Home /News /life-style /

WINTER TIPS DONT WEAR SWEATER AND WOOLEN CLOTHS WHILE SLEEPING IN WINTER SEASON HERE IS DISADVANTAGES SK

Winter Tips: చలిగా ఉందని.. రాత్రిళ్లు స్వెటర్ వేసుకొని నిద్రపోతున్నారా? ఎంత డేంజరో తెలుసా..?

Winter Tips: శీతాకాలంలో స్వెటర్లు ధరించే వారు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుమానం ఉంటే డాక్టర్‌ని సంప్రదించి వాటిని నివృత్తి చేసుకోవాలి.

Winter Tips: శీతాకాలంలో స్వెటర్లు ధరించే వారు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుమానం ఉంటే డాక్టర్‌ని సంప్రదించి వాటిని నివృత్తి చేసుకోవాలి.

Winter Tips: శీతాకాలంలో స్వెటర్లు ధరించే వారు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుమానం ఉంటే డాక్టర్‌ని సంప్రదించి వాటిని నివృత్తి చేసుకోవాలి.

    చలికాలం (Winter)లో చాలా మంది స్వెటర్లు వేసుకోనిదే బయటకు రావు. శీతల గాలుల (Cold Wave) నుంచి రక్షణ పొందటానికి ఉన్ని దుస్తులు (Woolen clothes) ధరిస్తారు. రాత్రిళ్లు కూడా స్వెటర్లు (Sweaters) వేసుకొనే నిద్రపోతారు. తమను తాము వెచ్చగా ఉంచుకోవడానికి.. శరీరంలోని వేడి బయటకు వెళ్లకుండా ఉండేందుకు.. ఉన్ని దుస్తులను వేసుకుంటారు. ఉన్ని దుస్తులు ఉష్ణ వాహకాలు. ఇవి శరీరం నుంచి వెలువడే వేడి బయటకు వెళ్లకుండా లాక్ చేస్తాయి. తద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అందుకే శీతకాలంలో చాలా మంది రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌లు వేసుకొనే నిద్రపోతారు. చలి నుంచి కాపాడుకునేందుకు ఇలా చేస్తారు కానీ.. ఈ చిన్న పొరపాటు మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని తెలుసా..? రాత్రి పూట స్వెటర్ ధరించడం వల్లే కలిగే నష్టాలంటే ఇక్కడ తెలుసుకుందాం.

    సెక్స్​ చేసే ముందు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా ? ఇక్కడ తెలుసుకోండి..

    స్వెటర్ వేసుకుంటే కలిగే నష్టాలు:
    చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అలాంటి సమయంలో ఉన్ని దుస్తులను ధరించి నిద్రపోతే, శరీరంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా కొన్నిసార్లు విశ్రాంతి లేకపోవడం, భయాందోళనల, లో బీపీ వంటి ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కేవలం కాటన్ దుస్తులను వేసుకుని పడుకోవాలని సూచిస్తున్నారు.

    రాత్రిపూట ఉన్ని దుస్తులు ధరించి నిద్రిస్తే.. వాటి వలన చర్మానికి అసౌకర్యంగా అనిపించవచ్చు. ఒక్కోసారి చర్మంపై అలెర్జీ, దురద సమస్య వచ్చే అవకాశముంది. శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే రాత్రి పడుకునే ముందు శరీరం మొత్తానికి బాడీ లోషన్‌ను రాసుకుని.. ఆ తర్వాతే నిద్రపోవడం మంచిది. చర్మం తేమగా ఉంటే అలెర్జీలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

    ముఖంపై నల్లటి మచ్చలు ఉన్నాయా? అయితే ఈ చిన్న టిప్​ ఫాలో అయిపోండి.. చర్మం కాపాడుకోండి..

    మీరు ఒకవేళ గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ స్వెటర్లు వేసుకోవద్దు. ఈ దుస్తుల్లో ఫైబర్.. కాటన్ దుస్తుల్లో ఉండే ఫైబర్ కంటే మందంగా ఉంటాయి. అంతేకాదు ఇన్సులేటర్‌గా పనిచేసే అనేక చిన్న గాలి పాకెట్‌లను కలిగి ఉంటాయి. చలికాలంలో వెచ్చదనం కోసం స్వెటర్ ధరించి.. ఆపై మెందపాటి దుప్పటిని కప్పుకుంటే.. అవి మన శరీరంలో ఉండే వేడిని లాక్ చేస్తాయి. ఈ రెండింటి వల్ల కలిగే వేడి.. డయాబెటిస్ పేషెంట్లకు మంచిది కాదు. ముఖ్యంగా హార్ట్ పేషెంట్లకు ఎక్కువ హాని కలిగిస్తాయి.

    కూరగాయలను ఇలా వాష్ చేస్తే.. పూర్తి పోషకాలు పొందుతారు..!

    ఇలా చేయడం బెటర్..
    చలికాలంలో విపరీతమైన చలిగా ఉంటే.. రాత్రి పడుకునే సమయంలో మీరు కాటన్ లేదా సిల్క్ క్లాత్‌ని ధరించాలి. దానిపై తేలికపాటి ఉన్ని దుస్తులను వేసుకోవడం మంచిది. బాగా చలిగా ఉన్నప్పుడే ఇలా చేయాలి. చలి మమూలుగా ఉన్నప్పుడు స్వెటర్‌లను ధరించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శీతాకాలంలో స్వెటర్లు ధరించే వారు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుమానం ఉంటే డాక్టర్‌ని సంప్రదించి వాటిని నివృత్తి చేసుకోవాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు