Home /News /life-style /

Beauty: ఈ ఒక్క వస్తువుతో మీ చర్మరంగు మెరుగుపడటం పక్కా..

Beauty: ఈ ఒక్క వస్తువుతో మీ చర్మరంగు మెరుగుపడటం పక్కా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చింతపండు వివిధ ఆహార పదార్థాల్లో రుచులను పెంచడానికి వాడతాం. దీన్ని పానీపూరీ లేదా చాట్‌ మసాలాలకు కూడా జోడిస్తారు. పుల్లని రుచి లేకపోతే కొన్ని ఆహార పదార్థాలు రుచిగా ఉండవు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. చింత గింజలు చర్మ సౌందర్యానికి ఎంతగానో ప్రయోజనం చేస్తాయి.

ఇంకా చదవండి ...
వయస్సు పెరగడం.. కృత్రిమ చర్మ సంబంధిత ఉత్పత్తులతో స్కిన్‌ వదులుగా మారుతుంది. చిన్‌ పార్ట్‌తోపాటు దాని చుట్టూ ఉండే చర్మం సాగినట్లుగా ఉంటే.. దీనికి చింతగింజలు (tamarind seeds) మంచి రెమిడీ. ఈ చింతగింజలను పొడిగా చేసుకోవాలి. దానిలో స్వచ్ఛమైన తేనె (honey) వేసి చర్మంపై మాస్క్‌ మాదిరిగా అప్లై చేసుకోవాలి. ఈ రెమిడీని వారంలో మూడుసార్లు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీకు తెలుసో లేదో? కానీ, ఈ పౌడర్‌తో తయారు చేసిన టీ ను కూడా తాగితే మంచిది. ఇలా చేయడం వల్ల మీ చర్మం టైట్‌గా ఉంటుంది.

డ్రై స్కిన్‌..
మీరు డ్రై స్కీన్‌ (Dry skin) సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ చింత పౌడర్‌ చర్మానికి మంచి హైడ్రేషన్‌ (hydration )ను అందిస్తుంది. ప్రత్యేకంగా వేసవి సమయంలో వివిధ లోషన్లు, క్రీములు పూయడం మాత్రమే పనిచేయవు. ప్రతి రోజూ దీంతో తయారు చేసిన టీ తాగడంతో చర్మం హైడ్రేట్‌ అవుతుంది. ఈ గింజల్లో హైల్‌రోనిక్‌ యాసిడ్‌ నిండి ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఇది కూడా చదవండి: డైపర్‌ గురించి మీకు తెలియని షాకింగ్‌ నిజాలు!


చర్మాన్ని యవ్వనంగా..
ముడతలు, గీతలు, కళ్ల చుట్టూ ముడతలు వృద్ధాప్యానికి సాధారణ సంకేతాలు. వృద్ధాప్యం సహజమే అయినప్పటికీ అటువంటి లక్షణాలను తగ్గించుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తాం. ఈ చింత కాయల్లో చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉండచంలో సహాయపడుతుంది. రోజువారీ గింజలను ఉపయోగించి మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. దీనికోసం చింత గింజల పొడి, బొప్పాయి రసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అదేవిధంగా పొడి చర్మం ఉన్నవారు పాలతో.. జిడ్డు చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టి లేదా శనకపిండితో కలిపి రాసుకోవాలి.

ఇది కూడా చదవండి: వావ్‌..పాడైన పాలతో ఇన్ని ఐటెమ్స్‌ చేసుకోవచ్చా?


మొటిమలకు చెక్‌..
ఈ గింజలు మీకు సహజ మెరుపుతోపాటు వృద్ధాప్య లక్షణాలను రాకుండా చేయటమే కాదు.. మొటిమలను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. చింత గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌(anti bacterial) గుణాలు ఉంటాయి. ఇది బ్యాక్టిరియా నుంచి మిమ్మల్ని కాపాడటమే కాకుండా, అన్ని రకాల స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇక ఈ చింతగింజలను ఎండలో ఆరబెట్టి.. పొడిచేసి.. వీటిలో ఆలివ్‌ నూనెను వేసి కలిపి చర్మంపై పూస్తే.. మీ చర్మ రంగు మరింత పెరుగుతుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Beauty tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు