Winter Diet: మన భారతీయుల వంటిళ్లలో ఎక్కువగా ఉపయోగించే పదార్థం అల్లం. ఇది కూరలకు మంచి అరోమాను ఇవ్వడమే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అందుకే వంటతో పాటు ఇతర అవసరాలకు కూడా దీన్ని వాడతారు. అయితే దీంట్లో మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ శీతాకాలం చలిలో వేడిగా, ఘాటుగా ఓ కప్పు అల్లం టీ (Ginger Tea) తాగితే ఆ కిక్కే వేరు. అలా అది మనకు మంచి అనుభూతిని కలిగించడమే కాదు, అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలనూ కలిగిస్తుంది.
అల్లం(Ginger) పోషకాల నిధి. దీనిలో కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, కోలిన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అవసరమైన పోషకాలు. అందుకే శీతాకాలంలో అల్లం టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి. ఇది అనారోగ్యాలను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు లాంటి సాధారణ సమస్యలను దూరం చేస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. దీనితో ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవేంటంటే..
చలికాలం చర్మ సంరక్షణకు సూపర్ ఫుడ్స్..వీటితో మెరిసే చర్మం మీ సొంతం
ఒత్తిడి దూరం
అల్లం టీ ఒత్తిడి, అలసటను అధిగమించడంలో సహాయపడుతుంది. దీనిలో మనసుకు సాంత్వననిచ్చే లక్షణాలు ఉన్నాయి. దీంతో ఇది ఒత్తిడిని తగ్గించడంలో బాగా పని చేస్తుంది. దాని బలమైన సువాసన, రుచి చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటాయి.
శ్వాసకోశ సమస్యలకు చెక్
ఒక కప్పు అల్లం టీ తాగడం ద్వారా సీజనల్‌గా వచ్చే అలర్జీలను సహజంగా తగ్గించుకోవచ్చు. సాధారణ జలుబు వల్ల వచ్చే సమస్యలను అల్లం టీ తగ్గిస్తుంది.
Health Tips: ఉదయాన్నే టీతో టోస్ట్ని ఇష్టంగా తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?
పీరియడ్స్ పెయిన్ మాయం
నెలసరి సమయంలో వచ్చే నొప్పిని అల్లం టీ దూరం చేస్తుంది. అల్లం టీలో టవల్‌ను నానబెట్టి పొత్తికడుపుపై ఉంచితే, అక్కడి కండరాలు రిలాక్స్ అవుతాయి. ఒక కప్పు అల్లం టీలో తేనె కలిపి తాగితే, పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పి తగ్గుతుంది.
సీజనల్ వ్యాధులు దూరం
అల్లం ఇన్ఫెక్షన్ల నుండి రక్షించే యాంటీ బయాటిక్ లక్షణాలను కలిగి ఉంది. శీతాకాలంలో దగ్గు, జలుబు, కఫం, చర్మంపై పుండ్లు పడటం లాంటివి సాధారణంగా కనిపిస్తాయి. ఇలాంటి సీజనల్ వ్యాధులకు అల్లం టీ చెక్ పెడుతుంది.
రక్త ప్రసరణ
సాధారణంగా చలికాలంలో శరీరంలో రక్తప్రసరణ కాస్త నెమ్మదిస్తుంది. ఫలితంగా అనేక సమస్యలు వస్తాయి. అల్లంలో మెగ్నీషియం, క్రోమియం, జింక్ ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణను పెంచడానికి ఉపయోగపడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ginger, Health, Life Style, Tea