేది ఫ్లూ సూచికనే. ఇది చికిత్స చేయకపోతే.. మనకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అయితే, మీ ముక్కును అన్‌బ్లాక్‌ చేయడానికి ఇక్కడ కొన్ని ప్రభావంతమైన ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: మీకు తెలుసా? ఈ పండు తింటే.. బట్టతల రాదు!


వేడినీరు..

జలుబు, ఫ్లూ లక్షణాలు ముఖ్యంగా ముక్కు మూసుకుపోతుంది. దీనికి వేడినీరు ఉత్తమ మార్గం. దీంతో మీరు హైడ్రేటెడ్‌గా ఉండటం కాకుండా ముక్కు బ్లాకేజీని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీరు, అల్లం, గ్రీన్‌ టీ ముక్కు బ్లాక్‌ను తగ్గిస్తుంది.దీంతోపాటు గొంతునొప్పిని కూడా తగ్గిస్తుంది. ముక్కు బ్లాక్‌కి సంబంధించిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది.

స్టీమింగ్‌..

ముక్కు బ్లాకేజీ చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. ఇది సైనసెస్‌కు సంబంధించిన రక్తనాళాల్లో వాపు వల్ల కలుగుతుంది. అందుకే వెచ్చని ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. వెచ్చదనం తేమతోపాటు వాపును కూడా తగ్గిస్తుంది. తద్వారా ముక్కును క్లీయర్‌ చేయడం సులభతరం అవుతుంది.

దీనికి ఒక గిన్నె వేడి నీటిపై మీ ముఖాన్ని ఉంచి .. మీపై నుంచి టవల్‌ వేసుకోవాలి. 5–10 నిమిషాలు శ్వాస పీల్చుకోవాలి. దీనికి మీ ముఖం కాలిపోకుండా దూరంగా ఉండాలి.

ఇది కూడా చదవండి: ఈ సినిమా చూస్తే.. భార్యాభర్తలు విడాకులు అస్సలు తీసుకోరట!

సెలైన్‌ స్ప్రే...

మీకు ఫ్లూ లేదా జలుబు ఉన్నపుడు మీ ముక్కు బ్లాక్‌ సమస్యకు సెలైన్‌ స్ప్రేలు మంచి మార్గం. ఇది మార్కెట్లో సులభంగా దొరికిపోతుంది. లేకపోతే ఇంట్లో తయారు చేసుకోవడానికి ఇలా చేయండి. ఉప్పునీరు మీ ముక్కు అన్‌బ్లాక్‌ చేయడానికి సహాయపడతాయి. కానీ, ఇది తరచూ చేస్తూ ఉండాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

ఎలా చేయాలి?

ముందుగా స్వచ్చమైన ఉప్పును వెచ్చటి, పరిశుభ్రమైన నీటిని కలపాలి. దీంతో సెలైన్‌ ద్రావణం తయారు చేసుకోవాలి. దీన్ని ఐసోటోనిక్‌ సొల్యూషన్‌ అంటారు. ఇది మీరు తయారు చేసినా.. ఓవర్‌ ది కౌంటర్‌ సెలైన్‌ సొల్యూషన్స్‌ సిఫార్సు చేస్తారు. ద్రావణం తయారైన తర్వాత స్క్వీజ్‌ బాటిల్‌ లేదా బల్బ సిరంజిలో వేసుకోవని ముక్కులో వేసుకోవాలి.

ముక్కు మూసుకుపోవడానికి సహజ మార్గాలు.. స్పైసీ ఫుడ్‌ను తినాలి. మిరపకాయలో క్యాప్సైసిన్‌ ఉంటుంది. ఇది నాసిక మార్గాన్ని ఓపెన్‌ చేస్తుంది.

నోస్‌ కంప్రెస్‌..

ఒక టవల్‌ను గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని పిండి, ఫోల్డ్‌ చేయాలి. అప్పుడు మీ ముక్కు పైభాగంలో పెట్టాలి. వేడి వల్ల ఏదైనా నొప్పి ఉంటే తగ్గిపోతుంది. ఇది ముక్కును సమర్థవంతంగా పనిచేస్తుంది.

Published by:Renuka Godugu
First published:

Tags: Covid cases

ఉత్తమ కథలు