WINTER IS THE PERFECT TIME FOR WEIGHT LOSS STUDIES REVEALED RNK
Weight loss in winter: శీతాకాలం బరువు తగ్గొచ్చని.. ఇలా చేస్తే..!
ప్రతీకాత్మక చిత్రం
Weight loss exercise in winters: బరువు తగ్గడం ఎలా అనే ప్రశ్నకు మీరు విభిన్న సమాధానాలు పొందవచ్చు. కానీ, మీరు ఆరోగ్యకరమైన రీతిలోనే బరువు తగ్గాలనుకుంటే.. చేయాల్సిందల్లా, రెగ్యూలర్ ఎక్సర్సైజ్, ఆహారం
వాతావరణ మార్పు, బరువు తగ్గడానికి (weight loss)మధ్య సంబంధం ఉందని ఒక అధ్యయనం తేల్చింది. స్థూలకాయం (obesity) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఇది ఒక్కటి. చాలా మంది వివిధ పద్ధతుల్లో బరువు తగ్గటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వెయిట్ తగ్గటానికి శీతాకాలం ఉత్తమ సమయం అని తాజా అధ్యయనం ప్రకటించింది. శీతాకాలం దాదాపు సమీపిస్తున్నందుకు బరువు తగ్గేవారికి ఈ అధ్యయనం శుభవార్త చేప్పినట్లైంది.
బరువు తగ్గడం (weight loss )ఎలా అనే ప్రశ్నకు మీరు విభిన్న సమాధానాలు పొందవచ్చు. కానీ, మీరు ఆరోగ్యకరమైన రీతిలోనే బరువు తగ్గాలనుకుంటే.. చేయాల్సిందల్లా, రెగ్యూలర్ ఎక్సర్సైజ్, ఆహారం, మీ రోజువారీ అలవాట్లలో మార్పు. మీరు తీసుకునే చిన్న చర్య వల్ల.. అతిపెద్ద మార్పును తెస్తుంది.
సాధారణంగా వేసవి నెలలు కేలరీలను బర్న్ చేయడానికి ఉత్తమ సమయం. అందువల్ల బరువు తగ్గించే ప్రయత్నాలు వేసవిలో ఉత్తమ ఫలితాలను ఇస్తుందని విస్త్రతంగా చేప్పారు. అయితే, సెల్ రిపోర్ట్స్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం శీతాకాలం బరువు తగ్గడానికి ఉత్తమ సమయం.
వాతావరణం చల్లగా ఉన్న కాలంలో వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహాయపడుతుంది. అదనంగా ఎక్కువ కేలరీలు బర్న్ చేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని అధ్యయనం తేల్చింది.
వాతావారణ మార్పులతో బరువు సంబంధం ఏంటి?
కోపెన్హాగన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనంలో 8 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విద్యార్థులు చలికాలంలో స్విమ్మింగ్ సాధన చేశారు. మరొక సమూహం కొన్ని వాతావరణ పరిస్థితుల్లో ఈతకు అలవాటు పడింది.
చలికాలంలో స్విమ్మింగ్ సాధన చేసిన వారు వాతావరణ మార్పులకు సులభంగా అలవాటు పడగలిగారు. వారు సులభంగా చల్లని వాతావరణం నుంచి వేడి వాతావరణానికి లేదా వేడి వాతావరణం నుంచి చల్లని వాతావరణానికి మారగలిగారు. అదనంగా వీట్ఫ్యాట్ అని పిలిచే.. ఒక నిర్ధిష్ట బాడీఫ్యాట్ శీతాకాలపు ఈతగాళ్ల శరీరంలో సులభంగా సక్రియం జరిగింది.
ఈ ఫ్యాట్ శీతాకాలంలో లేదా చల్లని వాతావరణంలో మీ శరీర టెంపరేచర్‌కు సహాయపడుతుంది. చలికాలంలో రక్షణ ఆచరణాత్మకంగా అదనపు వేడిని ఉత్పత్తి చేస్తుంది. శరీరం ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసినప్పుడు ఎక్కువ కేలరీలు కాలిపోతాయి. అంతేకాదు, వీట్ ఫ్యాట్ ఉండే వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కాబట్టి రాబోయే చలికాలం ప్రయోజనాన్ని పొందండి. ఆరోగ్యంగా బరువు తగ్గించే ప్రయత్నంలో మీ లక్ష్యాన్ని సాధించండి.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.