WISDOM TEETH WHY WE GET WISDOM TEETH SO LATE IN LIFE HERE IS SCIENTISTS EXPLANATION GH SK
Wisdom Teeth: మీకు జ్ఞానదంతం వచ్చిందా? అది ఎందుకు ఆలస్యంగా వస్తుందో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Wisdom Teeth: మనుషుల్లో అన్నింటికన్నా ఆలస్యంగా వచ్చేది జ్ఞానదంతం. ఎందుకు ఇది ఆలస్యంగా వస్తుందనేదానిపై ఇంత వరకు ఎటువంటి పరిశోధన జరగలేదు. వాస్తవానికి జ్ఞానదంతం అనేది మూడో దవడ దంతం. కానీ తాజాగా కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. జ్ఞానదంతం ఎందుకు ఆలస్యంగా వస్తుందో వివరించారు.
మానవ శరీరం (Human Body)లో ప్రతి దశలో మార్పులు చోటుచేసుకుంటాయి. పుట్టిన పిల్లలు పాకేందుకు ఓ వయస్సు, కూర్చునేందుకు ఒక వయస్సు, నిల్చునేందుకు ఒక వయస్సు ఉంటుంది. ఈ ఎదుగుదలతో పాటు హార్మోన్ మార్పులు (Harmon imbalance) కూడా చోటు చేసుకుంటాయి. అయితే మానవ శరీరానికి సంబంధించి దంతాలది (Teeth) కీలకపాత్ర. తినడానికే కాదు ముఖాకృతిలోనూ, తడబడకుండా మాట్లాడటంలోనూ దంతాల పాత్ర గణనీయంగా ఉంటుంది. 6, 12, 18 సంవత్సరాల వయస్సులో మూడేసి దవడ దంతాలు వస్తుంటాయి. ఈ దంతాలు చింపాంజీల్లో 3, 6, 12 సంవత్సరాల వయస్సులో వస్తుంటాయి. మనుషుల్లో అన్నింటికన్నా ఆలస్యంగా వచ్చేది జ్ఞానదంతం. ఎందుకు ఇది ఆలస్యంగా వస్తుందనేదానిపై ఇంత వరకు ఎటువంటి పరిశోధన జరగలేదు. వాస్తవానికి జ్ఞానదంతం (Wisdom Teeth) అనేది మూడో దవడ దంతం.
ఈ విషయంపై పరిశోధన చేసిన ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ (Arizona state university) శాస్త్రవేత్తలు.. ఎట్టకేలకు ఈ గుట్టు కనిపెట్టారు. ఎంత వేగంగా దవడలు పెరుగుతాయి, ముందరి పళ్లు రావడానికి ఎంత సమయం పట్టిందనే దానిపై దవడ దంతాల రాక ఆధారపడి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. మనం తినే ఆహారాన్ని నమిలే క్రమంలో దంతాలపై ఒకింత యాంత్రిక ఒత్తిడి పడుతుంది. అందువల్ల మన దవడ దంతాలు బలంగా ఉండాలి. అందుకే అవి మన నోట్లో వెనుక వైపు ఉంటాయి. అదే జ్ఞానదంతం ముందే వస్తే అది దవడ స్వరూపాన్ని మార్చేస్తుందని పరిశోధనలో గుర్తించారు.
ఈ అధ్యయనం ద్వారా తాము రెండు విషయాలను సాధికారికంగా చెప్పగలమని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. అవేంటంటే మనకు సుదీర్ఘమైన జీవితం ఉంటుంది, మన ముఖాలు పొట్టిగా ఉంటాయి. జంతువులతో పోల్చితే ఆధునిక మానవుల జీవనయానం సుదీర్ఘంగా ఉంటుందని, ఈ క్రమంలో ముఖాలు చిన్నగా మారిపోయి దంతాలు కూడా కురచగా మారిపోయాయని ఈ పరిశోధనలో గుర్తించారు.
చింపాంజీల వంటి జంతువుల్లో ముందుకు పొడుచుకువచ్చేలా ముందు దంతాలు ఉంటాయి. అదే మనుషుల ముఖాలు చదునుగా, అణిగిపోయినట్టుగా ఉంటాయి. ఈ కారణంగానే జీవితంలో బాగా ఎదిగేంత వరకు చివరి దవడ దంతాలకు స్థానం లభించదు.
నిదానమైన మన జీవితం, కురచ ముఖాల కారణంగా మన దవడల ఎదుగుదల నిదానంగా ఉంటుంది. శరీరం తగినంతగా ఎదిగి మెకానికల్గా తగిన స్థలం అందుబాటులోకి వచ్చిందని శరీరం గ్రహించిన తర్వాతే దవడ దంతాల ఆవిర్భావం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్తగా కనిపెట్టిన ఈ విషయాలను శిలాజ మానవ పుర్రెలకు పరిశోధకులు వర్తింపజేయనున్నారు. దవడల ఎదుగుదల ఎప్పుడు నిదానించింది, దవడ దంతాల రాకలో ఎప్పుడు జాప్యం చోటుచేసుకుందనే విషయాలను ఈ కొత్త సిద్ధాంతం ఆధారంగా పరిశోధించనున్నారు. ఈ పరిశోధనలో గుర్తించిన విషయాల ప్రభావం క్లినికల్ డెంటిస్ట్రీపై కూడా ఉండనుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.