#Winter Tips: చలికాలంలోనూ చర్మం మెరవాలంటే..

చర్మాన్ని ఎప్పటికప్పుడూ జారోగ్యంగా ఉండేలా కాపాడుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో ఈ అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది. లేకపోతే చర్మం పగుళ్ళు, నిర్జీవంగా మారడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Amala Ravula | news18-telugu
Updated: January 16, 2019, 7:17 PM IST
#Winter Tips: చలికాలంలోనూ చర్మం మెరవాలంటే..
చలికాలంలో చర్మసంరక్షణ
Amala Ravula | news18-telugu
Updated: January 16, 2019, 7:17 PM IST

15చర్మాన్ని ఎప్పటికప్పుడూ జారోగ్యంగా ఉండేలా కాపాడుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో ఈ అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది. లేకపోతే చర్మం పగుళ్ళు, నిర్జీవంగా మారడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎక్కువగా వేడి నీటిని వాడడం, ఆవిరిపట్టడం మంచిది కాదు.. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉందని చాలామంది పొగలు కక్కే వేడినీరును స్నానానికి ఉపయోగిస్తారు. అయితే ఇది అంతగా మంచిది కాదు.. వేడి నీరు శరీరంలోని తేమని పూర్తిగా హరించివేస్తుంది. కాబట్టి అంతగా వేడి కాకుండా.. మరి చన్నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది.. అదే విధంగా.. చాలామంది జలుబు చేస్తుంది. దీంతో ఆవిరి పడుతుంటారు.. దీనివల్ల శరీరంలోని నీరంతా ఆవిరి రూపంలో బయటికి వచ్చి చర్మం డీహైడ్రేట్ అవుతుంది.
స్నానానికి ముందు శరీరానికి ఆయిల్ రాసుకోవాలి.. స్నానం చేసిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ రాయడం వల్ల స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది.

డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే.. పంచదార, ఆల్కహాల్ మరియు కాఫీ ఇవి స్కిన్‌ని డీహైడ్రేట్ చేస్తుంటాయి.. కాబట్టి.. చలికాలంలో వీటికి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. అదే విధంగా..సరిపడా నీటిని తీసుకోవడం.. చర్మం యొక్క పీహెచ్ లెవల్‌ని బ్యాలెన్స్ చేసే టోనర్‌ని ఎప్పుడూ దగ్గర ఉంచుకోవడం మంచిది.
ఎక్స్‌ఫోలియేట్..వింటర్‌లో చర్మాన్ని ఎక్స్‌ఫోలియెట్ చేయడం కూడా చాలామంచిది. అయితే రెగ్యులర్‌గా కాకుండా వారానికి రెండుసార్లు మాత్రమే చేయడం మంచిది. ఇది కూడా క్లెన్సర్ రాసిన తర్వాత.. మాయిశ్చరైజర్ రాయడానికి ముందు చేయడంతో డెడ్ స్కిన్ తొలగిపోతుంది. చర్మరంధ్రాలు కూడా శుభ్రపడతాయి.
డైట్‌లో పండ్లు చేర్చుకోండి...తినే ఆహారంలో పండ్లు చేర్చుకోవడం మంచిది. ఇంద్రధనస్సు రంగుల మాదిరి.. అన్ని రంగులు కలిగిన పండ్లు తీసుకోవడం మంచిది.. దీని ద్వారా చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. కేవలం తినడమేకాదు.. వాటిని ఫేస్ మాస్క్‌గా కూడా ఉపయోగించొచ్చు.

Loading....


కలబందను రాయండి..
అలోవేరాని రాయడం వల్ల చర్మానికి విటమిన్ సి, ఈ మరియు బెటాకెరోటిన్ పుష్కలంగా లభింస్తుంది. ఇది చర్మానికి మంచి యాంటీఏజింగ్ ప్రాపర్టీలా ఉపయోగపడుతుంది. ఇది జిడ్డుగా కూడా ఉండకపోవడం వల్ల ఆయిలీ స్కిన్ వారు కూడా రాయొచ్చు.
యోగా చేయడం..
యోగాని జీవిన విధానంలో భాగం చేసుకుంటే మంచిది. దీనివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. ఆక్సిజన్ బాడీలో చేరడం వల్ల కణాలు ఉత్తేజితమవుతాయి.. దీంతో.. చర్మం మెరుస్తూ ఉంటుంది.

First published: January 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు